
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. జైషే-ఈ-మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు తీవ్రవాదులు నగరంలోకి ప్రవేశించారన్న నిఘా వర్గాల సమాచారంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
అనుమానిత ఉగ్రవాదులను పట్టుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేశారు. హోటళ్లు, అతిథి గృహాలు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇద్దరు ఉగ్రవాదుల ఫొటోలను ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో అతికించారు. సోషల్ మీడియాలోనూ ఈ ఫొటోలు షేర్ చేశారు. ఢిల్లీ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, వీరి గురించి సమాచారం తెలిస్తే తమకు అందించాలని ప్రజలకు సూచించారు.
ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన అనుమానిత తీవ్రవాదుల ఫొటో
Comments
Please login to add a commentAdd a comment