బెజవాడ గ్యాంగ్‌వార్‌ కేసు.. పోలీసుల హైఅలర్ట్ | Gang War Case; High Alert At Vijayawada Government Hospital | Sakshi
Sakshi News home page

బెజవాడ గ్యాంగ్‌వార్‌ కేసు.. పోలీసుల హైఅలర్ట్

Published Mon, Jun 1 2020 10:30 AM | Last Updated on Mon, Jun 1 2020 11:06 AM

Gang War Case; High Alert At Vijayawada Government Hospital - Sakshi

సాక్షి, విజయవాడ: పటమటలో జరిగిన గ్యాంగ్‌ వార్‌లో మృతిచెందిన రౌడీషీటర్‌ సందీప్ మృతదేహానికి వైద్యులు సోమవారం పోస్టుమార్టం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రి వద్ద పోలీసులు అలర్ట్‌ ప్రకటించారు. అలర్లు జరగకుండా ముందుస్తుగా ఆసుపత్రి ఆవరణలో భారీ గేట్లు ఏర్పాటు చేశారు. మార్చురీ వద్దకు ఎవరిని కూడా పోలీసులు అనుమతించడం లేదు. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
(సందీప్‌కు టీడీపీ నేతల అండదండలు..)

రూ.2 కోట్ల విలువైన స్థలం విషయంలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సందీప్‌ చికిత్స పొందుతూ మృతిచెందారు. మరణాయుధాలతో ఇరువర్గాలు దాడులు చేసుకోగా, ఆసుపత్రిలో మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఘర్షణకు పాల్పడిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆరు ప్రత్యేక బృందాలను విజయవాడ సీపీ ఏర్పాటు చేశారు. పండు గ్యాంగ్‌లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement