declaration form
-
ప్చ్.. పవన్‌కు ఇక తిరుమల ఎంట్రీ లేనట్లేనా?
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటన విషయంలో చంద్రబాబు తన క్షుద్ర రాజకీయాన్ని ప్రదర్శించారని.. మునుపెన్నడూ లేనివిధంగా డిక్లరేషన్ అంశాన్ని తెర మీదకు తెచ్చారని వైఎస్సార్సీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకట్‌రెడ్డి అన్నారు. సాక్షి బిగ్ డిబేట్లో.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాప్టిజం అంశాన్ని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.పవన్ కల్యాణ్ తాను బాప్టిజం తీసుకున్నానని, తన స్నేహితుడే ఇప్పించాడని స్వయంగా చెప్పారు. మరి ఆయన ఎప్పుడు హిందువుగా మారారు?. తిరుమలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారా?. పవన్‌ను ఎందుకు డిక్లరేషన్ అడగరు. మొన్నీమధ్యే హోం మంత్రి అనిత వెళ్లారు. అప్పుడు ఆమె డిక్లరేషన్ ఇచ్చారా?. గవర్నర్ అబ్దుల్ నజీర్ వెళ్లారు.. ఆయన్ను డిక్లరేషన్‌ను అడిగారా?. ఎవరికీ లేని డిక్లరేషన్ బోర్డులు.. వైఎస్ జగన్ విషయంలోనే ఎందుకు?. ఆయన తిరుమల వెళ్లడం కొత్త కాదు కదా. సీఎం హోదాలో తిరుమలకు వెళ్లిన వ్యక్తి ఆయన. తన మతం మానవత్వం అని క్లియర్‌గా ప్రకటించిన వ్యక్తి. కేవలం కొవ్వెక్కి చంద్రబాబు తాను మాట్లాడిన మాటల్ని పక్కదారి పట్టించేందుకే డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. పర్యటన రద్దు కాగానే ఆ బోర్డు తీసేశారు. తిరుమలలో ల్యాబ్‌లు లేవని అంటున్నారు. కానీ, తిరుమలలో ల్యాబ్‌లు ఉన్నాయి. అలాగే లడ్డూను టెస్ట్ చేసిందని చెబుతున్న ఎన్డీడీబీ సుద్ధపూస సంస్థేం కాదు. రూ. 475 కోట్ల స్కామ్ జరిగిందక్కడ. తిరుమల పవిత్రతను కాపాడాలంటే.. టీటీడీ బోర్డు ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేక.. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే దుర్మార్గమైన మాటలు చంద్రబాబు మాట్లాడారు. కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని దెబ్బ తీస్తూ చంద్రబాబుకి శిక్ష పడడం ఖాయం. ఆ దేవుడు కచ్చితంగా శిక్షిస్తాడు అని వెంకట్‌రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: ఆ నెయ్యి ఎక్కడ వాడారు అనేది అప్రస్తుతం -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం ప్రారంభించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో ఈ నెల 25, 27వ తేదీల్లో జారీ చేసిన మెమోలను రద్దు చేయాలని కోరుతూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై లంచ్ మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరపాలని అప్పిరెడ్డి తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్ధించారు.దీంతో న్యాయమూర్తులు జస్టిస్ సత్తిరెడ్డి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్‌ల ధర్మాసనం లంచ్ మోషన్ రూపంలో గురువారం అత్యవసర విచారణకు అంగీకరించింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలని, తన పేరు, హోదా వివరాలు చేతితో రాసినా కూడా ఆమోదించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది జూలైలో మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఈ మార్గదర్శకాలు అమలవుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ అడిగిందే తడవుగా, సీఈవో ఆ మార్గదర్శకాలకు తూట్లు పొడిచారు. టీడీపీకి అనుకూలంగా వాటిని సడలించారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి.. పేరు, హోదా వివరాలు చేతితో రాయకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్‌ను ఆమోదించాలంటూ ఈ నెల 25, 27వ తేదీల్లో మెమోలు జారీ చేశారు. ఈ నిర్ణయం అత్యంత వివాదాస్పదంగా మారింది. కూటమి తప్ప, అన్నీ రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రధాన అధికారి నిర్ణయంపై అందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది అంతిమంగా శాంతిభద్రతల సమస్యగా మారుతుందని భయపడుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని నిబంధన ఏపీలో అమలు సీఈవో ఇచ్చిన సడలింపుల అమలును నిలిపేసి, కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది జూలైలో జారీ చేసిన మార్గదర్శకాలను యథాతథంగా, నిజమైన స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ప్రతివాదులుగా చేర్చింది. మధ్యాహ్నం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, వైఎస్సార్సీపీ తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి, న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ వాదనలు వినిపించారు. దాదాపు రెండు గంటల పాటు వాదనలు కొనసాగాయి.సీఈవో తన పరిధి దాటి మరీ మెమోలు జారీ చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమలు చేస్తున్నారని తెలిపారు. సీఈవో మెమోల వల్ల వచ్చే నష్టం గురించి ధర్మాసనానికి వివరించారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలని, తన పేరు, డిజిగ్నేషన్ వివరాలు చేతితో రాసినా కూడా ఆమోదించాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు చెబుతున్నాయని, ఇందుకు విరుద్ధంగా పోస్టల్ బ్యాలెట్ ఓటు ఉంటే, దానిని తిరస్కరించవచ్చని తెలిపారు.అయితే ఇప్పుడు సీఈవో ఆ మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చారని, కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అమలు చేయడం లేదన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. కౌంటింగ్ ప్రక్రియలో నిష్పాక్షికత కోసమే ఈ వ్యాజ్యం దాఖలు చేశామన్నారు. నిబంధనలకు తూట్లు పొడిచే అధికారం సీఈవోకు లేదన్నారు. కొన్ని రాజకీయ పారీ్టలకు మేలు చేసేందుకే సీఈవో ఈ మెమో జారీ చేశారని తెలిపారు.పేరు, హోదా, సీలు లేకపోయినా ఆమోదించాలి 25, 27వ తేదీల్లో జారీ చేసిన మెమోలపై వివరణ ఇవ్వాలని ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో సీఈవో తమ అభిప్రాయాన్ని కోరారని తెలిపారు. అధికారుల సంతకం విషయంలో ఏదైనా సందేహం ఉన్నా, వెరిఫికేషన్ అవసరం అయినా, ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఉన్న అటెస్టింగ్ అధికారుల నమూనా సంతకాలు, పేర్లు, హోదాల వివరాలను తీసుకోవాలంటూ ఈ నెల 25వ తేదీన జారీ చేసిన మెమోలోని రెండో పేరాను ఉపసంహరించుకుంటున్నట్లు అవినాష్ చెప్పారు.ఈ రెండో పేరాకు అనుగుణంగా 27న జారీ చేసిన మెమోను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు ఆయన కోర్టుకు వివరించారు. ఇదే సమయంలో పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, పేరు, హోదా, సీలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలంటూ తాజాగా (30వ తేదీన) ఆదేశాలు జారీ చేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీటిని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు.ఈ సమయంలో వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ, 25న ఇచ్చిన మెమోలోని పేరా 2, 27న ఇచ్చిన మెమోను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పిన విషయాన్ని రికార్డ్ చేయాలని కోర్టును కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించి, అవినాష్ చెప్పిన విషయాలను రికార్డ్ చేసింది. అవినాష్ జోక్యం చేసుకుంటూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ఇది రెగ్యులర్ కేసు కాదని గుర్తు చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. -
భారత్‌కు వచ్చే ప్రయాణికులకు శుభవార్త.. ఆ నిబంధన ఎత్తివేత
న్యూఢిల్లీ: ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా మహమ్మారి కట్టడి కోసం తీసుకొచ్చిన ‘ఎయిర్ సువిధ’ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధనను ఎత్తివేసింది. అయితే, ‘ఎయిర్ సువిధ’ నిబంధనను ఎత్తివేసినప్పటికీ కొన్ని అంశాలను ప్రయాణికులు కచ్చితంగా పాటించాలని కోరింది. ప్రయాణ సమయంలో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వాళ్లు మాస్కు ధరించాలని, మిగతా ప్రయాణికులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇలాంటి వారు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌లో ఉండాలని తెలిపింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. వారి వ్యక్తిగత వివరాలతో పాటు ఏ వ్యాక్సిన్, ఎన్ని డోసులు, ఏ సమయంలో తిసుకున్నారనే వివరాలను అందించాల్సి ఉంటుంది. ఆర్టీపీసీఆర్ టెస్టు వివరాలనూ ‘ఎయిర్ సువిధ’ పోర్టల్‌లోని సెల్ఫ్ డిక్లరేషన్ పత్రంలో పొందుపరచాల్సి ఉండగా.. తాజాగా ఆ నిబంధనను భారత్ ఎత్తివేసింది. ఈ నిబంధన ఎత్తివేసినప్పటికీ పూర్తిస్థాయిలో కోవిడ్ టీకా తీసుకున్న తర్వాతే భారత్‌కు రావడం మంచిదని పేర్కొంది. డీ బోర్డింగ్ సమయంలోనూ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు ఉంటాయని, కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్‌కు వెళ్లాలని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇదీ చదవండి: Viral Video: ఘోస్ట్ పేషెంట్‌తో మాట్లాడుతున్న సెక్యూరిటీ గార్డు -
75 ఏళ్లు దాటినవారికి ఐటీ రిటర్నుల మినహాయింపు
న్యూఢిల్లీ: వచ్చే ఆరి్థక సంవత్సరం నుంచి 75 ఏళ్లు నిండిన వృద్ధులు ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన పనిలేదు. ఇందుకు సంబంధించి ఐటీ రిటర్నుల మినహాయింపు డిక్లరేషన్ ఫారమ్ ‘12బీబీఏ’ (వెల్లడి పత్రాలు)ను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫై చేసింది. 2021–22 ఆరి్థక సంవత్సరానికి (అసెస్మెంట్ సంవత్సరం 2022–23) సంబంధించి ఐటీ రిటర్నుల మినహాయింపులను పొందే వృద్ధులు ఈ డిక్లరేషన్ పత్రాన్ని బ్యాంకులకు సమరి్పంచాలి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021–22 బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా తాజా నిర్ణయం వెలువడింది. -
కేరళ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగులంతా ఇకపై
Dowry.. సమాజంలో ఎన్నో అవరోధాలను కలిగిస్తోంది. తల్లిదండ్రులకు ఆడ పిల్ల పుడితే లక్షల కట్నాలు ఎక్కడ ఇవ్వాలని పురిట్లోనే ఆడపిల్లలను చంపేసిన ఘటనలు కోకొల్లలు. అయితే కాలం మారింది. కాలంతో పాటు సమాజంలో కట్టుబాట్లు, ఆచారాలు మారుతున్నాయి. ఆడ పిల్లలు తమకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటున్నారు. అది కూడా కట్నాలకు ఆశ పడని వాడికే తమ మనసు సొంతం అంటున్నారు. తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం వరకట్నానికి వ్యతిరేకంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేరళ ప్రభుత్వంలో పని చేస్తున్న వివాహం కాని పురుష ఉద్యోగులు తాము వరకట్నాన్ని ప్రొత్సహించడం లేదా తీసుకోకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా పెళ్లైన నెల రోజుల్లో తాము పని చేస్తున్న విభాగం అధిపతులకు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ డిక్లరేషన్‌లో భార్య సంతకంతో పాటు వధువు, వరుడిల తండ్రి సంతకం ఉండాలని పేర్కొంది. మహిళ, శిశు సంక్షేమ శాఖ కొద్దిరోజుల క్రితం ఈ సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు, అటానమస్, ఇతర సంస్థలకు సంబంధించిన విభాగాల అధిపతులు సైతం ఈ మేరకు డిక్లరేషన్లు తీసుకోవాలని తెలిపింది. ఇక కేరళలో ప్రతి ఏడాది నవంబర్ 26న వరకట్న వ్యతిరేక దినోత్సవంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు స్కూల్స్, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు కట్నం తీసుకోమని ప్రతిజ్ఞ చేయాలని ప్రభుత్వం సూచించింది. గత నెలలో వరకట్నానికి వ్యతిరేకంగా విద్యార్థులందరూ తమ డిగ్రీ తీసుకోవడానికి ముందు బాండ్ ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ సూచించిన సంగతి తెలిసిందే. -
సీఎం జగన్‌కు శ్రీవారిపై ఎంతో నమ్మకం
సాక్షి, తిరుమల: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల శ్రీవారి పట్ల అపారమైన భక్తి కలిగి ఉన్నారు. ఆనాడు పాదయాత్ర ప్రారంభం ముందు,ముగిసిన తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. పీఠాధిపతులు అందరూ ఆశీర్వదించారు. శృంగేరి పీఠం వెళ్లి పుణ్యస్నానాలు చేశారు. తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు ఒకే కుటుంబం నుంచి నాడు వైఎస్, నేడు జగన్ సమర్పించారు. సీఎంకు వ్యక్తులుపై నమ్మకం కంటే ప్రజలు అంటే నమ్మకం ఎక్కువ. ప్రజలు దేవుళ్లుగా భావించే వ్యక్తి సీఎం జగన్,ప్రజలు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు.ఆనాడు ప్రజా సంకల్ప యాత్ర ముగిసిన తర్వాత కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు’ అని తెలిపారు. (డిక్లరేషన్ తీసేయాలని చెప్పలేదు: వైవీ సుబ్బారెడ్డి) ‘ప్రతిపక్ష నేత మత, కుల ఘర్షణలు సృష్టిస్తున్నారు. సీఎం జగన్ ప్రజలు అందరి మనిషి. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అన్ని అమలు చేస్తున్నారు. డిక్లరేషన్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. నాడు వైఎస్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు, గత ఏడాది సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు అందించారు.. ఈ సారి కూడా ఈ ఆనవాయితీ కొనసాగిస్తారు. 500 దేవాలయాలు నిర్మాణానికి సీఎం నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు గుళ్లను కూల్చివేశారు. దేశంలొనే అత్యధికంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఏపీ. ప్రజలు మనిషి సీఎం జగన్.. కోటీశ్వరులు మనిషి చంద్రబాబు నాయుడు’ అంటూ నారాయణ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అందుకే కాంగ్రెస్ బొక్కబోర్లా పడింది...
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హిందువు అని ఎందుకు చెప్పుకున్నారని బీజేపీ శాసన సభాపక్ష నేత కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. అలాగైతే సోమనాథ్ దేవాలయంలో హిందూ ఎందుకు డిక్లరేషన్ ఇచ్చారని సూటిగా కాంగ్రెస్ నేతలను అడిగారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకం అని అన్నారు. గుజరాత్లో ఆరో సారి సూపర్ సిక్సర్‌గా, డబుల్ హ్యాట్రిక్ విజయాన్ని కుహానా మేధావులు, విశ్లేషకులు తక్కువ చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఐదు సంవత్సరాలకే కాంగ్రెస్ ఓడిపోతే మాట్లాడటం లేదు కానీ గుజరాత్లో వరుసగా ఆరవ సారి గెలిస్తే తక్కువ చేసి మాట్లాడటం దారుణమన్నారు. కిరాయి నాయకులతో కాంగ్రెస్ రెచ్చగొట్టి అధికారం కోసం ప్రయత్నం చేసి కాంగ్రెస్ బొక్కబోర్లా పడిందని ఎద్దేవా చేశారు. వచ్చిన సీట్లు కూడా కాంగ్రెస్ బలుపు కాదు అది వాపు అని విమర్శించారు. బీజేపీ పై వ్యతిరేకతతో గుజరాత్ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ నాయకులు అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. చైనా, పాకిస్థాన్ హస్తం కూడా గుజరాత్ ఎన్నికల్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయన్నారు. మోదీ మీద వ్యక్తిగత వ్యాఖ్యాలు చేస్తూ..నీచుడని, విదేశీ పుట్టగొడుగులు తిని తెల్లగా అయిపోతున్నారని దిగజారి మాట్లాడారని వివరించారు. కాంగ్రెస్‌ను అస్సాం, యూపీ, హర్యానా, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్లలో ఓడిస్తే దిక్కులేదు కానీ..రాహుల్ గాంధీ ఏదో పొడిచారని ప్రచారం చేసుకోవడం ఏమనుకోవాలని ప్రశ్నించారు. ఓట్లు పెరిగి సీట్లు తగ్గితే బీజేపీ మీద విషం కక్కుతారా..ప్రజలు ఆదరించినా కూడా ఇంకా జీఎస్టీ, నోట్ల రద్దు మీద దాడి చేయడం వంటివి దేశ నాశనం కోరుకునే వారే చేస్తారని చెప్పారు. రేపు ఎల్లుండి సమావేశాల్లో బీజేపీ రూట్ మ్యాప్ తయారు చేస్తున్నామని, వివిధ స్థాయిలలో తమ ముఖ్య నాయకుల సమావేశం ఉందని, ఈ ఎన్నికల స్ఫూర్తిగా మా అడుగులు ఉంటాయని తెలిపారు. నిన్నటి దాకా మోదీని పొగిడిన రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి సిద్ధాంతం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. -
టీటీడీ బోర్డు శ్వేతపత్రం విడుదల చేయాలి
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: టీటీడీ వ్యవహారాలను రాజకీయాలతో భ్రష్టుపట్టిస్తున్న బోర్డును రద్దు చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. సిద్దిపేట సరస్వతి శిశుమందిర్‌లో ఆదివారం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ వైకుంఠ ఎకాదశిన 9000 పాసులను విడుదల చేసి డబ్బు, అధికారం ఉన్న వాళ్లకు బోర్డు అవకాశం కల్పించిందని ఆరోపించారు. స్వామి దర్శనాన్ని వ్యాపారం చేశారని విమర్శించారు. బోర్డు వ్యవహరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాధువులు, పీఠాధిపతులు, భక్తులతో పరిషత్‌ను ఏర్పాటు చేసి స్వామి దర్శనాన్ని సామాన్యులు సులభంగా పొందే అవకాశం కల్పించాలన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇరు ప్రాంతాల్లో విశ్వాసం కోల్పోయిన సీఎం చిత్త శుద్ది ఉంటే పదవికి రాజీనామా చేసి ప్రజల్లో కలవాని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ నేతలు రాంచంద్రారెడ్డి, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.