![Former Pakistan PM Nawaz Sharif Returns Home - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/22/nawaaz-shareef.jpg.webp?itok=JKm0i3DS)
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (73) నాలుగేళ్ల స్వీయ ప్రవాసం అనంతరం స్వదేశానికి తిరిగొచ్చారు. జనవరిలో సాధారణ ఎన్ని కలు జరగనున్న నేపథ్యంలో శనివారం ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్ నుంచి బయల్దేరి ఇస్లామాబాద్ చేరుకున్నారు.
కోర్టుకు సమరి్పంచాల్సిన బెయిల్ పత్రాలపై సంతకం తదితరాల అనంతరం అదే విమానంలో లాహోర్ వెళ్లి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. తన తల్లి, భార్య రాజకీయాలకు బలయ్యారని గుర్తు చేసుకుంటూ భా వోద్వేగానికి లోనయ్యారు. వారి చివరిచూపుకూ నోచుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment