సాక్షి చిత్తూరు: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అర్థరాత్రి ఆయనను కుప్పం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాగార్జునయాదవ్ ఓ టీవీ ఛానెల్ చర్చలో సీఎం చంద్రబాబు గురించి మాట్లాడినందుకు టీడీపీకి చెందిన ఓ వ్యక్తి కుప్పం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దానిపై అక్కడి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కానీ, ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టులో వైఎస్సార్‌సీపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం ఈనెల 25 వరకు అతన్ని అరెస్టు చేయరాదని ఆదేశించిన విషయం తెలిసిందే. నాగార్జున యదావ్‌పై 196(1), 351(2)BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంతలోనే బెంగళూరు నుంచి విజయవాడ వస్తుండగా ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లా వికోట సమీపంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇది హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, పోలీసులిచ్చిన 41ఏకి కూడా విరుద్ధంగా ఉందని వైఎస్సార్‌సీపీ తప్పుబడుతోంది. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment