పిల్లి కానీ పిల్లి.. భలే గిరాకీ!
జపాన్: చూడ్డానికి అచ్చు పిల్లిలా కనిపిస్తున్నా.. వాస్తవానికిది ఓ హ్యాండ్ బ్యాగ్. ప్రస్తుతం జపాన్‌లో ఈ హ్యాండ్‌బ్యాగ్‌ల ఫ్యాషన్ తెగ నడుస్తోంది. వీటి కోసం జనం డబ్బును మంచి నీళ్లలా ఖర్చుపెట్టేస్తున్నారు. ఇంతకీ ఈ బ్యాగ్ ధరెంతో తెలుసా? రూ. 45 వేలు!
మార్జాలాలను అమితంగా ప్రేమించే పికో అనే జపనీస్ డిజైనర్ వీటిని రూపొందించారు. ఒకొక్క బ్యాగును ఆమే స్వయంగా తయారుచేస్తారట. సోషల్ మీడియాలోనూ హల్‌చల్ చేస్తున్న ఈ బ్యాగ్‌లను జపాన్‌లో మాత్రమే అమ్ముతా నని పికో చెబుతున్నారు.