Shahid Abbasi
-
‘పాకిస్తాన్ హిట్లర్‌గా ఇమ్రాన్’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ అబ్బాసీని అవినీతి కేసులో అరెస్ట్ చేయడం పట్ల పీఎంఎల్-ఎన్ నేత అషన్ ఇక్బాల్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ను దేశానికి హిట్లర్‌లా మారడాన్ని తాము అనుమతించబోమని ఇక్బాల్ స్పష్టం చేశారు. ఇక్కడ ఉన్న పౌరులంతా ఉగ్రవాదులేనా అని నిలదీస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో తాము వెనుకాడమని పేర్కొన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన తమను ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయకుండా ఎవరూ అడ్డుకోలేరని గతంలో దేశీయాంగ మంత్రిగా పనిచేసిన ఇక్బాల్ అన్నారు. ఎన్నికైన చట్టసభ సభ్యులను ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వేధిస్తోందని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో ఆరోపించారు. విపక్షానికి వ్యతిరేకంగా రాజ్యాంగవిరుద్ధ చర్యలు చేపడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అబ్బాసీని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఎన్జీ స్కామ్‌కు సంబంధించిన కేసులో అబ్బాసీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని అరెస్ట్
ఇస్లామాబాద్ : సహజ వాయువు దిగుమతి కాంట్రాక్టుకు సంబంధించి ఓ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ అబ్బాసీని గురువారం నేషనల్ అకౌంటబిలిటీ బోర్డు (ఎన్ఏబీ) అరెస్ట్ చేసింది. అబ్బాసీ ఓ మీడియా సమావేశానికి వెళుతుండగా 12 మంది సభ్యులతో కూడిన ఎన్ఏబీ బృందం ఆయనను అదుపులోకి తీసుకుందని డాన్ పత్రిక పేర్కొంది. తన అరెస్ట్‌ను తొలుత ప్రతిఘటించిన అబ్బాసీ ఆ తర్వాత ఎన్ఏబీ బృందానికి సహకరించారని తెలిపింది. అబ్బాసీ పెట్రోలియం, సహజ వనరుల మంత్రిగా పనిచేసిన సమయంలో ఎల్ఎన్జీ దిగుమతి కాంట్రాక్టుకు సంబంధించిన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. అబ్బాసీని ఎన్ఏబీ ఎదుట శుక్రవారం రిమాండ్‌కు తరలిస్తారని భావిస్తున్నారు. ఇక 2017లోఅవినీతి ఆరోపణలపై నవాజ్ షరీఫ్ ప్రధానిగా వైదొలగిన అనంతరం అబ్బాసీ పాక్ ప్రధానిగా పనిచేశారు. కాగా అబ్బాసీ అరెస్ట్‌ను నేషనల్ అసెంబ్లీలో విపక్ష నేత షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఎన్ఏబీ ఇమ్రాన్ ఖాన్ జేబు సంస్ధగా మారిందని విమర్శించారు. -
ట్రంప్ షాక్‌తో.. పాక్ గిలగిల
ఇస్లామాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఊహించని షాక్‌తో పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. సహాయ నిధులను నిలిపేయడంతో పాటు ఉగ్రవాదుల విషయంలో అబద్దాలు చెబుతున్నారంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజం ముందు ఇరకాటంలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీతో విదేశాంగ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మంగళవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇద్దరు నేతలు ట్రంప్ ట్వీట్ మీద, ఇకముందు అనుసరించాల్సిన విదేశాంగ విధానం గురించి సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. ట్రంప్ ట్వీట్‌పై త్వరలో స్పందిస్తామని, ప్రపంచానికి నిజాలు తెలుసని ట్విటర్లో ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు. వాస్తవాలకు కల్పితాలకు ఉన్న తేడాను ప్రపంచం గుర్తిస్తుందన్న నమ్మకాన్ని ఆసిఫ్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇదిలావుండగా.. అమెరికా కోరుకుంటున్న ‘డూ మోర్’ పాలసీని పాకిస్తాన్ ఇదివరకే తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు స్పష్టం చేసినట్లు కూడా చెప్పారు. ‘డూ మోర్’ అనే పదానికి ప్రాముఖ్యత లేదన్నారు. గత 15 ఏళ్లుగా అమెరికా అందించిన సాయంపై పూర్తి వివరాలను ఖర్చులతో సహా వివరించేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ట్రంప్ ట్వీట్‌పై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్ షెర్రీ రెహమాన్ తీవ్రంగా స్పందించారు. సంకీర్ణ భాగస్వామ్యంలో ఇచ్చిన నిధులకు జమాఖర్చులు అడగడం పాకిస్తాన్‌ను అవమానిండమేనని అన్నారు. పాకిస్తాన్ సహాయ సహకారాలు లేకుండా ఆఫ్ఘన్‌తో నాటో దళాలు యుద్ధం చేసేవా? అని ఆయన ప్రశ్నించారు. అమెరికన్ రాయబారికి సమన్లు ట్రంప్ ట్వీట్‌పై వివరణ ఇవ్వాలంటూ పాకిస్తాన్‌లోని అమెరికా రాయబారి డేవిడ్ హాలేకి ఆ దేశం సోమవారం రాత్రి సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్ సమన్లు జారీ చేసిన విషయాన్ని అమెరికా రాయబార కార్యాలయం సైతం ధ్రువీకరించింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి తెహమీనియా జుంజువా ఈ సమన్లు పంపినట్టు తెలిపింది. -
భారత విస్తరణ కాంక్షతోనే సమస్య!: పాక్
ఇస్లామాబాద్: భారత విస్తరణ కాంక్షే ఇరుదేశాల మధ్య నిర్మాణాత్మక, ద్వైపాక్షిక చర్చలకు ప్రధాన అడ్డంకిగా మారిందని పాకిస్తాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీ విమర్శించారు. భారత్ కారణంగానే ఈ చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందన్నారు. 71వ స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా పాకిస్తాన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన అబ్బాసీ.. తామెప్పుడూ భారత్‌తోపాటు మిగిలిన దేశాలతోనూ సానుకూల, నిర్మాణాత్మక సంబంధాల కోసమే ప్రయత్నించామన్నారు. చైనా ఉప ప్రధాని వాంగ్ యాంగ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.