cab drivers protest
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టు: ఆందోళనకు దిగిన క్యాబ్ డ్రైవర్లు
సాక్షి,శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ ముందు క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఇతర రాష్ట్రాల క్యాబ్‌లను ఎయిర్‌పోర్టులోకి అనుమతించకూడదని డ్రైవర్లు నినాదాలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న క్యాబ్‌ల వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల క్యాబ్ లు నడవడంతో తమకు గిట్టుబాటు కావడం లేదని తెలిపారు. తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని క్యాబ్ డ్రైవర్లు పోలీసులకు తెగేసి చెబుతున్నారు. కాగా, నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు నడిచే ట్రిప్పులపైనే క్యాబ్ డ్రైవర్లు ఎక్కువగా ఆధారపడుతున్న విషయం తెలిసిందే. -
ట్యాక్సీ డ్రైవర్లకు రూ.1,470 కోట్లు చెల్లించనున్న ప్రముఖ కంపెనీ.. ఎందుకంటే..
ప్రముఖ ఆన్లైన్ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ తన ట్యాక్సీ డ్రైవర్లకు ఏకంగా రూ.1,470 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఆస్ట్రేలియాలో చాలాకాలంగా కొనసాగుతున్న న్యాయ వివాదానికి పరిష్కారం లభించింది. ఉబర్ తమ దేశంలోకి ప్రవేశించడంతో ఉపాధి కోల్పోయామంటూ దాదాపు 8,000 మంది ట్యాక్సీ డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కొంతకాలంగా విచారణ కొనసాగుతోంది. పరిహారం చెల్లించడానికి కంపెనీ నిరాకరిస్తూ వచ్చింది. తాజాగా ఈ కేసు విక్టోరియా సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. కానీ, అప్పటికే ఉబర్ డ్రైవర్లతో పరిహార ఒప్పందం కుదుర్చుకుంది. ఉబర్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సేవలందిస్తోంది. 2012లో ఆస్ట్రేలియాలోకి ప్రవేశించిన ఉబర్ వేగంగా సేవలను విస్తరించినట్లు న్యాయవాది మైఖేల్ తెలిపారు. దీనివల్ల అప్పటికే స్థానికంగా అద్దె ట్యాక్సీలను నడిపే చాలా మంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. వారికి పరిహారం చెల్లించాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఉబర్ నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. దీంతో కోర్టును ఆశ్రయించామని తెలిపారు. డ్రైవర్ల డిమాండ్‌కు సామాన్య పౌరులు సైతం మద్దతు తెలిపినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై ఉబర్ స్పందిస్తూ ప్రపంచంలో కంపెనీ ఉబర్ సేవలు ప్రారంభించినపుడు ఆయా దేశాల్లో నియంత్రణ నిబంధనలులేవు. ఆస్ట్రేలియాలో ఉబర్ కార్యకలాపాల వల్ల అక్కడి రవాణా వ్యవస్థలు మెరుగైన మార్పులు వచ్చాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దాంతో స్థానికంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరికాయని చెప్పారు. ఆదేశ నిబంధనల ప్రకారం..2018 నుంచి వివిధ ప్రాంతాల్లోని వారితో పరిహార ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. ఇదీ చదవండి: మరో ‘కేజీఎఫ్’ ఆనవాలు.. ఎక్కడో తెలుసా..? -
ఆ ప్రయాణికులకు షాకిచ్చిన ఓలా, ఉబర్ డ్రైవర్లు
సాక్షి, హైదరాబాద్: ఓలా, ఉబెర్ డ్రైవర్లు క్యాబ్ బంద్ తలపెట్టారు. దీంతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే సుమారు మూడు వేల క్యాబ్‌లపై ప్రభావం పడింది. ఉబెర్, ఓలా సంస్థలు సరైన కమీషన్లు ఇవ్వడం లేదని, తమ శ్రమకు తగిన ఆదాయం లభించడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో రాకపోకలు సాగించే క్యాబ్‌లు చాలావరకు నిలిచిపోయాయి. ఓలా, ఉబెర్ సర్వీసులకు ఆటంకం ఏర్పడడంతో జీఎమ్మార్ ఎయిర్ పోర్టు మూడు ప్రత్యామ్నాయ క్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ►ఎయిర్‌పోర్టు నుంచి సాధారణంగా ప్రతిరోజూ సుమారు 5000 క్యాబ్‌లు 24 గంటల పాటు సేవలందజేస్తాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి క్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ కోవిడ్ దృష్ట్యా కొంతకాలంగా క్యాబ్‌ల సంఖ్య 3 వేలకు తగ్గింది. గతంలో ఎయిర్‌పోర్టుకు నడిపే క్యాబ్‌లకు రోజుకు రూ.2000 నుంచి రూ.3000 వరకు ఆదాయం లభించగా ఇప్పుడు రోజుకు రూ.1000 కూడా రావడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ►ఎయిర్‌పోర్టులో రూ.250 పార్కింగ్ చార్జీలు, డీజిల్ ఖర్చు మినహాయిస్తే రోజుకు రూ.500 మాత్రమే మిగులుతున్నాయని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధి షేక్ సలావుద్దీన్ విస్మయం వ్యక్తం చేశారు. ఓలా, ఉబెర్ సంస్థల నుంచి సరైన కమీషన్లు లభించకపోవడంతోనే తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టు నుంచి ఓలా, ఉబెర్ క్యాబ్‌ల సేవలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. కమీషన్లు పెంచాలి.. ప్రభుత్వం గతంలో ప్రతిపాదించినట్లుగా కిలోమీటర్‌కు రూ.17 చొప్పున ఇవ్వాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతంఒక కిలోమీటర్‌పై రూ.10 కూడా గిట్టుబాటు కావడం లేదని, దీంతో రూ.లక్షల్లో అప్పులు తెచ్చి కొనుగోలు చేసిన వాహనాలకు నెల నెలా రుణాలు కూడా చెల్లించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. కమీషన్లు పెంచే వరకు క్యాబ్‌లు నడపబోమని సలావుద్దీన్ స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయంగా మూడు క్యాబ్ సర్వీసులు.. డ్రైవర్ల ఆందోళన దృష్ట్యా ఉబెర్, ఓలా సేవలకు ఆటంకం ఏర్పడడంతో జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి చాయిస్, 4 వీల్స్, క్విక్ రైడ్ అనే మూడు క్యాబ్ సర్వీస్ ఆపరేటర్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు ఆర్టీసీ పుష్పక్ బస్సు లు కూడా అందుబాటులో ఉన్నాయని, ప్రయాణికుల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. చదవండి: వారి కన్నీటి కథ.. కండలు కరిగినా కడుపునిండదాయె -
కోవిడ్ సెకండ్ వేవ్.. కుదేలవుతున్న క్యాబ్‌లు!
సాక్షి, సిటీబ్యూరో: ఏడాదికి పైగా ప్రజారోగ్యంపై పడగ నీడలా మారిన మహమ్మారి కోవిడ్ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. గతేడాది విజృంభించిన వైరస్ బారినుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న వ్యవస్థలు తిరిగి కుదేలవుతున్నాయి. చాపకింద నీరులా విస్తరిస్తున్న కోవిడ్ రెండో దశ ఉద్ధృతి అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. గత సంవత్సరం కోవిడ్ కారణంగా కుదేలైన ప్రజారవాణా వ్యవస్థలు తిరిగి కోలుకుంటున్న తరుణంలో ముంచుకొచ్చిన రెండో దశ మరోసారి పిడుగుపాటుగా మారింది, ప్రత్యేకించి క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, మినీబస్సులు, ఆటోలు తదితర వాహనాలపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సుమారు 80 వేలకుపైగా క్యాబ్‌లు ఉబెర్, ఓలా తదితర క్యాబ్దిగ్గజ సంస్థలకు అనుసంధానమై తిరుగుతుండగా, గత నెల రోజులుగా 50 వేలకు పడిపోయినట్లు అంచనా. ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, రాత్రింబవళ్లు పడిగాపులు కాసినా కనీస ఆదాయం లభించకపోవడంతో చాలా మంది డ్రైవర్లు, వాహన యజమానులు క్యాబ్‌లను వదిలేస్తున్నారు. గత 10 రోజులుగా క్యాబ్‌ల వినియోగం గణనీయంగా తగ్గినట్లు తెలంగాణ క్యాబ్స్, ట్యాక్సీ డ్రైవర్స్ జేఏసీ చైర్మన్ షేక్ సలావుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌కు ముందు వేలాది మందికి ఉపాధినిచ్చిన క్యాబ్‌లు ఇప్పుడు భారంగా మారినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌కు తగ్గిన బుకింగ్‌లు.. ►పెళ్లిళ్లు, వేడుకలు, సామూహిక ఉత్సవాలు వంటి వివిధ కార్యక్రమాల కోసం హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ట్రావెల్స్ వాహనాల బుకింగ్‌లు కూడా తగ్గుముఖం పట్టాయి. 8 సీట్లు, 10 సీట్లతో నడిచే మ్యాక్సీ క్యాబ్‌లు, 14 నుంచి 22 సీట్ల వరకు ఉండే మినీ బస్సులకు డిమాండ్ తగ్గినట్లు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. ►మే నెల వరకూ పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోవడంతో వాహనాలకు డిమాండ్ కనిపించడం లేదు. ముఖ్యంగా పర్యాటక రంగం చాలా వరకు దెబ్బతిన్నది. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే సందర్శకుల తగ్గిపోయింది. కోవిడ్‌కు ముందు ప్రతిరోజూ సుమారు 50 వేలమందికి పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు నగర సందర్శన కోసం వచ్చేవారు. ఏడాదికిపైగా అంంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతుండగా కోవిడ్ రెండో దశ ఉప్పెనలా వచ్చిపడింది. దీంతో బుకింగ్‌లపై ప్రభావం పడినట్లు ట్రావెల్స్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెరుచుకోని ఐటీ రంగం.. ►గతేడాది ఐటీ సంస్థలు లాక్డౌన్ విధించాయి. సాఫ్ట్వేర్ నిపుణులు చాలా వరకు ఇంటి నుంచే పని చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి, ఐటీ ప్రాంతాలకు రోజుకు 10,వేలకుపైగా క్యాబ్‌లు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. క్యాబ్‌లు చాలా వరకు సాధారణ రాకపోకలపై మాత్రమే ఆధారపడి తిరుగుతున్నాయి. కానీ ప్రస్తుత రెండో దశ దృష్ట్యా అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే నగర వాసులు క్యాబ్‌లు వినియోగిస్తున్నారు. ► ఇదే సమయంలో వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగింది. కోవిడ్ దృష్ట్యా గతేడాది నుంచి ఎక్కువ మంది వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడ్డారు. గత నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి రెండో వారం వరకు ప్రజారవాణా వాహనాలకు డిమాండ్ కనిపించింది. కానీ ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. -
క్యాబ్.. చెరుకు బండైంది
ఇతడి పేరు నగేష్.. మూడు నెలల క్రితం వరకు క్యాబ్‌డ్రైవర్. రెండేళ్ల క్రితం అప్పు చేసి కారు కొనుక్కున్నాడు. ఉబర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో బతుకు బండిని ముందుకు నడిపించాడు. తల్లిదండ్రులు సైతం అతడితో పాటే ఉంటున్నారు. నాచారం సమీపంలోని మల్లాపూర్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం. దగ్గర్లోని ఓ స్కూల్లో పిల్లల చదువులు. ప్రతినెలా ఏదో విధంగా కారు రుణ వాయిదాలు, ఇంటి అద్దె చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉన్నంతలో జీవితం సాఫీగానే గడిచిపోతుందనుకుంటున్న తరుణంలో కరోనా మహమ్మారి పిడుగులా వచ్చిపడింది. లాక్‌డౌన్‌తో అంతా కకావికలమైంది. ఎక్కడికక్కడ రవాణా స్తంభించింది. క్యాబ్ సేవలకు బ్రేక్ పడింది. అప్పటి వరకు సాఫీగా సాగిపోయిన నగేష్ బతుకు ‘బండి’ఆగిపోయింది. ‘లాక్డౌన్ సడలించడంతో ధైర్యం వచ్చింది.బండి బయటకు తీశాను. కానీ జనం క్యాబ్‌లు ఎక్కేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈఎంఐ కట్టలేని దుస్థితిలో కారును మొబైల్ చెరుకు బండిగా మార్చుకున్నాడు. మేడిపల్లి దగ్గర్లోనిరహదారిపై అతడి మొబైల్ చెరుకు బండి నిత్యం వినియోగదారుల కోసం ఎదురుచూస్తోంది. ‘పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మడం’ అంటే ఇదేనేమో. ఎలాంటి ఒడిదొడుకులూ లేకుండా జీవనం సాగిస్తున్న సమస్త వృత్తులను కరోనా కకావికలం చేసింది. బతుకు బాటను ఛిద్రం చేసింది. ఉపాధిపై ఉక్కుపాదం మోపింది. కిరాణా దుకాణాలు, కూరగాయలు, పండ్ల అమ్మకాలు వంటి కొన్ని రకాల వ్యాపారాలు మినహా అనేక రంగాలపై పెను ప్రభావం చూపింది. కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రైవేటు స్కూళ్లలో టీచర్లుగా పనిచేసిన ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చేసేదేమీ లేక కొందరు రోడ్ల పక్కన పండ్లు, కూరగాయలను విక్రయిస్తున్నారు. గూగుల్, ఇన్ఫోసిస్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు మొదలుకొని వందలాది ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోం’ వెసులుబాటునిచ్చాయి. దీంతో ఐటీ కారిడార్లకు క్యాబ్‌ల రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా మహమ్మారి ఉద్ధృతి దృష్ట్యా నగరంలో జనం క్యాబ్‌లు, ఆటోలు ఎక్కేందుకు భయపడుతున్నారు. సొంత వాహనాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుండటంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ఇలా.. ఎన్నో వృత్తులపై కరోనా పెను ప్రభావమే చూపించింది. సాక్షి, సిటీబ్యూరో, జోన్ బృందం: అనేక రకాల వృత్తులను కరోనా కటేసింది. లాక్‌డౌన్‌తో బతుకుదెరువును ప్రశ్నార్థకం చేసింది. దీంతో చాలా మంది ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు. కిరాణా దుకాణాలు, కూరగాయలు, పండ్ల అమ్మకాలు వంటి కొన్ని రకాల వ్యాపారాలు మినహా అనేక రంగాలు ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు స్కూళ్లలో టీచర్లుగా పనిచేసిన ఎంతోమంది మహిళలు జీతాలు లేక తిప్పలు పడుతున్నారు. స్కూళ్లు నడవడం లేదంటూ.. ఫీజులు వసూలు చేసేనే జీతాలంటూ ఇబ్బంది పెడుతున్నారు. ఆన్లైన్ క్లాసులను తక్కువ మందితో కొనసాగిస్తూ మిగతా వారిని తొలగించేస్తున్నారు. రోడ్ల పక్కన పండ్లు, కూరగాయలను బండ్లపై విక్రయిస్తున్నారు. గూగుల్, ఇన్ఫోసిస్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు మొదలుకొని వందలాది ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ వెసులుబాటునిచ్చాయి. దీంతో ఐటీ కారిడార్లకు క్యాబ్‌ల రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా మహమ్మారి ఉధృతి దృష్ట్యా నగరంలో జనం క్యాబ్‌లు, ఆటోలు ఎక్కేందుకు భయపడుతున్నారు. సొంత వాహనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. టీచర్ జాబ్ వదిలి టైలరింగ్ సికింద్రాబాద్‌లోని తుకారాంగేట్‌లో ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పని చేశాను. కరోనా నేపథ్యంలో స్కూల్ మూసివేశారు. దీంతో మాకు జీతాలు కూడా రావడం లేదు. విద్యార్థులకు ఆన్లైన్ విద్య పెట్టి స్టాఫ్‌ను తగ్గించేసి బోధన చేస్తున్నారు. జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత్యంతరం లేక టీచర్ జాబ్ మానేసి టైలరింగ్ చేసుకుంటున్నా.– రాణి, తుకారాంగేట్ జాబ్ కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తున్నా.. లాక్డౌన్ కారణంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అప్పటి నుంచి జీతాలు సరిగా ఇవ్వడం లేదు. జీతాలు అడిగితే లాక్డౌన్లో ఇవ్వడం కష్టమని స్కూల్ యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో టీచర్ ఉద్యోగం మానేసి ప్రత్యామ్నాయ మార్గంగా ఒక జాబ్ కన్సల్టెన్సీలో ఉద్యోగంలో చేరాను. తప్పని పరిస్థితుల్లో టీచర్ జాబ్ మానేసి ఈ ఉద్యోగం చేయాల్సి వస్తోంది.– రామలీల, సికింద్రాబాద్ అద్దె కట్టడం కూడా భారంగా మారింది కరోనా కారణంగా టిఫిన్ సెంటర్‌కు వచ్చేందుకు ఎవ్వరూ మొగ్గుచూపడం లేదు. దీంతో ఈ కష్టకాలంలో ఇంటి అద్దె కట్టడానికి సైతం కూడా డబ్బులు సమకూరని పరిస్థితులు తలెత్తాయి. అందుకే టిఫిన్ సెంటర్‌ను మూసివేసి ఓ ప్రైవేటు ఉద్యోగం వెతుక్కున్నాను. ఇంట్లో నుండే పని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాను. – రమాదేవి, ఈస్ట్‌మారేడుపల్లి కూరగాయలు అమ్ముతున్నాం.. లాక్‌డౌన్‌తో ఉద్యోగం పోయింది. రెండు నెలలకు పైగా లాక్డౌన్ కారణంగా యాజమాన్యం సిబ్బందిని తగ్గించుకుంది. దీంతో కుటుంబం రోడ్డున పడింది. సహారా వద్ద రోడ్డుపై కూరగాయలు అమ్ముతూ కుటుంబపోషణ చేసుకుంటున్నాం. మేము భార్యాభర్తలిద్దరం కూరగాయలను రోడ్డు పక్కన అమ్ముతున్నాం. – శ్రీను, మన్సూరాబాద్ మాస్క్‌ల వ్యాపారం చేసుకుంటున్నా సీజనల్‌కు అనుకూలంగా తోపుడు బండిపై పండ్లు, కూరగాయలు, ఇతరత్రా అమ్ముకుంటూ వచ్చా. కరోనా ప్రభావంతో పూర్తిగా అమ్మకాలు పడిపోయాయి. దీంతో ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్న మాస్క్‌ల వ్యాపారం చేసుకుంటూ పూట గడుపుకుంటున్నాం. మా కుటుంబం గడిచేంత డబ్బులు రానప్పటికీ గత్యంతరం లేక మాస్క్‌ల విక్రయాలు చేపడుతున్నాం. – అనీత, సూరారం రాజీవ్ గృహకల్ప. పండ్లు అమ్మి జీవనం సాగిస్తున్నాం మాది విజయవాడ.. నా భర్త నేను సంవత్సరం క్రితం అప్పుచేసి ఐడీపీఎల్ సమీపంలో నెలకు రూ.11 వేల అద్దెతో టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశాం. కరోనా వైరస్ మహమ్మారి మా వ్యాపారంపై దెబ్బ కొట్టింది. మూడు నెలలుగా అద్దె చెల్లించలేకపోయాం. టిఫిన్ సెంటర్ బండి రేకులు తొలగించి దానిపైనే పండ్ల విక్రయాలు చేపట్టాం. లాభం లేకపోయినా మరోదారి లేక పండ్లు అమ్మి జీవనం సాగిస్తున్నాం. – తులసి,ఐడీపీఎల్ ఆదర్శ్‌నగర్. కరోనా కాటేస్తుందేమో.. క్యాబ్ డ్రైవర్లను కరోనా భయం వెంటాడుతోంది. లాక్డౌన్ నడలించిన తర్వాత ఎలాంటి పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజ్‌లు, శానిటైజర్లు ఇవ్వకుండానే క్యాబ్ సంస్థలు తమ సేవలను వినియోగించుకుంటున్నాయని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల వల్ల కరోనా వైరస్ సోకుతుందేమోననే భయంతో చాలామంది డ్రైవర్లు ప్రత్యామ్నాయ ఉపాధిని ఎంచుకుంటున్నారు. ఉబెర్, ఓలా నుంచి భరోసా లభించడం లేదు. ప్రోత్సాహకాలు లేవు. పైగా బండ్లను బ్లాక్‌లో పెట్టి వేధిస్తున్నారు. ఇంక బండి నడిపి ఏం లాభం..’ అని ఆవేదన వ్యక్తం చేశారు యూసుఫ్‌గూడకు చెందిన జూకీర్ హుస్సేన్. ప్రస్తుతం మామిడి పండ్లు విక్రయిస్తున్నాడు. ప్రయాణికులు లేక వెలవెల ఉబెర్, ఓలా వంటి సంస్థలు 50 శాతం మేరకు వాహనాలను అందుబాటులోకి తెచ్చినా ప్రయాణికులు లేక వెలవెలపోతున్నాయి. ‘18 గంటల నుంచి 20 గంటల పాటు ఓలా, ఉబెర్ యాప్‌లు ఓపెన్ చేసుకొని కూర్చున్నా ఆశించిన స్థాయిలో బుకింగ్‌లు రావడం లేదు.’ అని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సలావుద్దీన్ విస్మయం వ్యక్తం చేశారు. క్యాబ్ అగ్రిగేటర్లకు వందల కోట్ల రూపాయాల ఆదాయాన్ని ఆర్జించిన డ్రైవర్లకు ఇప్పుడు ఎలాంటి ఉపాధి లేకుండా పోయిందని, ఇటు ప్రభుత్వం కానీ, అటు క్యాబ్ సంస్థలు కానీ తమను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఆరోగ్య బీమా కల్పించాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. దేశీయ విమాన సర్వీసులు, రైళ్లు, బస్సుల రాకపోకలు పరిమిత స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. కానీ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లకు రాకపోకలు సాగించేందుకు కూడా ఎక్కువ శాతం సొంత వాహనాలనే వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. మొబైల్ కిరాణం.. అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన ప్రభాకర్‌కు వింగర్ వాహనం ఉంది. హెచ్ఎస్బీసీ, ఈజీ కమ్యూట్ సంస్థల ఉద్యోగుల కోసం బండి నడిపేవాడు. లాక్‌డౌన్‌తో సేవలు నిలిచిపోయాయి. కష్టాలు మొదలయ్యాయి. మార్చి నెల వరకు చేసిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఈజీ కమ్యూట్ సంస్థ వేధిస్తున్నట్లు వాపోయాడు. ఇప్పుడు ప్రభాకర్ తన వింగర్ వాహనంలోనే ఒక చిన్న మొబైల్ కిరాణా దుకాణం ప్రారంభించాడు. ప్రతిరోజూ అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి నారపల్లికి వచ్చి అక్కడ వస్తువులను విక్రయిస్తున్నాడు. ‘లాక్డౌన్ కాలంలో పస్తులున్నాం. ఇప్పటికీ బండికీ ఈఎంఐ కట్టలేకపోతున్నాను. కిస్తీలు పెరిగిపోతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఐటీ సంస్థలకు బండ్ల అవసరం లేకుండా పోయింది. సెప్టెంబర్ వరకు ఇలాగే ఉంటుందన్నారు. అప్పటి వరకు ఉపాధి కోసం ఈ మార్గం ఎంచుకున్నాను.’ అని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో.. దాదాపు మూడు నెలల లాక్డౌన్ సందర్భంగా వ్యాపారాలు లేక తీవ్రంగా నష్టపోయాం. ఇటీవలే లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఇచ్చారు. దీంతో మా సెంటర్లో టిఫిన్స్ కేవలం పార్శిల్ మాత్రమే ఇస్తున్నాం. షాపు అద్దె చెల్లించడం ఇబ్బందిగా మారింది. శానిటైజర్లు, ఫెడల్ స్టాండ్లు, మాస్క్‌లు, చేతి గ్లౌజులు అమ్ముతున్నాం. – విష్ణు తివారి,బాలాజి టిఫిన్ సెంటర్ యజయాని, బేబంబజార్ మాస్క్‌లు విక్రయించి.. గతంలో ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేశాను. ప్రస్తుతం అందులో పనిలేదు. దీంతో ఇబ్బందికరంగా మారింది. ఇంటి అద్దె, నిత్యావసరాలకు డబ్బులు లేకపోవడంతో మాస్కులు తెచ్చి విక్రయిస్తున్నా. జవహర్‌నగర్ రోడ్ల పక్కన మాస్కులను విక్రయిస్తే వచ్చే కాస్త డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. – ఆజాద్, అంబేద్కర్‌నగర్ -
లాక్డౌన్ ప్రభావం క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య
పహాడీషరీఫ్: లాక్డౌన్ ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులకు గురైన ఓ క్యాబ్ డ్రైవర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఎస్ఐ నాగరాజు తెలిపిన మేరకు.. మల్లాపూర్ గ్రామానికి చెందిన పోరెడ్డి నర్సింహా రెడ్డి (39)క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. లాక్డౌన్ నుంచి కారు నడవకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నాడు. ఈ సమయంలోనే ఇంటి నిర్మాణం పెట్టుకోవడం....చిట్టీలు కూడా కట్టలేని పరిస్థితి నెలకొంది. (జీవితం చావడానికి కాదు: ఐశ్వర్య ) ఈ క్రమంలోనే శనివారం రాత్రి భార్య పిల్లలతో కలిసి నిద్రించిన నర్సింహా రెడ్డి అర్ధరాత్రి గదిలో నుంచి బయటికి వచ్చి గదికి బయటి నుంచి గొళ్లెం పెట్టాడు. కొద్ది సేపటి అనంతరం నిద్రలేచిన భార్య....భర్త లేకపోవడంతో డోర్ తీసేందుకు ప్రయత్నించింది. బయటి నుంచి లాక్ చేసి ఉందని గ్రహించి స్థానికులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి పరిశీలించగా హాల్లోనే తాడుతో ఉరేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలు సంతానం. (సుశాంత్ మృతిపై అనుమానం: సీబీఐ విచారణ) -
క్యాబ్ ఆవాజ్: డ్రైవర్ల సమ్మె బాట
నగరంలో క్యాబ్ సేవలూ నిలిచిపోనున్నాయి. ఇప్పటికే ఆర్టీసీకార్మికులు సమ్మె చేస్తుండగా... క్యాబ్ డ్రైవర్లూ ఈ నెల 19 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నారు. ఈ మేరకుతెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ నాయకులు గురువారం ప్రకటించారు. కిలోమీటర్‌కు రూ.22 చెల్లించాలని, డ్రైవర్ల ఐడెంటిటీ రద్దును ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వమే మొబైల్ యాప్‌లతో పాటు మీటర్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వీటిపై స్పష్టమైన హామీ ఇవ్వని పక్షంలో సమ్మె అనివార్యమన్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు సైతం సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 19నుంచి క్యాబ్ బంద్ చేపట్టనున్నట్లు తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ షేక్ సలావుద్దీన్, కన్వీనర్ కె.ఈశ్వర్రావు, కో–చైర్మెన్ బి.వెంకటేశం తెలిపారు. దీంతో 19నుంచి ఉబెర్, ఓలా తదితర క్యాబ్‌లతో పాటు, ఐటీ కంపెనీలకు నడిపే క్యాబ్ సేవలు కూడా నిలిచిపోనున్నాయి. కిలోమీటర్‌కు రూ.22 చొప్పున చెల్లించాలని, లేనిపక్షంలో ప్రభుత్వమే మొబైల్ యాప్‌లతో పాటు మీటర్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు పెద్ద ఎత్తున లీజు వాహనాలను పెంచేశాయి. దీంతో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. చాలామంది అప్పులపాలయ్యారు. ఫైనాన్షియర్ల వద్ద చేసిన అప్పులు తిరిగి చెల్లించలేక రోడ్డున పడుతున్నారు. డ్రైవర్ల కుటుంబాలు పస్తులుంటున్నాయి. ఈ పరిస్థితులను మార్చేందుకు ప్రతి డ్రైవర్‌కు కనీసం బిజినెస్ గ్యారెంటీ ఇవ్వాలని, ఇందుకనుగుణంగా ఓలా, ఉబెర్, తదితర క్యాబ్ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను మార్చుకోవాలని జేఏసీ చైర్మెన్ సలావుద్దీన్ డిమాండ్ చేశారు. ఐటీ కంపెనీలకు నడిపే క్యాబ్‌లకు సంబంధించి జీవో 61, 66లకు అమలు చేయాలని కోరారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తాము సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు పేర్కొన్నారు.19వ తేదీ వరకు తమ డిమాండ్లపైన స్పష్టమైన హామీ లభించకపోతే సమ్మెను నిరవధికంగా కొనసాగించనున్నట్లు తెలిపారు. నిలిచిపోనున్న 50 వేల క్యాబ్‌లు క్యాబ్ బంద్ కారణంగా నగరంలో సుమారు 50 వేలకు పైగా ఓలా, ఉబెర్, తదితర క్యాబ్‌ల సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే సుమారు 5 వేలకు పైగా క్యాబ్‌లకు కూడా బ్రేక్ పడనుంది. అలాగే హైటెక్‌సిటీ, కొండాపూర్, మాధాపూర్, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు తీవ్ర ఇబ్బందులకు గురికానున్నారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మె కారణంగా రాత్రి పూట సిటీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. క్యాబ్ సేవలను వినియోగించుకుంటున్నారు. కానీ క్యాబ్‌లు కూడా సమ్మెలో పాల్గొంటే ప్రజా రవాణాకు మరింత ఆటంకం కలగనుంది. క్యాబ్ డ్రైవర్ల సమ్మె వల్ల సుమారు 5 లక్షల మందికి పైగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. -
ఓలా.. లీజు గోల
సాక్షి, సిటీబ్యూరో: మల్కాజిగిరికి చెందిన క్యాబ్ డ్రైవర్ విష్ణు ఆరు నెలల క్రితం ఓలా సంస్థలో చేరి కారు లీజుకు తీసుకున్నాడు. ఆ సంస్థ నిబంధనల ప్రకారం సుమారు రూ.8.5 లక్షల ఖరీదైన వాహనం లీజు కోసం మొదట రూ.35,000 చెల్లించాడు. అనంతరం ప్రతి రోజూ రూ.1135 చొప్పున చెల్లిస్తూ కారు బాకీ తీర్చేయాలి. ఇలా మూడు, నాలుగేళ్లు కష్టపడితే వాహనం తన సొంతమవుతుంది. ప్రతిరోజు వచ్చే ఆదాయంతో తనకు ఉపాధి లభిస్తుందని భావించాడు. అయితే అకస్మాత్తుగా ఓలా నిబంధనలు మారిపోయాయి. కొత్తగా 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడిపితే ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.4 చొప్పన చెల్లించాలని తాజాగా ఓ నిబంధన విధించారు. దీంతో రోజువారీ ఇన్స్టాల్మెంట్ తడిచిమోపెడైంది. డబ్బులు చెల్లించలేకపోవడంతో వాహనాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంతో అతను రోడ్డున పడాల్సి వచ్చింది. ఇది ఒక్క విష్ణుకు ఎదురైన అనుభవం మా త్రమే కాదు. క్యాబ్ సంస్థల్లో విధించే అడ్డగోలు నిబంధనల వల్ల తాము నిలువు దోపిడీకి గురవుతున్నామం టూ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. దోపిడీ పర్వం ఇలా.... గ్రేటర్ పరిధిలో దాదాపు 10 వేల ఓలా లీజు వాహనాలు నడుస్తున్నా యి. తమ సొంత వాహనాలు ఓలాతో అనుబంధం చేసి క్యాబ్ సేవలు అందించే ఓలా భాగస్వాములు కాకుండా ఆ సంస్థే నేరుగా కొన్ని వాహనాలను కొనుగోలు చేసి లీజుకు ఇచ్చే పద్ధతికి ఇటీవల శ్రీకారం చుట్టింది. నిరుద్యోగ యువత నుంచి దీనికి అనూహ్య స్పందన లభించింది. దీంతో గత రెండేళ్లుగా పలువురు యువకులు ఉపాధి కోసం లీజు బాటను ఎంపిక చేసుకున్నారు. సాధారణంగా ఫైనాన్షియర్ల వద్ద అప్పు తీసుకొని వాహనాల కొనుగోలు చేస్తే ప్రతి నెలా వాయిదాలు చెల్లించాలి. ఓలాలో మాత్రం ఏ రోజుకు ఆ రోజే చెల్లించాలి. ఈ లెక్కన రూ.35,000 డౌన్ పేమెంట్ చేసి ప్రతి రోజు రూ.1135 చొప్పన వాయిదాలు కట్టాల్సి ఉంటుంది. అంటే ఒక డ్రైవర్ రోజుకు రూ.2500 నుంచి రూ.3000 వరకు సంపాదిస్తే అందులో లీజు వాయిదా డబ్బులతో పాటు, మరో రూ.1000 వరకు డీజిల్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఖర్చులన్నీ పోను డ్రైవర్‌కు రూ.500 కంటే ఎక్కువ మిగిలే అవకాశం లేదు. ఒకవైపు ఈ లీజ్ దందా ఇలా ఉండగా కొత్తగా మరో నిబంధన తెచ్చారు. రోజలో 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడిపితే ప్రతి కిలోమీటర్‌కు రూ.4 చొప్పున చెల్లించాలి. 300 కిలోమీటర్లు నడిపే డ్రైవర్ ప్రతి రోజు చెల్లించే రూ.1135 తో పాటు, మరో రూ.400 అదనంగా కట్టాల్సి వస్తోంది. దీంతో డ్రైవర్‌కు ఒక్కోసారి ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు. ‘‘ ఒకసారి వాహనాన్ని లీజుకు తీసుకు న్న తరువాత ఏ డ్రైవరైనా కష్టపడి పని చేయాలనుకుంటాడు. నాలుగు కిలోమీటర్లు ఎక్కువ తిప్పితే అదనపు డబ్బుల వస్తాయని భావిస్తాడు. కానీ ఓలా నిబంధనల వల్ల డ్రైవర్లు చావకుండా, బతకకుండా చేస్తున్నారు. ఇది దారుణమైన దోపిడీ. ప్రభుత్వమే మా సమస్యలకు పరిష్కారం చూపాలి.’’ అని తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సలావుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలేది అప్పులే... నగరంలో సుమారు 50 వేల క్యాబ్‌లు నగరంలో ప్రయాణికులకు వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. ఒక్క శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికే 10 వేలకు పైగా క్యాబ్‌లు నడుస్తున్నాయి. వీటిలో ఎక్కువ శాతం ఓలాకు చెందినవే. నగరంలో క్యాబ్ సేవలు ప్రారంభమైన తొలి రోజుల్లో డ్రైవర్లు ప్రతి నెలా రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు కూడా సంపాదించారు. మొదట్లో ఎంతో లాభసాటిగా ఉన్న ఓలా వ్యాపారం కొద్ది కాలంలోనే శాపంగా మారింది. రూ.లక్షల్లో అప్పులు చేసి, ఫైనాన్షియర్ల వద్ద చక్రవడ్డీలపై డబ్బులు తీసుకొని కార్లు కొనుగోలు చేసిన వాళ్లు ఓలాకు అనుసంధానమైన తరువాత తీవ్రంగా నష్టపోయి, రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో ఓలా సంస్థ లీజు వాహనాలను ముందుకు తెచ్చింది. సంస్థే స్వయంగా వాహనాలు ఇవ్వడంతో డ్రైవర్లలో మరోసారి ఆశలు చిగురించాయి. అయితే తరచు నిబంధనలు మారుస్తుండటంతో వాయిదాలు చెల్లించలేక, అప్పులు తీరే మార్గం లేక చివరకు వాహనాలను వదిలేసుకుంటున్నారు. ఈ రెండేళ్ల కాలంలో వందలాది మంది డ్రైవర్లు లీజు ఒప్పందం వల్ల అప్పల పాలై రోడ్డున పడినట్లు డ్రైవర్ల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అక్రమ వసూళ్లను నిలిపివేయాలి కేవలం డ్రైవర్లను దోచుకోవడమే లక్ష్యంగా ఓలా నిబంధనలు విధిస్తోంది. దీనిపై ఆందోళనకు దిగి తే బౌన్సర్ల ద్వారా దాడులు చేయిస్తున్నారు. ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి. రవాణాశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మను కలిసి విజ్ఞప్తి చేశాం. ఇప్పటికైనా ఓ పరిష్కారం చూపాలి. –సలావుద్దీన్, అధ్యక్షుడు,తెలంగాణ ఫోర్‌వీలర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ -
‘నోటా’ నొక్కండి.. మాకు తోడుండండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారానికి దిగాయి. ఓటర్లను ఆకట్టుకొనేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ కీలకమైన సమయంలో నగరంలోని క్యాబ్ డ్రైవర్లు వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఏ పార్టీకి ఓటు వేసినా లాభం లేదంటూ ‘నోటా’పాట అందుకున్నారు. ‘నోటా’పై నొక్కాలని ప్రజలను కోరుతున్నారు. వేలాది డ్రైవర్లు తమ వాహనాలపైన ఈ తరహా పోస్టర్లను అతికించుకొని తిరుగుతున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ‘నోటా’ప్రచారం పలు చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్ధులను హడలెత్తిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు డ్రైవర్ల సంక్షేమాన్ని విస్మరించాయని, ఏ మేనిఫెస్టోలోనూ తమ సమస్యలను ప్రస్తావించలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సంస్థల మోసాల బారి నుంచి కాపాడాలంటూ రాజకీయ పార్టీలకు, నేతలకు పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోలేదని తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్, భాగస్వాముల మధ్య పోటీని తీవ్రతరం చేసిన క్యాబ్ సంస్థలు తమను తీవ్రంగా దోచుకుంటున్నాయని, ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వలేదన్నారు. తమకు సహకారాన్ని అందించని రాజకీయ పార్టీలపైన నమ్మకాన్ని కోల్పోయి ‘నోటా’ప్రచారానికి దిగినట్లు సలావుద్దీన్ తెలిపారు. తెలంగాణ క్యాబ్, ట్యాక్సీ, ఆటో, తదితర సంఘటిత, అసంఘటిత రంగాల్లో కొనసాగుతున్న లక్షలాది మంది డ్రైవర్ల కోసం ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనేది డ్రైవర్ల ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. -
శంషాబాద్ లో భారీగా పోలీసుల మొహరింపు
శంషాబాద్: క్యాబ్ డ్రైవర్ల ఆందోళనతో శంషాబాద్ విమానాశ్రయం ఆవరణలో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం రాత్రి కొందరు దుండగులు ఓ క్యాబ్ ను తగులబెట్టడంతో పాటు మరో రెండు క్యాబ్ ల అద్దాలను పగులగొట్టారు. క్యాబ్ యజమాని ఫిర్యాదు మేరకు ఐదుగురు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయం బస్టాండ్ సమీపంలో భారీగా పోలీసులను మొహరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శంషాబాద్ విమానాశ్రయం ఆవరణలో సోమవారం మెరూ క్యాబ్ డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు. డ్రైవర్ కమ్ ఓనర్స్ స్కీం లబ్ధిదారుల నుంచి యాజమాన్యం రోజువారీ అద్దె, పార్కింగ్ చీర్జీలు అదనంగా వసూలు చేస్తోందని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.