
సాక్షి, తిరుపతి: తిరుపతి కోఆపరేటివ్ టౌన్ ఎన్నికలకు బుధవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కాగా, 12 డైరెక్టర్ పదవులకు గాను 45 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ నేతలు కావాలనే రాద్దాంతం చేస్తున్నారు. దొంగ ఓట్లు వేసే వ్యక్తుల్ని వారే తీసుకు వచ్చి.. ఇక్కడ ఏదో జరుగుతోంది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు వస్తుంటే..కావాలనే డ్రామాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాలు వద్ద దొంగ ఓట్లు అంటూ డ్రామాలకు తెర లేపారు. వారంతట వేరే పోలీసులు అదుపులోకి తీసుకునే విధంగా డ్రామాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment