ఇస్లామాబాద్ : సహజ వాయువు దిగుమతి కాంట్రాక్టుకు సంబంధించి ఓ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ అబ్బాసీని గురువారం నేషనల్ అకౌంటబిలిటీ బోర్డు (ఎన్‌ఏబీ) అరెస్ట్ చేసింది. అబ్బాసీ ఓ మీడియా సమావేశానికి వెళుతుండగా 12 మంది సభ్యులతో కూడిన ఎన్‌ఏబీ బృందం ఆయనను అదుపులోకి తీసుకుందని డాన్ పత్రిక పేర్కొంది.
తన అరెస్ట్‌ను తొలుత ప్రతిఘటించిన అబ్బాసీ ఆ తర్వాత ఎన్‌ఏబీ బృందానికి సహకరించారని తెలిపింది. అబ్బాసీ పెట్రోలియం, సహజ వనరుల మంత్రిగా పనిచేసిన సమయంలో ఎల్‌ఎన్‌జీ దిగుమతి కాంట్రాక్టుకు సంబంధించిన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. అబ్బాసీని ఎన్‌ఏబీ ఎదుట శుక్రవారం రిమాండ్‌కు తరలిస్తారని భావిస్తున్నారు.
ఇక 2017లోఅవినీతి ఆరోపణలపై నవాజ్ షరీఫ్ ప్రధానిగా వైదొలగిన అనంతరం అబ్బాసీ పాక్ ప్రధానిగా పనిచేశారు. కాగా అబ్బాసీ అరెస్ట్‌ను నేషనల్ అసెంబ్లీలో విపక్ష నేత షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఎన్‌ఏబీ ఇమ్రాన్ ఖాన్ జేబు సంస్ధగా మారిందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment