చారిత్రక విజయం దిశగా నెతన్యాహు పార్టీ | Israel Benjamin Netanyahu Declares After Exit Poll Lead | Sakshi
Sakshi News home page

చారిత్రక విజయం దిశగా నెతన్యాహు పార్టీ

Published Thu, Nov 3 2022 6:07 AM | Last Updated on Thu, Nov 3 2022 6:07 AM

Israel Benjamin Netanyahu Declares After Exit Poll Lead - Sakshi

జెరుసలేం: ఇజ్రాయెల్‌లో తాజా ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు(73) సారథ్యంలోని సంకీర్ణ కూటమి చరిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. వామపక్ష మెరెట్జ్‌ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నా 85 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికే 120 మంది సభ్యుల పార్లమెంట్‌లో 65 సీట్లు నెతన్యాహు కూటమికి దక్కేలా కనిపిస్తున్నాయి.

ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక గత నాలుగేళ్లలో దేశంలో ఏకంగా ఐదుసార్లు ఎన్నికలు జరిగాయి. తాజా ఫలితాలతో రాజకీయ సందిగ్ధానికి తెరపడనుంది. నెతన్యాహు కూటమికి 65 వరకు సీట్లు దక్కుతాయని ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ వెల్లడైంది. ఈ కూటమిలో నెతన్యాహుకు చెందిన లికుడ్‌ పార్టీ, యూదు మతవాద పార్టీలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement