మలద్వారంలో బంగారం స్మగ్లింగ్‌ | Gold Smuggling Gang Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

మలద్వారంలో బంగారం స్మగ్లింగ్‌

Oct 21 2019 8:00 AM | Updated on Oct 21 2019 8:11 AM

Gold Smuggling Gang Arrest in Hyderabad - Sakshi

స్వాధీనం చేసుకున్న బంగారం

శంషాబాద్‌: అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న నలుగురు   ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్, డీఆర్‌ఐ అధికారులు పెద్దమొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి ఎయిర్‌ ఇండియా విమానంలో ముంబై నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికుడిని డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా అతను 832 గ్రాముల బంగారాన్ని పేస్ట్‌గా మార్చి  మలద్వారంలో ఉంచుకొని తీసుకొచ్చినట్లు గుర్తించారు. విదేశాల నుంచి ముంబై వచ్చిన అతను అక్కడి నుంచి హైదరాబాద్‌ చేరుకున్నట్లు తెలిపారు. ఆపరేషన్‌ ద్వారా అతడి నుంచి బంగారాన్ని వెలికి తీశారు. దీని విలువ రూ. 27,87,400 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు స్పైస్‌ జెట్‌ విమానంలో శనివారం రాత్రి జెడ్డా నుంచి హైదరాబాద్‌ వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి 915 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.35,50,858 ఉంటుందని నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement