ఇస్లామాబాద్: గత కొన్నాళ్లుగా పాకిస్తాన్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక పరిస్థితులు దిగజారడం, అవినీతి ఆరోపణల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కావడం వంటి ఘటనలు వల్ల ఎప్పటికప్పుడు ఆ దేశం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా బుధవారం రాత్రి పాక్ ప్రభుత్వం జాతీయ అసెంబ్లీని రద్దు చేసింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి మేరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడు అరీఫ్ అల్వీకి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించారు. అంతకుముందు ఇస్లామాబాద్‌లో ఫెడరల్ క్యాబినెట్ చివరి సమావేశానికి కూడా ప్రధాని అధ్యక్షత వహించారు. బుధవారం నేషనల్ అసెంబ్లీలో తన వీడ్కోలు ప్రసంగంలో, షరీఫ్ మాట్లాడుతూ.. ఈ రాత్రి, సభ అనుమతితో, జాతీయ అసెంబ్లీ రద్దుకు సంబంధించిన సలహాను అధ్యక్షుడికి పంపుతాను అని పేర్కొన్నారు.
దీంతో పాక్ పార్లమెంట్ దిగువసభతో పాటు ముస్లిం లీగ్- నవాజ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మూడు రోజుల ముందుగానే రద్దు అయ్యింది. ఈ నేపథ్యంలో త్వరలోనే పాక్‌లో ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా అయితే పాక్ ప్రభుత్వం పదవీ కాలం పూర్తయిన తర్వాత రెండు నెలలులోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ, ముందస్తుగానే జాతీయ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఎన్నికల నిర్వహనకు 90 రోజుల సమయం ఉంది.
చదవండి: ప్రపంచ బ్యాంక్‌లో తెలుగమ్మాయి
Comments
Please login to add a commentAdd a comment