
విజయవాడ : ప్రైవేట్ ఆసుపత్రుల నియంత్రణకు సంబంధించిన మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లును శాసనసభ ఆమోదించింది. దీనివల్ల చిన్న ఆసుపత్రులు మూతపడతాయని, ఈ నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఎ) వ్యతిరేకించింది. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నేడు(గురువారం) వైద్యం బంద్‌కు పిలుపినిచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రైవేట్ ఆసుపత్రుల నియంత్రణ చట్టం ఉంది. మళ్లీ కొత్తగా కేంద్రం తెచ్చిన ఈ చట్టానికి ఎందుకు ఆమోదం తెలపాలని, ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే దశలవారీగా ఆందోళనలు చేపడతామని ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయశేఖర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఓపీ సేవలు నిలిపివేత
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌కు వ్యతిరేకంగా నేడు అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ వైద్యసేవలు నిలిపివేశారు. అత్యవసర సేవలకు మాత్రమే వైద్యం అందించనున్నారు. భవిష్యత్ కార్యచరణపై ఐఎంఎ హాల్‌లో వైద్యులు సమావేశం కానున్నట్లు డా.వాడ్రేవు రవి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment