ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ అబ్బాసీని అవినీతి కేసులో అరెస్ట్ చేయడం పట్ల పీఎంఎల్-ఎన్ నేత అషన్ ఇక్బాల్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ను దేశానికి హిట్లర్‌లా మారడాన్ని తాము అనుమతించబోమని ఇక్బాల్ స్పష్టం చేశారు. ఇక్కడ ఉన్న పౌరులంతా ఉగ్రవాదులేనా అని నిలదీస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో తాము వెనుకాడమని పేర్కొన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన తమను ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయకుండా ఎవరూ అడ్డుకోలేరని గతంలో దేశీయాంగ మంత్రిగా పనిచేసిన ఇక్బాల్ అన్నారు.
ఎన్నికైన చట్టసభ సభ్యులను ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వేధిస్తోందని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో ఆరోపించారు. విపక్షానికి వ్యతిరేకంగా రాజ్యాంగవిరుద్ధ చర్యలు చేపడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అబ్బాసీని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎల్‌ఎన్‌జీ స్కామ్‌కు సంబంధించిన కేసులో అబ్బాసీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment