Historic victory
-
1984: రాజీవం
ఇందిర వారసునిగా గద్దెనెక్కిన రాజీవ్ 1984లో జరిగిన 8వ లోక్‌సభ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందుకున్నారు. ఇందిర హత్య తాలూకు సానుభూతి కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చింది. ఏకంగా 404 స్థానాల్లో ఘనవిజయం సాధించి రికార్డు సృష్టించింది. బీజేపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఈ తొలి ఎన్నికలివి. ఆ పార్టీకి భారీగా ఓట్లు పడ్డా సీట్లు మాత్రం రెండే దక్కాయి. అయితే ఈ ఎన్నికల నుంచి కాంగ్రెస్ బలం క్రమంగా తగ్గుతూ పోగా, బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ రావడం విశేషం... అభివృద్ధికి ప్రజామోదం 1984 అక్టోబర్ 31న ఇందిర హత్య యావత్ ప్రపంచాన్నీ షాక్‌కు గురి చేసింది. అదే రోజు సాయంత్రం రాజీవ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినా ఏడో లోక్‌సభ పదవీకాలం ముగుస్తుండడంతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. 1984 డిసెంబర్ 24, 27, 28 తేదీల్లో 514 లోక్‌సభ స్థానాలకే ఎన్నికలు జరిగాయి. ఉగ్రవాదంతో అట్టుడుకుతున్న అసోం, పంజాబ్‌ల్లోని మిగతా స్థానాల్లో 1985లో ఎన్నికలు జరిగాయి. సానుభూతికి తోడు ఇందిర దూరదృష్టితో చేపట్టిన అభివృద్ధి పనులు కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చాయి. హరిత విప్లవంతో పంటల దిగుబడి భారీగా పెరిగింది. రక్షణ, ఆర్థిక రంగాల్లో కీలక నిర్ణయాలను జనం హర్షించారు. ఇందిర హయాంలోని 1980–85 ఆరో పంచవర్ష ప్రణాళికను అత్యంత విజయవంతమైనదిగా చెబుతారు. జీవన వ్యయం పెరిగినా ఆర్థిక వృద్ధి 5.4 శాతానికి చేరింది. వీటన్నింటి ఫలస్వరూపంగా కాంగ్రెస్‌కు ఏకంగా 49.1 శాతం ఓట్లు, 404 సీట్లు దక్కాయి. నెహ్రూ, ఇందిర నాయకత్వంలోనూ ఇన్ని సీట్లు రాలేదు. యూపీలో కాంగ్రెస్ 85కు ఏకంగా 83 సీట్లను గెలుచుకుంది! బెంగాల్ మినహా పెద్ద రాష్ట్రాలన్నింట్లోనూ దుమ్ము రేపినా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎనీ్టఆర్ స్థాపించిన తెలుగుదేశం ధాటికి ఆరింటితోనే సరిపెట్టుకుంది. టీడీపీ ఏకంగా 30 సీట్లు నెగ్గింది. బోఫోర్స్ మరక... రాజీవ్ హయాంలో పలు వివాదాలూ రేగాయి. బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలులో అవినీతి మరక వాటిలో ముఖ్యమైనది. ఈ కాంట్రాక్ట్ కోసం గాను భారత రాజకీయ నాయకులకు బోఫోర్స్ కంపెనీ రూ.820 కోట్ల ముడుపులు చెల్లించినట్టు 1987 మేలో స్వీడిష్ రేడియో స్టేషన్ ప్రసారం చేసిన కథనం సంచలనం రేపింది. బోఫోర్స్ తరఫున మధ్యవర్తిత్వం వహించిన ఒట్టావియో ఖత్రోచికి రాజీవ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అలాగే జాతుల పోరుతో అట్టుడుకుతున్న శ్రీలంకలో శాంతి పేరుతో జోక్యంపైనా రాజీవ్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పేరిట ఆయన పంపిన భారత సైన్యం ఎల్టీటీఈతో నేరుగా యుద్ధానికి దిగింది! ఈ పరిణామం అంతిమంగా రాజీవ్ హత్యకు దారితీసింది. నాడేం జరిగిందంటే..? ఇందిర హత్యకు గురైనప్పుడు రాజీవ్ పశి్చమబెంగాల్లో పర్యటిస్తున్నారు. ఆయనతో పాటున్న కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీకి తొలుత హత్య వార్త ఉదయం 9.30కు తెలిసింది. ఇందిరపై కాల్పులు జరిగాయని మాత్రం రాజీవ్‌కు చెప్పి విమానంలో ఢిల్లీ బయల్దేరదీశారు. కాక్‌పిట్‌లోకి వెళ్లిన రాజీవ్ కాసేపటికి బయటికొచ్చి ‘అమ్మ మరణించింది’ అని ప్రకటించారు. అందరూ మౌనం దాల్చారు. మరిన్ని విశేషాలు... ► బీజేపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఈ తొలి ఎన్నికల్లో పార్టీ 7.74 శాతం ఓట్లు సాధించింది. ► బీజేపీ నెగ్గిన రెండు సీట్లలో ఒకటి హన్మకొండ. అక్కడ బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పీవీ నరసింహారావును ఓడించారు. బీజేపీకి రెండో స్థానం గుజరాత్‌లోని మెహ్సానాలో దక్కింది. ► 1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజీవ్ తీసుకొచ్చారు. ► ఓటు హక్కు వయో పరిమితిని 1988లో 21 ఏళ్ల నుంచి 18కి తగ్గించారు. ► ఎన్నికల్లో ఈవీఎంలు వాడేలా 1988లో చట్ట సవరణ చేశారు. సెబీని ఏర్పాటు చేశారు. ► 1989లో కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీకి తోడు మరో ఇద్దరు కమిషనర్లను నియమించారు. ► విద్య ఆధునికీకరణకు జాతీయ విధానాన్ని ప్రవేశపెట్టారు. నవోదయ విద్యాలయ వ్యవస్థ తెచ్చారు. ► కంప్యూటర్లు, విమానయాన పరిశ్రమ, రక్షణ, రైల్వేల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ► వృద్ధి రేటు పెంపే లక్ష్యంగా కొర్పొరేట్ సంస్థలకు సబ్సిడీలు అందించారు. ► దేశంలో టెలికం, ఐటీ రంగ అభివృద్ధికి రాజీవే ఆద్యుడని చెబుతారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చారిత్రక విజయం దిశగా నెతన్యాహు పార్టీ
జెరుసలేం: ఇజ్రాయెల్‌లో తాజా ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(73) సారథ్యంలోని సంకీర్ణ కూటమి చరిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. వామపక్ష మెరెట్జ్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నా 85 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికే 120 మంది సభ్యుల పార్లమెంట్లో 65 సీట్లు నెతన్యాహు కూటమికి దక్కేలా కనిపిస్తున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక గత నాలుగేళ్లలో దేశంలో ఏకంగా ఐదుసార్లు ఎన్నికలు జరిగాయి. తాజా ఫలితాలతో రాజకీయ సందిగ్ధానికి తెరపడనుంది. నెతన్యాహు కూటమికి 65 వరకు సీట్లు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్‌లోనూ వెల్లడైంది. ఈ కూటమిలో నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ, యూదు మతవాద పార్టీలు ఉన్నాయి. -
అఫ్గాన్ చరిత్రకెక్కింది
చిట్టగాంగ్: వానొచ్చి... రెండు సెషన్లను తుడిచేసింది. మరో సెషన్‌నూ చాలాసేపు వెంటాడింది. ఇక మిగిలింది 18 ఓవర్ల ఆటే. ఈ కాసింత సమయంలోనే కొండంత విజయాన్ని సాధించింది క్రికెట్ కూన అఫ్గానిస్తాన్. ఏకైక టెస్టులో అఫ్గాన్ 224 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై చారిత్రక విజయం సాధించింది. గతేడాది టెస్టు హోదా పొందిన అఫ్గానిస్తాన్ రెండోసారి టెస్టు విజయం రుచి చూసింది. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అఫ్గాన్ బౌలర్, కెప్టెన్ రషీద్ ఖాన్ (6/49) రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆతిథ్య బంగ్లాను చుట్టేశాడు. కనీస ఓవర్లను ఆడుకొని... బంగ్లా డ్రాతోనైనా గట్టెక్కలేకపోవడానికి రషీద్ స్పిన్ ఉచ్చే ప్రధాన కారణం. సోమవారం ఈ టెస్టుకు ఆఖరి రోజు. ముందు రోజే 398 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 44.2 ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. చివరి రోజు అఫ్గాన్ గెలిచేందుకు 4వికెట్లు కావాలి. దీంతో గెలుపు లాంఛనమే అనిపించింది. వర్షంతో బంగ్లా శిబిరంలో హర్షం... వర్షంతో సోమవారం ఆట ఓ పట్టాన మొదలే కాలేదు. తొలి సెషన్ పూర్తిగా తుడిచి పెట్టింది. కేవలం 2.1 ఓవర్ల ఆటే జరిగాక మళ్లీ వర్షం ముంచెత్తడంతో రెండో సెషన్ కూడా నిండా మునిగింది. ఈ దశలో ఆతిథ్య బంగ్లా శిబిరం సంబరంగా ఉంది. ఇక డ్రా తప్పదేమో అనుకున్న దశలో ఆఖరి సెషన్ మొదలైంది. కేవలం 18.3 ఓవర్ల ఆటే మిగిలింది. ఈ మాత్రం ఓవర్లను ఆడేయలేమా అన్న ధీమాతో బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే అఫ్గాన్ బౌలర్లు 17.2 ఓవర్ల వ్యవధిలో నాలుగు వికెట్లు తీశారు. 61.4 ఓవర్లలో 173 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను ముగించి విజయాన్ని అందుకున్నారు. -
చరిత్రాత్మక విజయమిది
యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ - మాపై ప్రజలు చూపిన నమ్మకానికి కృతజ్ఞతలు చెబుతున్నా.. - ప్రతి క్షణం దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తాం న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం చరిత్రాత్మకమని.. ఇది తమకు గర్వకారణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రజలు తమపై చూపిన నమ్మకానికి, ఇచ్చిన మద్దతుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ఖాయమైన అనంతరం మోదీ ట్వీటర్లో వరుసగా ట్వీట్లు చేశారు.‘‘అన్ని వర్గాల ప్రజల నుంచి బీజేపీకి అనూహ్యమైన మద్దతు లభించడం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా యువత నుంచి భారీగా మద్దతు లభించ డం ఆనందంగా ఉంది. బీజేపీ పట్ల చూపిన నమ్మకానికి, మద్దతు పట్ల దేశ ప్రజ లకు ధన్యవాదాలు తెలుపుతున్నా. చరిత్రాత్మక, గర్వకారణమైన విజయమిది. 125 కోట్ల మంది భారతీయుల శక్తిసామర్థ్యాలపై మాకు నమ్మకముంది. ప్రతి క్షణం దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే కృషి చేస్తాం..’’ అని మోదీ పేర్కొ న్నారు. ఘన విజయం అందించిన ఉత్తరప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను కాశీ (వారణాసి) నుంచి ఎన్నికైనవాడి నని, తనపై ప్రేమ చూపించిన కాశీ ప్రజ లకు తల వంచి అభివా దం చేస్తున్నానని పేర్కొ న్నారు. ఇక ఉత్తరాఖం డ్లో బీజేపీ విజయం ప్రత్యేక మైనదని మోదీ వ్యాఖ్యానించారు. పూర్తి నిబద్ధతతో అత్యుత్తమ పాలన అందిస్తామని ఆ రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. అటు బీజేపీ–అకాలీదళ్ కూటమికి పదేళ్లపాటు పాలించే అవకాశం ఇచ్చిన పంజాబ్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఇక తాజా విజయాలతో బీజేపీని కొత్త శిఖరాలకు చేర్చారంటూ పార్టీ జాతీయా ధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ ఆఫీసు బేరర్లు, రాష్ట్రాల నాయకులను మోదీ ప్రశంసిం చారు. బీజేపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిర్విరామంగా కృషి చేసి, ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారని అభినందించారు. -
ఆప్.. ఆర్టీఐ.. అరవింద్
రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కాబట్టి ప్రతి పార్టీ ఒక ఆర్టీఐ విభాగాన్ని ఎందుకు ఏర్పాటు చేయరాదు? ఢిల్లీ ప్రజానీకం అవినీతికి వ్యతిరేకంగా మాడు పగిలే తీర్పిచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చరిత్రాత్మక విజయం నమోదు చేసుకుంది. సమా చార హక్కు అనే అస్త్రంతో మంచి పాలన సాధించుకోవ చ్చునని పోరాడి నిరూపించిన అరవింద్ కేజ్రీవాల్‌కు ఇంతటి అపూర్వ ఆధిక్యాన్ని ఇచ్చారంటే దాని అర్థం- అవినీతి లేని పాలనను ఇవ్వమనే! అందుకు సహ చట్టాన్ని వినియోగించుకోమని ఆదేశం. లంచాల ద్వారా అక్రమా ర్జన మాత్రమే అవినీతి కాదు. నీతి నియమాలు లేని రాజకీయాలూ అవినీతే. ఓటును అమ్ముకుని, ఆ డబ్బు తో తాగి భార్యను కొట్టే ప్రతి భర్తా అవినీతిపరుడే. ఒక రాజకీయ పక్షంలో చేరి, ఆ సిద్ధాంతాన్ని విశ్వసించినట్టు నటించి ఎన్నికలలో ఆ పార్టీ గుర్తు మీద గెలిచి, పదవులు పొంది, డబ్బు సంపాదించేవారు; ఆ పార్టీకి ఆదరణ తగ్గిందని, గెలిచే పార్టీ అనుకొన్నదానిలోకి ఫిరాయించే వ్యక్తులు ప్రమాదకరమైన అవకాశవాదులు. ఢిల్లీ ఎన్నిక ల తేదీలు ప్రకటించిన తరువాత పార్టీలు మార్చిన ము గ్గురు మహిళలను ఓటర్లు తిరస్కరించారు. 70 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 67 స్థానాలను ఇంతవరకు ఏ రాష్ట్రం లోనూ, ఎప్పుడూ ఒకే పార్టీకి జనం ఇవ్వలేదు. మొన్నటి దాకా మీరే దుమ్మెత్తిపోసిన పార్టీలో కలసి పదవులు సంపాదించి మీరు చేసేదేమిటని కిరణ్ బేడీ, ఇల్మీ, కృష్ణ తీర్థలను జనం నిలదీశారు- ఈ తీర్పుతో. అలాగే ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లనే ఓటర్లు ఇతర పార్టీ లను తిరస్కరించి, తమకు ఓటు వేశారన్న వాస్తవాన్ని ఆప్ గుర్తించాలి. తమకు తిరుగేలేదన్న రీతిలో ప్రదర్శిం చిన దురహంకారానికి ఈ తీర్పు ఒక సమాధానం. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుంటే, అది నిరాశగా, నిస్పృహగా, జనాగ్రహంగా మారుతుందని, ఢిల్లీ తీర్పు అలాంటి పరిణామమేనని కూడా ఆప్ గుర్తుంచుకోవాలి. కేజ్రీవాల్ సమాచార హక్కుతో ప్రజాజీవనంలోకి ప్రవేశించారు. కాబట్టి ఆ హక్కుతో రాజకీయాలు మారు తున్నాయని, ఢిల్లీ తీర్పుతో ఆయన గుర్తించడం అవస రం. ఆప్ పరిపాలన అర్ధాంతరంగా 49 రోజులకే ముగిసి ఉండవచ్చు. అయినా ఆ స్వల్ప వ్యవధిలోనే అవినీతి రహిత, పారదర్శకత నిండిన, స్వచ్ఛమైన పాలన వచ్చిం దన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. హఫ్తా వసూళ్లు ఆగిపోయాయన్న విషయమూ వారికి గుర్తుం ది. అలాంటి పాలన ఐదేళ్లు సాగాలని ఆశించే, ఓటర్లు 67 సీట్లు ఇచ్చారు. కాబట్టి ఆ హక్కును ఇప్పుడు ఆప్ ఏ రీతిలోగౌరవిస్తుందనేది అంతా వేసుకుంటున్న ప్రశ్న. రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండా లి. కాబట్టి ప్రతి పార్టీ ఒక ఆర్టీఐ విభాగాన్ని ఎందుకు ఏర్పాటు చేయరాదు? పార్టీకి ఆదాయం ఎక్కడ నుంచి వచ్చిందో, ఎంత వచ్చిందో, ఏవిధంగా ఖర్చయిందో వెల్లడించవలసిన బాధ్యత ప్రతి పార్టీ మీద ఉన్నది. ఎన్నికలు ముగిసిన తరువాత ఈ వివరాలను నిర్ణీత కాలంలో పార్టీలే ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని చట్టం నిర్దేశిస్తున్నది కూడా. ఎన్నికలలో గెలిచినా, ఓడినా అభ్యర్థులంతా ఈ వివరాలను సమర్పించవలసిందే. ఈ లెక్కలను ఆదాయపు పన్ను శాఖకే కాదు, ప్రజలకూ విన్నవించాలి. ఈ వాస్తవాలను తెలుసుకునే హక్కు వారి కి ఉంది. రాజకీయ అవినీతిని నిర్మూలించే కృషిలో కొత్త అధ్యాయం ఈ చర్యలతోనే ఆరంభం అవుతుంది. ఈ కృషికి ఆప్ శ్రీకారం చుట్టి, మిగిలిన రాజకీయ పార్టీలకు మార్గదర్శకం కావాలి. ఆప్‌కు అనుమానాస్పదులైన వ్యక్తుల నుంచి విరా ళాలు అందినట్టు అనుమానంగా ఉందనీ, ఆ విరాళాలు ఇచ్చిన దాతల వివరాలు తెలియచేయాలని ఆదాయ పన్ను శాఖ తాఖీదులు ఇచ్చింది. నిజానికి ఆ శాఖకు మాత్రమే కాదు, ప్రజలకు కూడా అలాంటి వివరాలను వెల్లడించవలసిన బాధ్యత ఆప్ మీద ఉంది. ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా మలచాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆప్ కేంద్ర ప్రభు త్వాన్ని కోరుతోంది. దేశ రాజధాని నగరంగా ఢిల్లీకి ప్రత్యేకత ఉన్నా, పూర్తి స్థాయి రాష్ట్ర హోదా మాత్రం లేదు. అంటే కేజ్రీవాల్ మేయర్ కన్నా కాస్త ఎక్కువ. ముఖ్యమంత్రి కన్నా చాలా తక్కువ. శాంతిభద్రతల పరిరక్షణలో కూడా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవు. అవి కేంద్రం చేతిలోనే ఉన్నాయి. లెఫ్టి నెంట్ గవర్నర్‌ను పాలకునిగా నియమించి, అన్ని అధికారాలు కట్టబెట్టారు. ఇది కేజ్రీవాల్ ఎదుట ఉన్న పెద్ద సవాలు. రాజ్యాంగాన్ని సవరించి, ఢిల్లీని పూర్తిస్థా యి రాష్ట్రంగా ప్రకటించే అధికారం శాసనసభకు లేదు. ఒక సమాచార కమిషన్‌ను ఏర్పాటుచేసి, పది మంది కమిషనర్లతో సమాచార హక్కు రెండో అప్పీళ్లను ఎప్పటికప్పుడు విచారించే వ్యవస్థను ఏర్పాటు చేసే సాహసం ఢిల్లీలో ఏర్పడబోతున్న కొత్త ప్రభుత్వం చేయ గలదా? ఈ కమిషన ర్లకు సహాయకులను కూడా నియ మించగలదా? కమిషనర్ ఇచ్చిన తీర్పును అమలు చేయవలసిందేనని చట్టం చెబుతోంది. కాబట్టి అలాంటి తీర్పు మీద అన్ని సందర్భాలలోను ప్రభుత్వం హైకోర్టు కు వెళ్లకుండా ఉండగ లదా? ప్రైవేటు పాఠశాలలు, విశ్వ విద్యాలయాలు, వైద్యశాలలను; ప్రైవేటు బ్యాంకులు, సహకార సంస్థలు, బీమా సంస్థలను సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వవలసిన సంస్థలుగా ఆప్ నేత, ఆర్టీఐ ఉద్యమకారుడు కేజ్రీవాల్ ప్రకటించగలరా? ఆ విధంగా ఉత్తమ పాలనకు బాటలు వేయగలరా? వేచి చూడవలసిందే. (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com -
GHMC శాంతి భద్రతలు గవర్నర్‌కే:జైపాల్‌రెడ్డి