
సాక్షి, విజయవాడ: అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం (ఎస్మా) పరిధిలోకి రాష్ట్రంలోని అంగన్వాడీలను ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు, పసి పిల్లలకు అందించే సేవలను అత్యవసర సేవలుగా ప్రభుత్వం పరిగణించింది. ఆరు నెలల పాటు అంగన్వాడీ కేంద్రాల్లో సమ్మెలు నిషేధించినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.