సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటన విషయంలో చంద్రబాబు తన క్షుద్ర రాజకీయాన్ని ప్రదర్శించారని.. మునుపెన్నడూ లేనివిధంగా డిక్లరేషన్ అంశాన్ని తెర మీదకు తెచ్చారని వైఎస్సార్సీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకట్‌రెడ్డి అన్నారు. సాక్షి బిగ్ డిబేట్‌లో.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాప్టిజం అంశాన్ని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
పవన్ కల్యాణ్ తాను బాప్టిజం తీసుకున్నానని, తన స్నేహితుడే ఇప్పించాడని స్వయంగా చెప్పారు. మరి ఆయన ఎప్పుడు హిందువుగా మారారు?. తిరుమలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారా?. పవన్‌ను ఎందుకు డిక్లరేషన్ అడగరు. మొన్నీమధ్యే హోం మంత్రి అనిత వెళ్లారు. అప్పుడు ఆమె డిక్లరేషన్ ఇచ్చారా?. గవర్నర్ అబ్దుల్ నజీర్ వెళ్లారు.. ఆయన్ను డిక్లరేషన్‌ను అడిగారా?.
ఎవరికీ లేని డిక్లరేషన్ బోర్డులు.. వైఎస్ జగన్ విషయంలోనే ఎందుకు?. ఆయన తిరుమల వెళ్లడం కొత్త కాదు కదా. సీఎం హోదాలో తిరుమలకు వెళ్లిన వ్యక్తి ఆయన. తన మతం మానవత్వం అని క్లియర్‌గా ప్రకటించిన వ్యక్తి. కేవలం కొవ్వెక్కి చంద్రబాబు తాను మాట్లాడిన మాటల్ని పక్కదారి పట్టించేందుకే డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. పర్యటన రద్దు కాగానే ఆ బోర్డు తీసేశారు.
తిరుమలలో ల్యాబ్‌లు లేవని అంటున్నారు. కానీ, తిరుమలలో ల్యాబ్‌లు ఉన్నాయి. అలాగే లడ్డూను టెస్ట్ చేసిందని చెబుతున్న ఎన్‌డీడీబీ సుద్ధపూస సంస్థేం కాదు. రూ. 475 కోట్ల స్కామ్ జరిగిందక్కడ. తిరుమల పవిత్రతను కాపాడాలంటే.. టీటీడీ బోర్డు ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేక.. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే దుర్మార్గమైన మాటలు చంద్రబాబు మాట్లాడారు. కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని దెబ్బ తీస్తూ చంద్రబాబుకి శిక్ష పడడం ఖాయం. ఆ దేవుడు కచ్చితంగా శిక్షిస్తాడు అని వెంకట్‌రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: ఆ నెయ్యి ఎక్కడ వాడారు అనేది అప్రస్తుతం
Comments
Please login to add a commentAdd a comment