‘‘నా దృష్టిలో సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్. థియేటర్స్‌కు వచ్చిన ప్రేక్షకులు నా సినిమాను ఎంజాయ్ చేయాలి. నా సినిమాల ద్వారా ప్రేక్షకులకు ఏదో కొత్త విషయం చెప్పాలి, నేర్పించాలి అనుకోను’’ అన్నారు డైరెక్టర్ సుశీలా సుబ్రహ్మణ్యం. విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా సుశీలా సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో పత్తికొండ కుమారస్వామి నిర్మింన చిత్రం ‘జెమ్’. ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.
ఈ సందర్భంగా సుశీలా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘‘మాది గుంటూరు జిల్లా తెనాలి. సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చి ముందు రైటర్‌గా, ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేశాను. ‘ఇదం జగత్’ సినిమాకు కో డైరెక్టర్‌గా చేశాను. ‘జెమ్’ సినిమాతో దర్శకుడిగా మారాను. ఈ సినిమా కథ విషయానికొస్తే... చిన్నప్పటి నుంచి ఇద్దరు అమ్మాయిల మధ్య ఉన్న ఈర్ష్య వారు పెరిగి పెద్దవారవుతున్న క్రమంలో అహంగా మారుతుంది. ఈ ఇద్దరమ్మాయిల మధ్యలోకి హీరో వస్తాడు. ఈ అమ్మాయిల ఈగో సమస్యల్లో చిక్కుకున్న హీరో ఫైనల్‌గా తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు? అన్నదే కథ. విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర ముగ్గురూ బాగా చేశారు. నెక్ట్స్ మల్టీస్టారర్ మూవీ చేయనున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment