spying attempt on Pakistan’s former Prime Minister: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ని హత్య చేసేందుకు పథకం రచిస్తున్నారంటూ...ఇటీవల పలురకాల వదంతులు వ్యాపించాయి. ఐతే ఆయన పదవీచ్యతుడు కావడంతో ఆయన అభిమానులు, అనుచరులు పుట్టిస్తున్న పుకార్లుగా పాకిస్తాన్ కొట్టిపారేసింది. కానీ అది నిజమే అనేలా ప్రస్తుతం ఖాన్ పై గూఢచర్య ప్రయత్నం జరిగింది. ఈ మేరకు ఒక ఉద్యోగి ప్రధాని ఖాన్ గదిని శుభ్రం చేసే నిమిత్తం వచ్చి అయనపై నిఘా కోసం ఒక రహస్య పరికరాన్ని అమర్చడానికి యత్నించాడు.
ఈక్రమంలోనే ఆ ఉద్యోగి పట్టుబడ్డాడు. దీంతో బనిగాలా భద్రతా బృందం సదరు ఉద్యోగిని ఫెడరల్ పోలీసులకు అప్పగించారు. అంతేకాదు పాక్ మాజీ ప్రధాని పరిసర ప్రాంతాలలో భద్రతా ఏజెన్సీలు హై అలర్ట్ ప్రకటించాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ప్రమాదం ఉందని పలువురు పీటీఐ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పీటీఐ నాయకుడు షెహబాజ్‌గిల్ మాట్లాడుతూ..ఈ విషయమై ప్రభుత్వంతో సహా సంబంధిత అన్ని ఏజెన్సీలకు సమాచారం ఇచ్చాం. పట్టుబడిన ఉద్యోగి ఈ రహస్య పరికరాన్ని అమర్చేందకు డబ్బులు ఇచ్చారంటూ కొన్ని కీలక విషయాలు బయటపెట్టాడన్నారు. ఈ చర్య హీనమైనది అంటూ...ఇలాంటి సిగ్గుమాలిన చర్యలు మానుకోవల్సిందిగా సూచించారు షహబాజ్ గిల్.
(చదవండి: మానవాళి భవిష్యత్తు ‘గుట్టు’ నేనే..)
Comments
Please login to add a commentAdd a comment