
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతికి సంతాపసూచకంగా శుక్రవారం పలు రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి. తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో గురువారం వాజ్‌పేయి తుదిశ్వాస విడవడంతో కేంద్ర ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించడంతో కొన్ని రాష్ట్రాలు సైతం ఈనెల 16 నుంచి 22 వరకూ సంతాపదినాలను ప్రకటించాయి.
ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు శుక్రవారం విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించాయి. కర్నాటక ప్రభుత్వం కూడా నేడు సెలవు ప్రకటించింది. వరద సహాయక కార్యక్రమాలు మాత్రం యథావిథిగా కొనసాగుతాయని పేర్కొంది. తెలంగాణ, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్, యూపీ, కర్ణాటక, జార్ఖండ్, ఒడిషా, తమిళనాడు, అసోం, గోవా వంటి 14 రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హాఫ్ డే సెలవును ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment