మీ నవ్వును మిస్సవుతాం బాప్‌జీ : షారూఖ్‌ | Shah Rukh Khan Tribute For Atal Bihari Vajpayee | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 17 2018 11:07 AM | Last Updated on Fri, Aug 17 2018 11:09 AM

Shah Rukh Khan Tribute For Atal Bihari Vajpayee - Sakshi

షారూఖ్‌, వాజ్‌పేయి (ఫైల్‌ ఫొటో)

కోల్‌కతా: మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఇకలేరనే వార్త విషాదాన్ని నింపింది. రాజకీయా, క్రీడా, సినిమా, వ్యాపార రంగాల్లోని ప్రముఖులంతా ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయనతో ఉన్న మధుర క్షణాలను నెమరు వేసుకుంటున్నారు. బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ సైతం  ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ లేఖను ట్వీట్‌ చేశాడు.   

‘ఢిల్లీలో ఉన్నప్పుడు నా తండ్రి వాజ్‌పేయీ ప్రసంగాలకు తీసుకెళ్లేవారు. ఆ తర్వాత నేను పెద్దవాడిని అయ్యేకొద్ది వాజ్‌పేయీతో కలిసి సమయం గడిపే అవకాశం వచ్చింది. మేం ఎప్పుడు కలుసుకున్నా కవిత్వాలు, సినిమాలు, రాజకీయాలు, నయమవుతున్న మోకాలి నొప్పుల గురించే మాట్లాడుకునేవాళ్లం. ఆయన రాసిన పద్యాల్లోని ఓ పాటలో నాకు నటించే గౌరవం దక్కింది. మా ఇంట్లో ఆయన్ను అందరూ బాప్‌జీ అని పిలుస్తారు.

ఈరోజు దేశం ఓ గొప్ప తండ్రిని, నేతను కోల్పోయింది. చెప్పాలంటే చిన్నతనంలో నేను ఆయనతో గడిపిన క్షణాలను, కవిత్వాలను కోల్పోతున్నట్లుగా ఉంది. నేను సినిమాల్లో రాణిస్తున్న రోజుల్లో ఆయన ప్రభావం నాపై ఎంతో ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబీకులకు సంతాపం తెలుపుతున్నాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండే మిమ్మల్ని మిస్సవుతాం బాప్‌జీ’ అని షారూఖ్‌ పేర్కొన్నాడు. దీనికి ఓ పాట వీడియో లింక్‌ను జత చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement