సాక్షి, హైదరాబాద్: అయోధ్య తీర్పు నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే డీజీపీ కార్యాలయం పంపిన ఆదేశాల మేరకు అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు చెందిన పోలీసులు అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పీస్ కమి టీలు, బస్తీ సంఘాలు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించారు. తీర్పు ఎలా వచి్చనా.. గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎలాంటి భావోద్వేగాలకు, ఆవేశాలకు లోనవద్దని సూచిం చారు. కొందరు అనుమానితులు, నేరచరిత ఉన్నవారిపై నిఘా ఉంచారు. కొన్ని ప్రాంతాల్లో పికెటింగ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక భద్రతకు సంబంధించి తెలంగాణ పోలీసులు తన వద్ద సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్పీలో ఉన్న మొత్తం 54 వేల మంది సిబ్బందిని వినియోగించేందుకు సిద్ధమైంది.
సోషల్ మీడియాపై నిఘా
తీర్పు వెలువడ్డాక ఎలాంటి భావావేశాలకు లోను కావద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలాంటి పుకార్లు, వదంతులు వ్యాప్తి చేయకూడదని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో ఏ వర్గాన్నీ కించపరిచేలా ఎలాంటి కామెంట్లు, పోస్టులు, వీడియోలు పెట్టకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాపై పోలీసులు నిఘా పెట్టారు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే వెంటనే అదుపులోకి తీసుకుంటారు. ఒకవేళ రెచ్చగొట్టేలా, ఒక వర్గాన్ని కించపరిచేలా ఉండే పోస్టులు, వీడియోలు ఏమైనా వస్తే.. వెంటనే వాటిని డిలీట్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. త్వరలోనే ‘డిలీట్‌ఇట్’అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా రూపొం దించే ఆలోచనలో ఉన్నారు. అభ్యంతరకర సమాచారం ఏదైనా చూసిన వెంటనే ఇతరులకు షేర్ చేయకుండా.. దాన్ని అప్పటికప్పుడే డిలీట్ చేయడం దీని ఉద్దేశం.
పాత జిల్లాలపై ప్రత్యేక నజర్..!
పాత ఉమ్మడి 10 జిల్లా కేంద్రాల్లోనూ ప్రత్యేక నిఘా పెట్టారు. మరీ ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. పాత రౌడీïÙటర్లు, నేరచరిత్ర ఉన్నవారిని స్టేషన్లకు పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నేరస్వభావం ఉన్నవారు, అనుమానితులపైనా నిఘా ఉంచారు. జిల్లాల్లో ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ ర్యాంకు అధికారి వరకు వివిధ వర్గాలతో సమావేశాల్లో నిమగ్నమయ్యారు. న్యాయస్థానం తీర్పును అంతా గౌరవించాలని సూచిస్తున్నారు. విజయోత్సవాలు, నిరసనల ర్యాలీలు వేటికీ అనుమతి లేదని స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలో హైఅలర్ట్!
Published Sat, Nov 9 2019 2:36 AM | Last Updated on Sat, Nov 9 2019 12:31 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment