రామవరప్పాడు: పూజ పేరుతో మోసగించి బంగా రంతో ఓ మాయలేడి పరారైన ఘటన విజయ వాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో గురువారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. ప్రసాదంపాడులో మాజీ వార్డు సభ్యుడు విజ్జి రామారావు తన భార్య లక్ష్మి, కూతురు గౌతమితో నివాసం ఉంటున్నాడు. గుర్తుతెలియని మహిళ సోది చెబుతానంటూ విజ్జి రామారావు ఇంటికి వచ్చింది. మీ ఇంట్లో కీడు జరుగుతుందని, పూజ చేస్తే పరిహారం అవుతుందని రామారావు భార్య లక్ష్మిని నమ్మించింది.
ఇటీవల ఇంటి పెద్ద విజ్జి చిన్నారావు అనారోగ్యంతో మృతి చెందడంతో సులువుగా ఆమె మాట లను నమ్మారు. పూజలో బంగారు వస్తువులు ఉంచాలంటూ నమ్మించి లక్ష్మి, గౌతమి, రామారావు తల్లి శాంతమ్మ ఒం టిపై ఉన్న మొత్తం (సుమారు 5 కాసుల) బంగా రం ఇవ్వాలని కోరింది. ఆమె మాటలు నమ్మిన వారంతా బంగారం తీసి ఇచ్చారు. బంగారాన్ని ఒక బాక్సులో ఉంచి దానికి దారం కట్టి బీరువాలో ఉంచి గంట తర్వాత తీసుకోవాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె మాటలపై అనుమా నం వచ్చి బాక్సును తీసి చూడగా బంగారం లేదు. ఇంతలో ఆమెను పట్టుకోండంటూ అరుచుకుం టూ రోడ్డుపైకి వెళ్లేసరికి అప్పటికే సిద్ధంగా ఉన్న ఆటో ఎక్కి పరారైంది. అయితే, పూజ జరిగే సమయంలోనే అనుమానం వచ్చిన రామారావు కూతురు గౌతమి మాయలేడిని సెల్‌ఫోన్‌లో ఫొటో తీసింది.
Comments
Please login to add a commentAdd a comment