Bandar Dattatreya
-
భౌగోళికంగా సరిహద్దులే ఉన్నాయే గానీ..
-
దళితుల ద్రోహి నెహ్రూ కుటుంబమే: దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని అత్యధిక కాలం పాలిం చిన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్ పార్టీయే దళిత ద్రోహి అని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ధ్వజమెత్తారు. దళితుల సంక్షేమం విషయంలో బీజేపీ, ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ ఆ చరిత్ర తెలుసుకోవాలన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో దళితులపై జరిగిన దాడులు ఎన్నడూ జరగలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, వేధింపుల నిరోధక సవరణ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించిన మోదీ ప్రభుత్వాన్ని దళితుల సంక్షేమంపై ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర సచి వాలయం నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రక్షణ శాఖ సానుకూలంగా ఉందని చెప్పారు. పంచాయతీ ఎన్నికలకు ఆదేశాల్విండి.. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలను తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక కోరింది. దత్తాత్రేయ ఆధ్వర్యంలో వేదిక ప్రతినిధులు కృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, సరోజ తదితరులు కేంద్ర మంత్రిని కలసి ఈ మేరకు వినతిపత్రాన్ని ఇచ్చారు. అలాగే గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విడుదల చేయడం లేదని, అధికారాల బదలాయింపు కూడా జరగడం లేదని వివరించారు. -
రాఫెల్లో అవినీతి అవాస్తవం: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: రాఫెల్లో అవినీతి జరగడం అవాస్తవమని ఎంపీ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు స్పందించని కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్, సోనియాగాంధీలపై పలు అవినీతి కేసులున్నాయని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ప్రధాని మోదీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో టీఆఎర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే వాయిదాకు ప్రయత్నించిందని అన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా 52 శాతం ఉంటే, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం 34 శాతం చూపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. మైనార్టీలకు 12% రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
హైదరాబాద్: పార్లమెంటు సమావేశాలను సజావుగా జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకోవడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కేంద్ర మాజీమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిరసనలో భాగంగా గురువారం ఇక్కడ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ మోదీ అవినీతి రహిత పాలన అందిస్తుంటే, అనేక సంక్షేమ పథకాలతో దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తుంటే సహకరించాల్సిన ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రతి అంశంపై చర్చించడానికి, సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. 23 రోజులపాటు పార్లమెంటు సమావేశాలను ప్రతిపక్షాలు అడ్డుకోవడం వల్ల రూ.200 కోట్ల ప్రజాధనం వృథా అయిందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రజలకు మేలు చేసే విధంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నగర కార్యదర్శి సలంద్రీ శ్రీనివాస్‌యాదవ్, నాయకులు రాజశేఖర్‌రెడ్డి, చింత సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
అది చట్ట విరుద్దమని కోర్టు ఇదివరకే తీర్పిచ్చింది: దత్తాత్రేయ
హైదరాబాద్: ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని సుప్రీం కోర్ట్ ఇది వరకే తీర్పు ఇచ్చిందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ చెప్పారు. విలేకరులతో మాట్లాడుతూ..ఖురాన్లో మహిళలు, పురుషులు సమానం అని ఉందని అన్నారు. ట్రిపుల్ తలాక్ 14 వందల సంవత్సరాల నుంచి సంప్రదాయంగా సాగుతోందని, ఆ విషయం మీద ముస్లిం మహిళలు ఎన్నో పోరాటాలు చేశారని చెప్పారు. ట్రిపుల్ తలాక్ పేరు మీద ఎవరినీ జైలు పంపించే ఉద్దేశం బీజేపీకి లేదని స్పష్టం చేశారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సామాజిక న్యాయం మహిళలకు కావాలని అన్నారు. కాంగ్రెస్ ముస్లింల అభివృద్ధిని ఎప్పుడూ కోరుకోలేదని, కేవలం వారిని ఓటు బ్యాంక్‌గానే చూశాయని విమర్శించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన రోజు చరిత్రాత్మక దినమని అభివర్ణించారు. అసద్ రాజకీయ ఉద్దేశం బీజేపీకి అంటగట్టడం సరైంది కాదన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్ సభలో పాస్ అయినందుకు ఏఐసీసీ మహిళా విభాగ కార్యదర్శి నసీమా బీజేపీలో చేరారని చెప్పారు. 2018 సంవత్సరం బీజేపీకి ఉద్యమాల సంవత్సరం అన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల పై సీఎం కేసీఆర్ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన సాగునీటి ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడకు పోతుందని విమర్శించారు. -
అది పార్టీ నిర్ణయం
మంత్రి పదవికి రాజీనామాపై దత్తాత్రేయ సుభాష్‌నగర్ (నిజామాబాద్ అర్బన్): కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రిగా పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. పార్టీ, ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానన్నారు. మంత్రి పదవి నుంచి తప్పించడంపై ఆయన పైవిధంగా స్పందించారు. ఆదివారం నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పార్టీ,ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. తాము బీజేపీ సిద్ధాంతం కోసం పనిచేసే సైనికులమని, పదవుల కోసం పనిచేసే నాయకులం కాదన్నారు. మోదీతో సమానంగా పనిచేస్తున్నామన్నారు. ఏపీ, తెలంగాణలో ఎవరికీ కేంద్ర కేబినెట్లో అవకాశం లభించలేదని, ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తానన్నారు. -
సమగ్ర విత్తన చట్టం కోసం కృషి
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్: రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం సమగ్ర విత్తన చట్టం తీసుకురావడానికి తనవంతుగా కృషి చేస్తా నని, ఈ విషయంలో కేంద్ర వ్యవసాయ మంత్రి, ప్రధాన మంత్రితో చర్చిస్తానని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హామీనిచ్చారు. తెలంగాణ భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని నారాయణగూడలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కేంద్రమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతుల భాగస్వామ్యంతోనే దేశం మరింత ప్రగతి సాధిస్తుందని, వారిని అన్ని రకాలుగా ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కల్తీ విత్తనాలను విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. సాగునీరు, 24 గంటల కరెంట్ ఇస్తే కాలానుగుణంగా రైతులు అనేక పంటలను పండిస్తారని, దీంతో ఆత్మహత్యలనేవే ఉండవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ఇప్పటి వరకు రూ.18 కోట్లు మంజూరు చేసిందన్నారు. -
కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తోంది
బీసీల అభ్యున్నతిపై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సాక్షి, న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధి తో పనిచేస్తోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద మంగళవారం ధర్నా చేపట్టారు. ఇందులో దత్తాత్రేయ మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి కేంద్రం ఓబీసీ కమిషన్ బిల్లును లోక్‌సభలో ఆమోదిస్తే.. ప్రతిపక్షాలు కుట్రలతో రాజ్యసభలో అడ్డుకున్నాయన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే బీసీలకు న్యాయం జరిగేదన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదింపజేస్తామని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి హామీ ఇచ్చినట్టు దత్తాత్రేయ తెలిపారు. ధర్నాకు సంఘీభావం తెలిపిన టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయన్నారు. దేశంలో మరో భారీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఎంపీ బూర నరసయ్యగౌడ్ మాట్లాడుతూ.. బీసీల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొచ్చేలా సీఎం కేసీఆర్‌ను ఒప్పిస్తానని చెప్పారు. బీసీ వ్యతిరేక పార్టీలను ఇక ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు హెచ్చరించారు. దేశంలో 50 శాతంపైగా జనాభా ఉన్న బీసీలకు రాజకీయాల్లో కనీస రిజర్వేషన్లు లేకపో వడం అన్యాయమని జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు తమ పోరాటం ఆగదన్నారు. -
వచ్చే నెల్లో పీఎఫ్ వడ్డీ రేట్లపై నిర్ణయం
న్యూఢిల్లీ: 2017–18 సంవత్సరానికి పీఎఫ్ వడ్డీరేట్లను వచ్చే నెల్లో జరిగే సమావేశంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో నిర్ణయించనుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం మాట్లాడుతూ.. ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీల(సీబీటీ) సమావేశం అనంతరం.. వడ్డీరేట్లపై కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంటుందని, వచ్చే నెల్లో సమావేశం ఉండవచ్చని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులపై రాబడి అంచనాల మేరకు వడ్డీ రేట్లను సీబీటీ ప్రతిపాదిస్తుందని, అనంతరం చైర్మన్ హోదాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా ఈ ఏడాది పీఎఫ్ వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్లు(0.25 శాతం) తగ్గించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెక్యూరిటీలు, బాండ్ల రూపంలో ఈపీఎఫ్‌వో పెట్టిన పెట్టుబడులపై రాబడి తగ్గవచ్చనే అంచనా మేరకు ఈ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. -
మానవ వనరులకు కొదవ లేదు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: దేశంలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలో భారత్ అగ్రభాగంలో నిలుస్తుందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో పేరుందని, ఎగుమతులపై దృష్టి పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. మానవ వనరుల నిర్వహణపై శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కార్మిక చట్టాలు మరింత కట్టుదిట్టం చేశామని చెప్పారు. కార్మిక చట్టాల్లో సవరణలు చేశామని, నియామకం నుంచి పదవీ విరమణ వరకు కార్మికులు లబ్ధిపొందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఉభయ సభల్లో వీటికి ఆమోదం లభిస్తుంద ని భావిస్తున్నామన్నారు. వేతన చెల్లింపులన్నీ డిజిటలైజ్ చేస్తున్నామని, కంపెనీల్లో ఇకపై కార్మికులు తమ వేతనాలను చెక్కులు, ఆన్లైన్లో తీసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
కేంద్రమంత్రికి సన్మానం
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్, సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ విశ్రాంతి కార్మికులకు కనీసం రూ.5 వేల హయ్యర్ పింఛన్ సౌకర్యాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాకు చెందిన ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులు కేంద్రమంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగులు బస్వరాజ్, రాజసింహుడు, నర్సింహులు, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
టీటీడీ బోర్డు శ్వేతపత్రం విడుదల చేయాలి
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: టీటీడీ వ్యవహారాలను రాజకీయాలతో భ్రష్టుపట్టిస్తున్న బోర్డును రద్దు చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. సిద్దిపేట సరస్వతి శిశుమందిర్‌లో ఆదివారం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ వైకుంఠ ఎకాదశిన 9000 పాసులను విడుదల చేసి డబ్బు, అధికారం ఉన్న వాళ్లకు బోర్డు అవకాశం కల్పించిందని ఆరోపించారు. స్వామి దర్శనాన్ని వ్యాపారం చేశారని విమర్శించారు. బోర్డు వ్యవహరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాధువులు, పీఠాధిపతులు, భక్తులతో పరిషత్‌ను ఏర్పాటు చేసి స్వామి దర్శనాన్ని సామాన్యులు సులభంగా పొందే అవకాశం కల్పించాలన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇరు ప్రాంతాల్లో విశ్వాసం కోల్పోయిన సీఎం చిత్త శుద్ది ఉంటే పదవికి రాజీనామా చేసి ప్రజల్లో కలవాని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ నేతలు రాంచంద్రారెడ్డి, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.