క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ నటి, అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తుంటుంది. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ఇప్పటికే అమెరికాకు చేరుకుంది. అందులో విరాట్ కోహ్లీ మినహా.. మిగతా ప్లేయర్లంతా ఉన్నారు. విరాట్ మాత్రం వ్యక్తిగత పనుల నిమిత్తం ఇంకా భారత్‌లోనే ఉండిపోయారు. ఆయన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే రెండోసారి తండ్రైన విరాట్ కోహ్లీ ప్రస్తుతం ముంబైలో తన భార్య అనుష్క శర్మ, పిల్లలతో సరదాగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ముంబైలో ఉన్న కోహ్లీ.. మంగళవారం రాత్రి కుటుంబంతో కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లాడు. ఇందులో తన భార్య అనుష్క శర్మతో పాటు.. టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, అతడి భార్య సాగరిక ఘట్గే, క్రికెట్ ప్రెజెంటర్ గౌరవ్ కపూర్, తదితరులు ఉన్నారు. వారందరితో విరుష్క దంపతులు సరదాగా గడిపారు. అందుకు సంబంధించిన వీడియోలు, పోటోలు నెట్టింట తెగ చక్కెర్లు కొడుతున్నాయి. అయితే ఇక్కడ ఆ అనుష్క పట్టుకున్న హ్యాడ్‌బ్యాగ్ హాట్‌టాపిక్‌గా మారింది. చెప్పాలంటే డిన్నర్ డేట్‌లో ఆ హ్యాండ్‌బ్యాగ్ హైలెట్‌గా నిలిచింది.
ఇది గాబ్రియేలా హర్స్ట్ నినా బ్రాండ్‌కి చెందిన లగ్జీరియస్ బ్యాగ్. దీన్ని ఎక్కువగా బ్రిటీష్ రాజవంశస్తులు, కొందరూ హాలీవుడ్ ప్రముఖులు ఉపయోగిస్తారు. అచ్చం ఇదే మాదిరి బ్యాగ్‌ని ప్రిన్స్ హ్యరీ భార్య మేఘనా మార్కిల్ ధరించింది. ప్రఖాత్య హాలీవుడ్ ప్రముఖులు, ధనవంతులు ఉపయోగించే ఫేమస్ బ్రాండ్ లెదర్ బ్యాగ్ ఇది. అలాంటి లగ్జరీయస్ బ్యాగ్ అనుష్కా ధరించడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఈ బుడ్డి బ్యాగ్ ధర ఏకంగా రూ. 2.3 లక్షలు పైనే పలుకుతుందట. దీన్ని ఎక్కువగా రాజవంవస్తులు, ధనవంతుల దర్పాన్ని ప్రదర్శించే రేంజ్‌లో ఉండే లగ్జరీయస్ హ్యాండ్ బ్యాగ్ అని చెబుతున్నారు ఫ్యాషన్ ప్రముఖులు. సినీ సెలబ్రెటీలు ధరించే దుస్తుల నుంచి హ్యాండ్ బ్యాగ్‌లు వరకు అన్ని కళ్లు చెదిరిపోయేంత ఆకర్షణీయంగా ఉండటమేగాక అత్యంత విలావంతమైన వస్తువులుగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment