సాక్షి, తిరుమల: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల శ్రీవారి పట్ల అపారమైన భక్తి కలిగి ఉన్నారు. ఆనాడు పాదయాత్ర ప్రారంభం ముందు,ముగిసిన తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. పీఠాధిపతులు అందరూ ఆశీర్వదించారు. శృంగేరి పీఠం వెళ్లి పుణ్యస్నానాలు చేశారు. తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు ఒకే కుటుంబం నుంచి నాడు వైఎస్, నేడు జగన్ సమర్పించారు. సీఎంకు వ్యక్తులుపై నమ్మకం కంటే ప్రజలు అంటే నమ్మకం ఎక్కువ. ప్రజలు దేవుళ్లుగా భావించే వ్యక్తి సీఎం జగన్,ప్రజలు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు.ఆనాడు ప్రజా సంకల్ప యాత్ర ముగిసిన తర్వాత కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు’ అని తెలిపారు. (డిక్లరేషన్ తీసేయాలని చెప్పలేదు: వైవీ సుబ్బారెడ్డి)
‘ప్రతిపక్ష నేత మత, కుల ఘర్షణలు సృష్టిస్తున్నారు. సీఎం జగన్ ప్రజలు అందరి మనిషి. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అన్ని అమలు చేస్తున్నారు. డిక్లరేషన్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. నాడు వైఎస్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు, గత ఏడాది సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు అందించారు.. ఈ సారి కూడా ఈ ఆనవాయితీ కొనసాగిస్తారు. 500 దేవాలయాలు నిర్మాణానికి సీఎం నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు గుళ్లను కూల్చివేశారు. దేశంలొనే అత్యధికంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఏపీ. ప్రజలు మనిషి సీఎం జగన్.. కోటీశ్వరులు మనిషి చంద్రబాబు నాయుడు’ అంటూ నారాయణ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment