
భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఓ కార్యక్రమంలో స్టెప్పులు వేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. గత కొంతకాలంగా మూత్రపిండాలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాజ్‌పేయి గురువారం కన్నుమూశారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఎయిమ్స్ వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. గురువారం సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. దీంతో బీజేపీ శ్రేణులు, అటల్‌జీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అయితే వార్త సంస్థ ఏఎన్‌ఐ విడుదల చేసిన ఓ వీడియో నెట్‌ఇంట్లో హల్ చల్ చేస్తోంది. ఓ కార్యక్రమంలో భాగంగా వాజ్‌పేయి నృత్యం చేశారు. ఈ వీడియో పోస్టయిన కొద్ది సమయంలోనే వైరల్ అయింది.