ఎలా ఉన్నాయ్‌?.. ఏం చేస్తున్నాయ్‌? | Telangana Government Announced High Alert For Forest Department Due To Corona | Sakshi
Sakshi News home page

ఎలా ఉన్నాయ్‌?.. ఏం చేస్తున్నాయ్‌?

Published Tue, Apr 7 2020 2:24 AM | Last Updated on Tue, Apr 7 2020 2:24 AM

Telangana Government Announced High Alert For Forest Department Due To Corona - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో రా ష్ట్ర అటవీశాఖ హైఅలర్ట్‌ ప్రకటించింది. ›అభయారణ్యాల్లోని పులులు, జింకల పార్కుల్లో ని జింకలు, జూలలోని జంతువుల్లో వైరస్‌ ల క్షణాలను పరిశీలించడంతో పాటు, వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ ఆదేశిం చారు. పులులు ముక్కు కారడం, దగ్గు, ప్ర యాసపడి ఊపిరి తీసుకోవడం వంటి లక్షణా లతో బాధపడుతున్నాయా అనేది ప్రత్యక్షం గా లేదా కెమెరా ట్రాప్‌లతో పరిశీలించాలని సోమవారం తాజాగా జారీచేసిన ఆదేశాల్లో స్పష్టంచేశారు. సోమవారం నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ రాష్ట్రాలకు జారీచేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఈ ఆదేశాలిచ్చారు.

న్యూయార్క్‌లోని బ్రాంక్స్‌ జూలోని పులి కి కోవిడ్‌–19 వైరస్‌ సోకినట్టు, ఇది ఇతర జం తువులకు వ్యాప్తి చెందే ప్రమాదంపై ఆదివారం యూఎస్‌ నేషనల్‌ వెటర్నరీ సర్వీసెస్‌ ల్యాబొరేటరీస్‌ ప్రకటించిన దరిమిలా.. జాతీయ పార్కులు, అభయారణ్యాలు, టైగర్‌ రిజర్వు ల్లో జంతువుల నుంచి జంతువులకు, మనుషుల నుంచి జంతువులకు, జంతువుల నుం చి మనుషులకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లు, పీసీసీఎఫ్‌లకు కేంద్ర అటవీ శాఖ వైల్డ్‌లైఫ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌. గోపీనాథ్‌ ఆదేశాలు జారీచేశారు. వైరస్‌ వ్యా ప్తి నేపథ్యంలో ఫీల్డ్‌ మేనేజర్, వెటర్నరీ డాక్ట ర్లు, అటవీ సిబ్బందితో  టాస్క్‌ఫోర్స్, ర్యాపి డ్‌ యాక్షన్‌ ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలన్నారు.

అడవుల్లో జంతు సంరక్షణ ఇలా..
పులుల సంరక్షణ సిబ్బంది.. పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించాల్సిన కేసుల్లో స్థలం, లింగం, వయసు వంటివి రికార్డ్‌ చేయడంతో పాటు వైరస్‌ నిర్ధారణకు సంబంధించి నమూనాలు తీసుకోవాలని, సిబ్బంది పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ ఉపయోగించాలని తాజా ఆదేశాల్లో సూచించారు. వైరస్‌ ధ్రువీకరణ కోసం పులులు, ఇతర జంతువుల నమూనాలను ఐసీఏఆర్‌ ధ్రువీకరించిన ల్యాబ్‌లకు పంపిం చాలని పేర్కొన్నారు. జంతువుల సహజ మ రణాలను ఫీల్డ్‌స్టాఫ్‌ గుర్తించిన వెంటనే పై అధికారులకు తెలపడంతో పాటు వాటి శాం పిళ్లను మార్గదర్శకాలకు అనుగుణంగా సేకరించి పరీక్షల నిమిత్తం భోపాల్, హిస్సార్, బరేలిలోని సంబంధిత పరిశోధన సంస్థలకు పంపించాలని సూచించారు. అటవీప్రాంతా లు, గ్రామాల్లో సంచరించే కోతులు, లంగూర్లలో కారోనా లక్షణాలున్నాయా అనేది గమనించాలని, అడవుల్లో సాసర్‌పిట్లను నింపే సిబ్బంది శానిటైజ్‌ కావాలని, టైగర్‌జోన్లు, అడవుల్లోకి సందర్శకులను వెళ్లనివ్వరాదని, సిబ్బంది జం తువుల దగ్గరకు వెళ్లడం, కృత్రిమ ఆహా రం పెటవద్దని ఆదేశించారు.

24 గంటలూ..
రాష్ట్రంలోని జూలు, జింకల పా ర్కుల్లో వైరస్‌ వ్యాప్తి చెందకుండా 24 గంటలూ సీసీటీవీల ద్వారా పరిశీలించి, జం తువుల ప్రవర్తన ఎలా ఉందో గమనించాలని పీసీసీఎఫ్‌ ఆదేశించారు. జూలలోని పులులు, ఇతర జంతువుల్లో అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే శాంపిళ్లను ఐసీఎంఆర్‌ సూ చించిన పరిశోధన సంస్థలకు పంపించాలని సూచించారు. సిబ్బంది అనారోగ్యంతో ఉం టే జూ, జింకల పార్కుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లొద్దని ఆదేశించారు.

జంతువుల ప్రవర్తన మారిందా?
లాక్‌డౌన్‌తో అడవుల మీదుగా రాకపోకలు (అత్యవసరమైనవి మినహా) ఆగిపోయాయి. కాలుష్యం తగ్గి పర్యావరణపరం గా మంచిమార్పులు చోటుచేసుకుంటున్నా యి. ఫలితంగా అడవుల్లో వన్యప్రాణుల సంచారం పెరిగింది. జంతువులు అటవీ ప్రాంతాల్లోని రోడ్లపైకి వస్తున్నాయి. ఈ సందర్భంగా ఇవెలా ప్రవర్తిస్తున్నాయో పరిశీలన, అధ్యయనం చేయాలని కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫా రెస్ట్స్, డీఎఫ్‌వోలు, ఎఫ్‌డీవో లను అటవీశాఖ ఆదేశించిం ది. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్, ఏటూరు నాగారం ఇతర అభయారణ్యాల్లోని జంతువుల కదలికలను కెమెరా ట్రాప్‌ల ద్వారా సునిశితంగా ప రిశీలించాలని, అవి ఆహారాన్ని తీసుకునే పద్ధతుల్లో మార్పు వచ్చిందా? సహజ ప్రవర్తనకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయా? అనే దానిపై దృష్టిపెట్టాలని ఆదేశించింది. అడవుల్లోని కెమెరా ట్రాప్‌లను నీటికుంట లు, వనరుల వద్దకు, జంతువులు ఎక్కువగా రోడ్లు దాటేచోట్లకు మార్చి వాటి ప్రవర్తనను పరిశీలించాలని సూచించింది.

ఫొటో, ఆధారాలతో నివేదిక..
ఏయే జంతువులు ఏయే సమాయాల్లో రోడ్లు, నీటికుంటల వద్దకు వస్తున్నాయో కెమెరా ట్రాప్‌ ఫొటో ఆధారాలతో గుర్తించేలా అటవీశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆయా జంతుజాతుల్లో ఏవేవి గుంపులుగా వస్తున్నాయి, ఏవి ఒంటరిగా వస్తున్నాయి, ప్రవర్తిస్తున్న తీరును రికార్డ్‌ చేసి, సదరు ఫొటోలు, సమాచారాన్ని క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌కు పంపించాలని ఉన్నతాధికారులు సూచించారు. అటవీ రేంజ్‌లు, ప్రధాన అటవీ ప్రాంతాల వారీగా ఫొటో ఆధారాలతో సహా నివేదికను నెలాఖరుకు సమర్పించాలని ఆదేశించారు. అలాగే, లాక్‌డౌన్‌ నేపథ్యంలో అనుమతించిన కొన్ని వాహనాలు అడవుల్లోని రోడ్ల మీదుగా అతివేగంగా వెళుతున్నందున జంతువులు ప్రమాదాల బారినపడకుండా క్రాసింగ్‌ల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టడం, స్పీడ్‌బ్రేకర్లు, ఇతరత్రా ఏర్పాట్లు చేయాలని సూచించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement