సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: టీటీడీ వ్యవహారాలను రాజకీయాలతో భ్రష్టుపట్టిస్తున్న బోర్డును రద్దు చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. సిద్దిపేట సరస్వతి శిశుమందిర్‌లో ఆదివారం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ వైకుంఠ ఎకాదశిన 9000 పాసులను విడుదల చేసి డబ్బు, అధికారం ఉన్న వాళ్లకు బోర్డు అవకాశం కల్పించిందని ఆరోపించారు. స్వామి దర్శనాన్ని వ్యాపారం చేశారని విమర్శించారు.
బోర్డు వ్యవహరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాధువులు, పీఠాధిపతులు, భక్తులతో పరిషత్‌ను ఏర్పాటు చేసి స్వామి దర్శనాన్ని సామాన్యులు సులభంగా పొందే అవకాశం కల్పించాలన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇరు ప్రాంతాల్లో విశ్వాసం కోల్పోయిన సీఎం చిత్త శుద్ది ఉంటే పదవికి రాజీనామా చేసి ప్రజల్లో కలవాని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ నేతలు రాంచంద్రారెడ్డి, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ బోర్డు శ్వేతపత్రం విడుదల చేయాలి
Published Sun, Jan 12 2014 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
Advertisement