సాక్షి, హైదరాబాద్: హైడ్రా తొలి పోలీస్‌స్టేషన్‌ను తెలంగాణ హోంశాఖ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసే వారిపై ఇక హైడ్రా పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయనున్నారు. బుద్ధభవన్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ..
స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా ఏసీపీ స్థాయి అధికారిని ప్రభుత్వం నియమించనుంది. హైడ్రా పోలీస్ స్టేషన్‌కి కావలసిన పోలీస్ సిబ్బందిని కేటాయించాలని రాష్ట్ర డీజీపీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
కాగా, ప్రతి సోమవారం బుద్ధ భవన్ వేదికగా నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై నేరుగా ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరించనున్నారు.
ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రజావాణి నిర్వహించనున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదుదారులు ఆధారాలతో సహా రావాలని హైడ్రా కమిషనర్ సూచించారు. మొదటగా వచ్చిన 50 మంది ఫిర్యాదు దారులకు టోకెన్స్ ఇచ్చి.. ప్రాధాన్యతా క్రమంలో ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపిన రంగనాథ్ వెల్లడించారు.
ఇదీ చదవండి: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment