
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కత్తిపూడిలో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి నుంచి మరో ఐదుగురికి వైరస్ వ్యాపించడంతో ఆ గ్రామాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. శుక్రవారం వచ్చిన రిపోర్ట్స్‌లో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, వీరిలో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. గత రెండు రోజుల్లో కత్తిపూడిలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమయ్యింది. జిల్లాలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 17కు చేరుకుంది. కత్తిపూడిని రెడ్‌జోన్‌గా ప్రకటించడంతో అటు వైపు ఎవరినీ వెళ్లనివ్వకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకుండా అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment