బొగోటా : మెక్‌డోనాల్డ్స్‌లోకి దూరి చోరీచేసిన ఓ మహిళ ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి అంటూ కొలంబియా హోవార్డ్ కౌంటీ పోలీసులు గురువారం ప్రకటించారు. మహిళ చోరీకి పాల్పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నవంబర్ 5న అర్థరాత్రి వేళ మెక్‌డోనాల్డ్స్ లోకి ఓ మహిళ ప్రవేశించింది. మొదట ఓ కిటికీలోంచి తనకు కావాల్సిన కూల్ డ్రింక్ తీసుకోవాలని చూడగా వీలు కాలేదు.
అతికష్టం మీద కిటికీలోంచి లోనికి ప్రవేశించిన ఆ మహిళ క్యాష్ కౌంటర్లో నగదుతో పాటు కొన్ని వస్తువులను కాటన్‌లో వేసుకుని అక్కడినుంచి పరారైంది. పదిరోజుల పాటు వెతికినా ఆమె జాడ తెలియకపోవడంతో.. ఆమె ఆచూకీ తెలిపిన వారికి 500 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 32 వేలు) అందజేస్తామని హోవార్డ్ కౌంటీ పోలీసులు చోరి వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అది మొదలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Recognize this suspect? #HoCoPolice offering up to a $500 reward for info on suspect who stole cash and food in Nov. 5 burglary at McDonald's in Columbia. Call 410-313-STOP or HCPDcrimetips@howardcountymd.gov. pic.twitter.com/Iq3VWu6ZVF
— Howard County Police (@HCPDNews) 14 November 2017
Comments
Please login to add a commentAdd a comment