JeM
-
ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తే చాలు!
‘‘నా దృష్టిలో సినిమా అంటే ఎంటర్టైన్మెంట్. థియేటర్స్‌కు వచ్చిన ప్రేక్షకులు నా సినిమాను ఎంజాయ్ చేయాలి. నా సినిమాల ద్వారా ప్రేక్షకులకు ఏదో కొత్త విషయం చెప్పాలి, నేర్పించాలి అనుకోను’’ అన్నారు డైరెక్టర్ సుశీలా సుబ్రహ్మణ్యం. విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా సుశీలా సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో పత్తికొండ కుమారస్వామి నిర్మింన చిత్రం ‘జెమ్’. ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుశీలా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘‘మాది గుంటూరు జిల్లా తెనాలి. సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చి ముందు రైటర్‌గా, ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను. ‘ఇదం జగత్’ సినిమాకు కో డైరెక్టర్‌గా చేశాను. ‘జెమ్’ సినిమాతో దర్శకుడిగా మారాను. ఈ సినిమా కథ విషయానికొస్తే... చిన్నప్పటి నుంచి ఇద్దరు అమ్మాయిల మధ్య ఉన్న ఈర్ష్య వారు పెరిగి పెద్దవారవుతున్న క్రమంలో అహంగా మారుతుంది. ఈ ఇద్దరమ్మాయిల మధ్యలోకి హీరో వస్తాడు. ఈ అమ్మాయిల ఈగో సమస్యల్లో చిక్కుకున్న హీరో ఫైనల్‌గా తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు? అన్నదే కథ. విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర ముగ్గురూ బాగా చేశారు. నెక్ట్స్ మల్టీస్టారర్ మూవీ చేయనున్నాను’’ అన్నారు. -
పంజాబ్‌లో హైఅలర్ట్
అమృత్సర్: కశ్మీర్ ఉగ్రవాది జాకిర్ ముసా తమ రాష్ట్రంలో దాక్కున్నాడన్న సమాచారంలో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సిక్కు మతస్తుడిగా వేషం మార్చుకుని ఫిరోజ్‌బాద్, బతిండా ప్రాంతాల్లో అతడు తలదాచుకున్నట్టు నిఘా విభాగం, సీఐడీ, ఆర్మీ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అతడి ఫొటోలను కూడా విడుదల చేశాయి. ఇతడి పోస్టర్లను పంజాబ్ పోలిసులు ఇప్పటికే గురుదాస్‌పూర్‌లో అతికించారు. దీంతో ఫిరోజ్‌బాద్, బతిండా ప్రాంతాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జమ్మూ-కశ్మీర్‌ను కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ అన్సర్ ఘజ్వత్-ఉల్-హింద్(అల్-ఖాయిదా అనుబంధ సంస్థ)కు చీఫ్‌గా ఉన్న ముసా కోసం భద్రతా దళాలు చాలా రోజుల నుంచి గాలిస్తున్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జేయిఎమ్తోనూ అతడికి సంబంధాలున్నాయి. పండగ సీజన్ కావడంతో అలజడిని సృష్టించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆర్మీ ప్రధాన అధికారి బిపిన్ రావత్ సూచించారు. -
నం.1 శత్రువు భారత్.. నం.2 మోదీ!!
ఇస్లామాబాద్ : భారతదేశం 69వ గణతంత్ర వేడుకల్లో మునిగిపోయినవేళ.. పాకిస్తాన్ గడ్డపై నుంచి వెలువడిన ఒక ప్రకటన సంచలనంగా మారింది. చైనా అండతో నిర్బంధం నుంచి తప్పించుకు తిరుగుతున్న మౌలానా మసూద్ అజార్ నేతృత్వంలోని జైష్ ఏ మొహమ్మద్.. ఇండియాను ప్రప్రధమ శత్రువుగా ప్రకటించింది. సింధ్ రాష్ట్రంలోని లర్కానాలో జరిగిన బహిరంగ సభలో అజార్ సోదరుడు, జేషే కీలక నేత మౌలానా తల్హా సైఫ్ ఈ విషయాలను వెల్లడించాడు. ‘హిందుస్తాన్‌పై జిహాద్‌కు ముందుకురావాల’ని యువతను రెచ్చగొట్టాడు. ఒకవైపు తనను తాను ఉగ్రబాధిత దేశంగా చెప్పుకునే పాక్.. ఇలా బాహాటంగా జిహాద్‌కు పిలుపునిస్తున్న నేతలను మాత్రం చూసిచూడనట్లు వదిలేస్తుండటం గమనార్హం. కశ్మీరీలు పిలుస్తున్నారు : ‘‘మనకు నంబర్ 1 శత్రువు ఇండియా, నంబర్ 2 మోదీ. అల్ ఖలామ్(అజార్ నేతృత్వంలో నడిచే పత్రిక) ద్వారా ఈ సందేశాన్ని అందరికీ చేరవేయండి. భారత్‌లోని మనవాళ్లు అల్ ఖలామ్ వెబ్సైట్ ద్వారా విషయాలను తెలుసుకోవచ్చు. ఉపఖండంలో మినీ సూపర్ పవర్‌గా వ్యవహరిస్తోన్న భారత్.. మొదటి నుంచీ పాకిస్తాన్‌కు అడ్డంకులు సృష్టిస్తూనేఉంది. కానీ కశ్మీర్లో మాత్రం భారత సైన్యం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. కశ్మీరీ తల్లులు, సోదరీమణులు సాయం కోసం మనల్ని(పాకిస్తానీలను) పిలిచారు. కానీ మనం మాత్రం బానిసలుగా ఉండిపోయాం. కానీ ఇప్పుడు.. ముజాహిద్దీన్లు సరిహద్దు దాటి చొచ్చుకెళ్లగలుగుతున్నారు. ఇండియాపై జిహాద్ చెయ్యడానికి ధైర్యవంతులైన యువకులు మరింత మంది ముందుకురావాలి’’ అని మౌలానా సైఫ్ వ్యాఖ్యానించాడు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ సహా భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో జైషే మొహమ్మద్ సంస్థ ప్రమేయం తెలిసిందే. ఆ సంస్థ వ్యవస్థాపకుడైన మసూద్ అజార్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించి, నిర్బంధించాలని ఐక్యరాజ్య సమితిలో భారత్ పోరాడింది. కానీ తీర్మానం జరిగిన ప్రతిసారి వీటో చేసిన చైనా అజార్‌ను కాపాడుకుంది. ఇప్పుడు టార్గెట్ ఇండియా, మోడీలేనని సాక్షాత్తు అజార్ సోదరుడే ప్రకటించడంపై దేశాల స్పందిన వెలువడాల్సిఉంది. బహిరంగ సభలో మాట్లాడుతున్న మౌలానా తల్హా సైఫ్ -
‘పాక్‌లో ఉగ్రవాద తండాలను నిర్మూలించాలి’
ఐక్యరాజ్య సమితి : పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలను సమూలంగా నాశనం చేస్తేనే.. సరిహద్దుల్లో శాంతి ఏర్పడుతుందని భారత్ ఐక్యరాజ్యసమితిలో మరోసారి స్పష్టం చేసింది. ఉపఖండంలోని తాజా ఉగ్రవాద పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు భారత శాశ్వత ప్రతినిధి తన్మయలాల్ వివరించారు. ఆఫ్ఘనిస్తాన్, భారత్‌లోని ఉగ్రవాద చర్యలకు పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలే కారణమని ఆయన వివరించారు. తాలిబన్, హక్కానీ నెట్వర్క్, ఇస్లామిక్ స్టేట్, ఆల్ ఖైదా, వాటి అనుబంధ సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ల తండాలు పాకిస్తాన్లో విచ్ఛలవిడిగా ఉన్నాయని ఆయన వివరించారు. వీటికి చరమగీతం పాడితేనే ఉపఖండంలో శాంతి నెలకొంటుందని ఆయన ఐక్యరాజ్యసమితికి తెలిపారు. ఆఫ్గనిస్తాన్ సరిహద్దులోని ఉగ్రవాద తాండాలను నిర్మూలించాలని ఆయన సమితికి తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి పెంపొందితేనే.. ఉపఖండంలో పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తాయని ఆయన తెలిపారు. -
పార్లమెంటుపై మళ్లీ ఉగ్రవాద దాడి కుట్ర!
న్యూఢిల్లీ: భారత్ పార్లమెంటుపై 2001లో జరిగిన దాడి పునరావృతం కానుందా?. తాజాగా భారత ఇంటెలిజెన్స్ అధికారులు జారీచేసిన హెచ్చరికలు ఈ విషయాన్నే నిర్ధారిస్తున్నాయి. నిర్దేశిత దాడులతో చావుదెబ్బ తిని పగతో రగిలిపోతున్న పాకిస్తాన్ నిఘా సంస్ధ ఐఎఐ భారత పార్లమెంటుపై దాడి చేయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఉగ్రసంస్ధ జైష్ ఏ మొహమ్మద్ (జేఈఎమ్) సాయం కోరినట్లు తెలిసింది. దీంతో పార్లమెంటుపై మళ్లీ దాడిచేసేందుకు జేఈఎమ్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ వ్యూహం రచిస్తున్నట్లు భారతీయ ఇంటెలిజెన్స్ సంస్ధలు హెచ్చరించాయి. ఎలాగైనా పార్లమెంటుపై దాడిచేయాలని అజర్ నుంచి ఆపరేటివ్స్ కు ఇప్పటికే సూచనలు అందినట్లు తెలిసింది. మావవబాంబు ప్రయత్నం పార్లమెంటుపై ఫలించకపోతే, ఢిల్లీ సెక్రటరియేట్, అక్షరధామ్, లోటస్ టెంపుల్ లపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. వీటిపై దాడి కుదరకపోతే జనాభా ఎక్కువగా ఉండే మార్కెట్లలో మానవ బాంబును ప్రయత్నించాలనే సూచనలు కూడా జేఈఎమ్ ఆపరేటివ్స్ కు ఉన్నాయి. ఈ మేరకు భారత ఇంటెలిజెన్స్ వివిధ శాఖల అధికారులను హెచ్చరించింది. పార్లమెంటు భద్రతలో లోపాలను సరిచేసేందుకు ఆప్ నేత తీసిన వీడియోను (పార్లమెంటు పరిసరాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు) ఇంటెలిజెన్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. కాగా, ఇప్పటికే ఇద్దరు జేఈఎమ్ టెర్రరిస్టులు ఫిదాయీ (మానవబాంబు) కావడానికి ఆపిల్ పండ్ల ట్రక్కు ద్వారా మారణాయుధాలతో ఢిల్లీలోని ఓ మార్కెట్ కు వచ్చినట్లు ఇంతకుముందు ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వచ్చాయి. 2012 ఫిబ్రవరిలో ఢిల్లీలో చివరగా ఉగ్రదాడి జరిగింది. ప్రస్తుతం పాక్ లో ఉంటున్న మసూద్ అజర్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, కశ్మీర్ లలో దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఐఎస్ఐ పిలుపుతో మళ్లీ ఢిల్లీలో నరమేధం సృష్టించేందుకు అఫ్ఘానిస్థాన్‌కు చెందిన మరో ఉగ్రసంస్ధ, జేఈఎమ్ లో చీలిక జైషుల్-హక్ తంజీమ్ తో చేతులు కలిపినట్లు తెలిసింది. జైషుల్-హక్ తంజీమ్ చీఫ్ మౌలానా అబ్దుర్ రెహమాన్ భారతదేశ వ్యాప్తంగా దాడులు నిర్వహించేందుకు గతంలో కుట్ర పన్నాడు. ఇద్దరు ఎంఏఆర్ రిక్రూటర్లు అహ్మద్ ఖాన్ దుర్రాని, అహ్మద్ ఖాద్రీలు గత ఏడాది నవంబర్ లో కాబుల్ నుంచి ఢిల్లీకి వచ్చారు. ఆరు ప్రదేశాల్లో బాంబు పేలుళ్లకు కుట్రపన్నగా అనుకోకుండా పేలుడు సంభవించడంతో పారిపోయారు. -
చైనాకు భారత్ ఝలక్ ఇస్తుందా?
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సూత్రధారి, పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూప్ చీఫ్ మసూద్ అజార్‌పై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించకుండా చైనా అడ్డుకోవడంపై భారత్ ఆగ్రహంగా ఉంది. ఈ విషయంలో చైనాకు తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో చైనా పెట్టుబడులకు అనుమతించే విషయమై కేంద్రం పునరాలోచన చేయవచ్చునని సమాచారం. దేశంలో చైనా పెట్టుబడులకు భద్రతా అనుమతులు ఇచ్చే విషయంలో కేంద్రం పునరాలోచన చేయడమంటే.. ఐరాసలో చైనా చర్యకు దీటుగా బదులు ఇవ్వడమేనని అధికార వర్గాలు చెప్తున్నాయి. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడితోపాటు భారత్ వ్యతిరేక చర్యలు చేపడుతున్న అజార్‌ను అంతర్జాతీయంగా నిషేధించాలని భారత్ చాలాకాలంగా కోరుతోంది. అయితే అతడిపై నిషేధ తీర్మానాన్ని ఐరాసలో తన వీటో అధికారంతో చైనా తిరస్కరించడం భారత్‌ను అసంతృప్తికి గురిచేసింది. 'చైనా దౌత్యపాలసీలో పాకిస్థాన్‌కు ప్రత్యేక స్థానముంది. అందులో భాగంగానే ఐరాసలో చైనా చర్యను చూడాల్సి ఉంటుంది. ఉగ్రవాదం పీడ చైనాపై పడితేగానీ ఆ దేశం పాకిస్థాన్‌కు మద్దతు తెలుపడం మానుకోదు' అని ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర మంత్రి వీకే సింగ్ అన్నారు. 1962 భారత్-చైనా యుద్ధంనాటి నుంచి ఆసియా దిగ్గజాలైన ఈ ఇరుదేశాలకు సత్సంబంధాలు లేవు. అరుణాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్ లోని లడఖ్ విషయమై రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే.