5 నిమిషాల్లో... 20 ప్రశ్నలకు జవాబు చెప్తే... మీరు గెలుచుకుంటారు.. ప్రధానమంత్రిని కలిసే అవకాశం.
న్యూఢిల్లీ : 5 నిమిషాల్లో... 20 ప్రశ్నలకు జవాబు చెప్తే... మీరు గెలుచుకుంటారు.. ప్రధానమంత్రిని కలిసే అవకాశం. ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్రం ఆన్‌లైన్ క్విజ్ నిర్వహిస్తోంది. విజేతలుగా నిలిచినవారు ప్రధాని సంతకం చేసిన సర్టిఫికెట్‌తో పాటు మోదీని వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం www.mygov.in వెబ్‌సైట్‌లోని ప్రశ్నలకు సమాధానమివ్వాలి.
ఎక్కువ సమాధానాలు చెప్పినవారిని విజేతలుగా నిర్ణయిస్తారు. ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అన్ని వెబ్‌సైట్లలోనూ ఈ క్విజ్ లింక్‌ను అనుసంధానం చేశారు. మే 25న ప్రారంభమైన క్విజ్ జూన్ 5 వరకు కొనసాగుతుంది. 2015-16లో ఆదాయపు పన్ను రిటర్న్స్ ఎంత?, ఏడాదికి 100 కోట్ల టన్నుల బొగ్గు లక్ష్యం ఏ సంవత్సరం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? వంటి ప్రశ్నల్ని నాలుగు ఆప్షన్లతో క్విజ్‌లో పొందుపర్చారు.