సాక్షి, హైదరాబాద్: రాఫెల్‌లో అవినీతి జరగడం అవాస్తవమని ఎంపీ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు స్పందించని కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్, సోనియాగాంధీలపై పలు అవినీతి కేసులున్నాయని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ప్రధాని మోదీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో టీఆఎర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని, ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే వాయిదాకు ప్రయత్నించిందని అన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా 52 శాతం ఉంటే, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం 34 శాతం చూపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. మైనార్టీలకు 12% రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment