సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పోలీసుశాఖలో అవినీతి ఖాకీల జాబితా తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని అతినీతిపరులైన పోలీసులు వీరేనంటూ తాజా జాబితా విడుదల చేయడం వైరల్ అవుతోంది. పోలీసు స్టేషన్ల వారీగా అవినీతిపరులైన పోలీసుల జాబితాను రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి విడుదల చేశారు. స్టేషన్ల వారీగా 391మంది పేర్లను ఈ జాబితాలో పేర్కొన్నారు. అత్యధికంగా 40మంది అవినీతి పోలీసులతో సూర్యాపేట ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. రాచకొండలో 24మంది, వికారాబాద్‌లో 27మంది, భద్రాద్రిలో 35మంది అవినీతి ఖాకీలు ఉన్నట్టు డీజీపీ కార్యాలయం తన నివేదికలో తెలిపింది. నిజామాబాద్‌లో 29మంది, సంగారెడ్డిలో 25మంది, కరీంనగర్‌లో 34మంది అవినీతిపరులైన పోలీసులు ఉన్నారు.
అవినీతిపరుల జాబితాలో అత్యధికంగా కానిస్టేబుల్సే ఉన్నారు. ఉద్యోగం చిన్నదైనా కొందరు హోంగార్డ్స్ అవినీతిలో దూసుకుపోతున్నారు. ఇక నాలుగు జిల్లాల్లో అవినీతిపరులైన ఖాకీలే లేరని ఈ నివేదికలో పేర్కొనడం గమనార్హం. భూపాలపల్లి, జనగాం, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పోలీసుల అవినీతి సున్నా అని పోలీసు పెద్దలు తేల్చారు. కిందిస్థాయి పోలీసు ఉద్యోగులే అవినీతిపరుల జాబితాలో ఎక్కువగా ఉన్నారు. ఒక్క ఎస్సై పేరు కూడా లేకుండా ఈ జాబితాను డీజీపీ కార్యాలయం రూపొందించడం విస్మయ పరుస్తోంది. ఒక్క ఎస్సై, అంతకుపైస్థాయి అధికారి పేరు లేకుండా పోలీసు పెద్దలు జాబితా రూపొందించారు. 391మంది ఖాకీలు మామూళ్లు రాబడుతూ.. వసూళ్ల దందా చేస్తూ అవినీతికి పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశాలు జారీచేశారు.
Published Thu, Jun 7 2018 3:40 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment