హైదరాబాద్‌లో సౌదీ వాసుల కష్టాలు | Telangana Govt On High Alert After The First Coronavirus Death In India | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో సౌదీ వాసుల కష్టాలు

Published Fri, Mar 13 2020 1:29 PM | Last Updated on Fri, Mar 13 2020 4:54 PM

Telangana Govt On High Alert After The First Coronavirus Death In India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో తొలి కరోనా  మరణం నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందుతున్న కోవిడ్‌ అనుమానితులను క్లియర్‌ రిపోర్ట్‌ రాకుండా బయటకు పంపొద్దని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరి.. ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్‌ చేసినప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కరోనా వైరస్‌ అనుమానితులను ఐసోలేషన్‌ చేయ్సాలిందేని నిర్ణయించింది. కర్ణాటక తొలి కోరోనా మృతుడి వివరాలను సర్వేలైన్స్‌ బృందాలు ట్రాక్‌ చేస్తున్నాయి. (కరోనా కలకలం : డిస్నీ ధీమ్‌పార్క్‌ల మూసివేత)

60 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు
కరోనా వైరస్‌తో మృతి చెందిన వ్యక్తి ఐదు రోజులు పాటు  హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఐదు వైరల్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయగా.. 60 ప్రైవేటు ఆసుపత్రులకు ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్రతి జిల్లాలోని  జిల్లా పరిషత్‌ ఆసుపత్రులు, వైద్య విధాన పరిషత్‌లలో కూడా ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనా అనుమానితుల వైద్య పరీక్షల రిపోర్టు క్లియరెన్స్‌ వచ్చే వరకు డిచార్జ్‌ చేయొద్దని జిల్లాల్లో ఏర్పాటు చేసిన రాపిడ్‌ రియాక్షన్‌ ఫోర్స్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (ఏపీలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు)

హైదరాబాద్‌లో సౌదీ వాసుల కష్టాలు
నెలరోజులు పాటు సెలవులకు హైదరాబాద్‌ వచ్చిన సౌదీ వాసులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. కరోనా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు లేకుండా సౌదీకి అనుమతి నిరాకరించడంతో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఐసోలేషన్‌ వార్డులోనే ఉండాలని గాంధీ వైద్యులు సూచించారు. వార్డు నుంచి వైద్యుల అనుమతి లేకుండా బయటకు రాకూడదనే ఆంక్షల నేపథ్యంలో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపు సౌదీ తిరిగి వెళ్లడానికి రిటర్న్‌ టికెట్లు ఉన్నాయని సౌదీ వాసులు చెప్పినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement