ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ.. జిల్లాలోని 20 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
► మొత్తం పోస్టుల సంఖ్య: 484
► పోస్టుల వివరాలు: అంగన్‌వాడీ కార్యకర్త–110, మినీ అంగన్‌వాడీ కార్యకర్త–65, అంగన్‌వాడీ సహాయకురాలు–309.
► అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వివాహిత మహిళ అయి ఉండి, స్థానికంగా నివసిస్తూ ఉండాలి.
► వయసు: 01.07.2021 నాటికి 21ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
► వేతనం: అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు రూ.11,500, మినీ అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు రూ.7000, అంగన్‌వాడీ సహాయకురాలికి నెలకు రూ.7000 చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: పదో తరగతి ఉత్తీర్ణత, ఓరల్ ఇంటర్వ్యూ, ఇతర వివరాలను ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల్ని సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించాలి.
► దరఖాస్తు ప్రారంభ తేది: 26.08.2021
► దరఖాస్తులకు చివరి తేది: 09.09.2021
► వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in
చిత్తూరు జిల్లా అంగన్‌వాడీల్లో 484 పోస్టులు
Published Mon, Aug 30 2021 4:36 PM | Last Updated on Mon, Aug 30 2021 4:36 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment