Nagarjuna Yadav
-
YSRCP నాగార్జున యాదవ్ అరెస్ట్..
-
నాగార్జున యాదవ్ అరెస్ట్
సాక్షి చిత్తూరు: వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అర్థరాత్రి ఆయనను కుప్పం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాగార్జునయాదవ్ ఓ టీవీ ఛానెల్ చర్చలో సీఎం చంద్రబాబు గురించి మాట్లాడినందుకు టీడీపీకి చెందిన ఓ వ్యక్తి కుప్పం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానిపై అక్కడి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ, ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టులో వైఎస్సార్సీపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం ఈనెల 25 వరకు అతన్ని అరెస్టు చేయరాదని ఆదేశించిన విషయం తెలిసిందే. నాగార్జున యదావ్పై 196(1), 351(2)BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.ఇంతలోనే బెంగళూరు నుంచి విజయవాడ వస్తుండగా ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లా వికోట సమీపంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇది హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, పోలీసులిచ్చిన 41ఏకి కూడా విరుద్ధంగా ఉందని వైఎస్సార్సీపీ తప్పుబడుతోంది. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపింది. -
రండి బాబు రండి.. ఇసుక ఫ్రీ..కానీ..!
-
పవన్ కళ్యాణ్ చెప్పిన నేపాల్ ఎర్ర చందనం కథ అసలు నిజాలు బయటపెట్టిన నాగార్జున యాదవ్
-
పెద్దిరెడ్డిపై దుష్ప్రచారం.. పవన్‌కు నాగార్జున యాదవ్ కౌంటర్
తాడేపల్లి: నేపాల్‌లో దొరికిన ఎర్ర చందనం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోణలపై స్ట్రాంగ్ కౌంటరిచ్చారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్.‘నేపాల్‌లో దొరికిన ఎర్ర చందనం వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉన్నట్లు దుష్ర్పచారం చేస్తున్నారు. పెద్దిరెడ్డి కుటుంబంపై పవన్ ఆరోపణలు సరికాదు. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిల హయాంలోనే ఎర్రచందనం అక్రమ రవాణా జరిగింది. పదేళ్ల క్రితమే ఎర్రచందనం దొరికింది. నేపాల్, మలేషియాతో పాటు ఇతర దేశాల్లో దాదాపు 8 వేల టన్నుల ఎర్ర చందనం దొరికింది. వాటిని ఏపీకి తెప్పించేందుకు జగన్ సర్కారు ఎన్నోసార్లు కేంద్రానికి లేఖలు రాసింది.కావాలంటే పవన్ ఆ శాఖలోనే ఉన్న లెటర్లను చదువుకోవాలి. పవన్‌కి కేంద్రంలో పలుకుబడి ఉందని చెప్పుకుంటున్నారు కదా?. మరి ఆయా దేశాల్లో ఉన్న ఎర్రచందనాన్ని ఏపీకి తెప్పించాలి. దాన్ని వేలం వేస్తే వచ్చే డబ్బు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది’ అని ధీటుగా బదులిచ్చారు నాగార్జున యాదవ్,.