new acts
-
Satyameva Jayate: పోలీసులకు మరింత పవర్.. లాభమా..? నష్టమా..?
-
ఐపీసీ, సీఆర్పీసీ స్దానంలో కొత్త చట్టాలు.. చిల్లర నేరాలకు శిక్షగా సామాజిక సేవ
న్యూఢిల్లీ: స్వతంత్ర భారత చరిత్రలోనే చరిత్రాత్మకమని చెప్పదగ్గ ఘట్టం శుక్రవారం లోక్ సభలో ఆవిష్కృతమైంది. బ్రిటిష్ వలస పాలన తాలూకు అవశేషాలుగా కొనసాగుతూ వస్తున్న మూడు కీలక నేర న్యాయ చట్టాలకు చెల్లు చీటీ పాడే దిశగా పెద్ద ముందడుగు పడింది. వాటి స్థానంలో స్వదేశీ చట్టాలను తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ లు చరిత్రగా మిగలనున్నాయి. వాటి స్థానంలో పూర్తి భారతీయ చట్టాలు రానున్నాయి. ఈ మేరకు న్యాయ సంహిత బిల్లు– 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు–2023, భారతీయ శిక్షా బిల్లు–2023లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ‘ప్రతిపాదిత చట్టాలు దేశ నేర న్యాయ వ్యవస్థను సమూలంగా మెరుగు పరుస్తాయి. ప్రతి భారతీయుని హక్కులను పరిపూర్ణంగా పరిరక్షించాలన్న స్ఫూర్తికే పెద్ద పీట వేస్తాయి‘ అని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడంతో పాటు సమకాలీన అవసరాలు, వారి ఆకాంక్షలను తీర్చేందుకు అవసరమైన అన్ని మార్పుచేర్పులను కొత్త బిల్లుల్లో పొందుపరిచినట్టు వివరించారు. వాటిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాల్సిందిగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను మంత్రి కోరారు. మూడేళ్లలో న్యాయం ప్రతిపాదిత బిల్లులు ఆమోదం పొందితే నేర న్యాయ వ్యవస్థ సమూలంగా మెరుగు పడుతుందని అమిత్ షా అన్నారు. అంతేగాక ప్రతి పౌరునికీ గరిష్టంగా మూడేళ్లలో న్యాయం అందుతుందన్నారు. ‘కొత్త చట్టాల్లో మహిళలు, బాలలకు అత్యంత ప్రాధాన్యం దక్కనుంది. మూక దాడుల వంటి హేయమైన నేరాలకు కూడా నిర్దిష్టమైన శిక్షలను పొందుపరిచాం. తొలిసారిగా ఉగ్రవాదానికి కూడా నిర్వచించాం‘ అని ప్రకటించారు. ‘రాజద్రోహం సెక్షన్ ను పూర్తిగా ఎత్తేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ భావ వ్యక్తీకరణ హక్కు ఉంటుంది‘ అని వివరించారు. ‘ఈ బిల్లులు మన నేర న్యాయ వ్యవస్థను సమూలంగా మెరుగు పరుస్తాయని సభకు హామీ ఇస్తున్నా. వీటి లక్ష్యం శిక్ష విధింపు కాబోదు. న్యాయం అందేలా చూడటమే ప్రధానోద్దేశం. కొత్త చట్టాల్లో కేవలం నేరాలను నియంత్రించే లక్ష్యంతో మాత్రమే శిక్ష విధింపులు ఉంటాయి‘ అన్నారు. బ్రిటిష్ కాలం నాటి ప్రస్తుత చట్టాల నిండా బానిసత్వపు చిహా్నలే ఉన్నాయని విమర్శించారు. ‘అధికారంలో ఉన్నవారిని వ్యతిరేకించే ప్రతి ఒక్కరినీ ఏదోలా శిక్షించడం వాటి ఏకైక లక్ష్యము. బ్రిటిష్ అధికారాన్ని పరిరక్షించడం, బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న చట్టాలవి. శిక్షించడమే వాటి ప్రధాన లక్ష్యం తప్ప న్యాయం అందించడం కాదు‘ అని ఆరోపించారు. శిక్ష పడే రేటును కనీసం 90 శాతానికి పెంచడమే కొత్త చట్టాల లక్ష్యమన్నారు. ఇందుకోసం ఫోరెన్సిక్ సైన్స్ వాడకాన్ని మరింతగా పెంచే యోచన కూడా ఉందని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ► మూక దాడులకు, మైనర్లపై అత్యాచారానికి మరణశిక్ష. ► దేశం పట్ల నేరాలను ఇకపై అతి తీవ్రమైనవిగా పరిగణిస్తారు. ► కొన్ని రకాల చిల్లర నేరాలకు శిక్షగా సామాజిక సేవ (అమల్లోకి వస్తే ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి అవుతుంది). ► వేర్పాటువాదం, తత్సంబంధ చర్యలు, సాయుధ తిరుగుబాటు, భారత సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను ప్రమాదంలో పడవేయడం వంటి కొత్త నేరాలను పొందుపరిచారు. ► పలు నేరాలకు ఇకపై లింగ భేదం ఉండబోదు. ► పెళ్లి, ఉద్యోగం, ప్రమోషన్ల వంటి ప్రలోభాలు చూపి, గుర్తింపును దాచి మహిళలను లైంగికంగా దోచుకోవడం నేరంగా పరిగణనలోకి వస్తుంది. ► గ్యాంగ్ రేప్ కు 20 ఏళ్లు, లేదా జీవిత ఖైదు. ► తీవ్రతను బట్టి మూక దాడులకు ఏడేళ్లు, జీవిత ఖైదు, లేదా మరణ శిక్ష. ► తొలిసారిగా ఉగ్రవాదానికి నిర్వచనం. ► ఉగ్రవాదుల ఆస్తుల జప్తు రాజకీయ రెమిషన్లకు చెక్... శిక్ష తగ్గింపు (రెమిషన్) వంటి సదుపాయాలను రాజకీయ లబి్ధకి వాడుకోవడాన్ని నిరోధించేందుకు ప్రతిపాదిత బిలుల్లో కొత్త సెక్షన్లు పొందుపరిచారు. వాటి ప్రకారం... ► ఇకపై మరణశిక్షను కేవలం జీవిత ఖైదుగా మాత్రమే మార్చేందుకు వీలవుతుంది. ► జీవిత ఖైదును ఏడేళ్ల శిక్షగా మాత్రమే మార్చవచ్చు. ► బిహార్ కు చెందిన నేరమయ నేత ఆనంద్ మోహన్ కు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడానికి అమిత్ షా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే రాజకీయ అండదండలున్న వారు చట్టం బారి నుంచి తప్పించుకోకుండా చూసేందుకే ఈ సెక్షన్లను చేర్చినట్లు వివరించారు. కొత్త నేర–న్యాయ ప్రక్రియ ఇదీ ► 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. ► పరిస్థితిని సమీక్షించాక కోర్టు మరో 90 రోజుల సమయం ఇవ్వొచ్చు. ► దర్యాప్తును 180 రోజుల్లోపు పూర్తి చేసి విచారణకు పంపాలి. ► విచారణ ముగిశాక 30 రోజుల్లోపు తీర్పు వెలువడాలి. న్యాయ సంహిత బిల్లు ప్రకారం ఉగ్రవాది అంటే... ► దేశంలో గానీ, విదేశాల్లో గానీ భారత దేశ ఐక్యతను, సమగ్రతను, భద్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు పాల్పడేవాడు. ► తద్వారా జన సామాన్యాన్ని, లేదా ఒక వర్గాన్ని భయభీతులను చేసేవాడు, శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించేవాడు. రాజద్రోహం ఇక దేశద్రోహం బ్రిటిష్ కాలం నాటి వివాదాస్పద రాజద్రోహ చట్టాన్ని తొలగించనున్నట్టు కేంద్రం ప్రతిపాదించింది. అదే సమయంలో దేశద్రోహం పేరిట దానికి కొత్త రూపు ఇవ్వనుంది. బ్రిటిష్ సింహాసనాన్ని గుర్తు చేసే వలస వాసనలు వదిలించుకోవడమే పేరు మార్పు ఉద్దేశమని పేర్కొంది. బీఎన్ఎస్ బిల్లులో ప్రతిపాదించిన ఈ కొత్త చట్టాన్ని మరిన్ని కొత్త సెక్షన్లతో మరింత బలోపేతం కూడా చేయనుంది. దాని ప్రకారం... ఉద్దేశపూర్వకంగా నోటిమాట ద్వారా, రాతపూర్వకంగా, సైగలు, చిహ్నాల ద్వారా, అందరికీ బయటికి కనిపించేలా, ఎలక్ట్రానిక్ కమ్యూనికషన్స్ ద్వారా, ఆర్థిక సాధనాల ద్వారా, ఇతరత్రా, రెచ్చగొట్టే చర్యల ద్వారా, వేర్పాటువాదం ద్వారా, సాయుధ తిరుగుబాటు ద్వారా, అలాంటి ధోరణులను ప్రోత్సహించినా, దేశ సార్వ¿ౌమత్వాన్ని, సమైక్యతను, సమగ్రతను ప్రమాదంలో పడేసినా, అలాంటి మరే ఇతర చర్యలకు పాల్పడినా అది దేశ ద్రోహమే. ► దేశానికి వ్యతిరేకంగా చేసే ఎలాంటి పనినైనా దేశ ద్రోహంగానే పరిగణిస్తారు. ► శాంతి సమయంలో ప్రభుత్వంపై యుద్ధం చేసినా, అందుకు ప్రయతి్నంచినా, అందుకోసం విదేశీ ప్రభుత్వాలతో చేతులు కలిపినా, అలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించినా అందుకోసం మూకలను, ఆయుధాలను సమీకరించినా, అందుకు ప్రయతి్నంచినా, అలాంటి ప్రయత్నాలు గురించి తెలిసీ చెప్పకపోయినా, వాటిని దాచినా, అది దేశ ద్రోహమే. ► నేర తీవ్రతను బట్టి అందుకు జీవిత ఖైదు, పదేళ్లకు మించని, లేదా ఏడేళ్ల ఖైదు, వాటితో పాటు జరిమానా కూడా పడవచ్చు. ‘నేర న్యాయ చట్టాలను సమూలంగా మదింపు చేయాల్సిన, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని 70 ఏళ్ల ప్రజాస్వామ్య భారత అనుభవం చెబుతోంది. సబ్ కా సాత్ (అందరికీ తోడు), సాబ్ కా వికాస్ (అందరి అభివృద్ధి), సాబ్ కా విశ్వాస్ (అందరి నమ్మకం), సాబ్ కా ప్రయాస్ (అందరి ప్రయత్నం) అన్నదే కేంద్ర ప్రభుత్వ మంత్రం‘ – బీఎన్ఎస్ఎస్ బిల్లు లక్ష్య ప్రకటన -
వారానికి 4 రోజులే పని, కొత్త లేబర్ చట్టం అమల్లోకి వచ్చేది ఎప్పుడంటే!
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 4 కార్మిక చట్టాలు జులై1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇంత వరకు అమలు జరగలేదు. ఒక వేళ అమలైతే ఉద్యోగుల వేతనం, పీఎఫ్ వాటా, పని సమయం, వీక్లీ ఆఫ్‌లు వంటి అంశాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాలను పార్లమెంటు ద్వారా ఆమోదించినప్పటికీ, అనేక రాష్ట్రాలు ఇంకా కొత్త కోడ్లను ఆమోదించలేదు. రాజ్యాంగం పరిధిలో కార్మిక అంశం ఉన్నందున అమలులో జాప్యం జరిగింది. రాష్ట్రాలు వాటిని ఆమోదించిన తర్వాతే ఈ కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. కేంద్ర కార్మిక శాఖ సమాచారం ప్రకారం..ఇప్పటి వరకు 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతనాల కోడ్- 2019 కింద ముసాయిదా నిబంధనల్ని ప్రచురించాయి. త్వరలో అమలులోకి రానున్న కొత్త లేబర్ కోడ్ ఉద్యోగుల పని గంటలు, టేక్ హోం శాలరీ, సెలవులపై ప్రభావం చూపనుంది. ఉద్యోగి చివరి వర్కింగ్ డేస్ వరకు చెల్లించాల్సిన వేతనాలు రెండు రోజుల లోపే పూర్తి చేయాలని వేతన కోడ్ నిర్దేశిస్తుంది. అదే విధంగా సంస్థలు ఉద్యోగుల పని గంటల్ని పెంచుకోవచ్చు. అలాంటి సందర్భాలలో ఉద్యోగులకు అదనపు సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. ♦ కొత్త వేతన నియమావళి ప్రకారం బేసిక్ శాలరీ కనీసం 50 శాతం ఉండాలని నిర్దేశించడంతో ఉద్యోగులు తీసుకునే టేక్ హోం శాలరీపై ప్రభావం పడనుంది. ♦ ఉద్యోగి, సంస్థల సహకారంతో ఎక్కువ మొత్తం పీఎఫ్‌లో జత కానుంది. ♦ 2019లో పార్లమెంట్ ఆమోదించిన ఈ లేబర్ కోడ్ 29 కేంద్ర కార్మిక చట్టాలను భర్తీ చేస్తుంది. ♦ వేతనం, సామాజిక భద్రత, కార్మిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులపై నాలుగు కొత్త కోడ్లు జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా.. జాప్యం జరగడంతో త్వరలోనే అమలు జరగనున్నాయి. ఉద్యోగులపై ప్రభావం రాజీనామా, ఉద్యోగం నుండి తొలగించిన తర్వాత ఉద్యోగి చివరి పనిదినం వరకు చెల్లించిన బకాయిల్ని రెండు రోజులలోపు పూర్తి చేయాలని కొత్త చట్టం ఆదేశిస్తుంది. ప్రస్తుతం, కంపెనీలు సెటిల్మెంట్కు 45 రోజుల నుండి 60 రోజుల గడువు విధిస్తున్న విషయం తెలిసిందే. పెరగనున్న పని గంటలు కొత్త కార్మిక చట్టంలో సంస్థలు ఉద్యోగుల పని గంటల్ని 9 గంటల నుండి 12 గంటలకు పెంచేందుకు అనుమతిస్తుంది. పనిగంటలు పెరిగితే కొత్త లేబర్ చట్టాల ప్రకారం.. ఉద్యోగులు ప్రస్తుతం వారానికి 5 రోజులు మాత్రమే పనిచేస్తుండగా..కొత్త పనివేళలతో వారంలో నాలుగు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగులకు వారానికి 3 రోజుల హాలిడేస్ కావాలి అనుకుంటే ప్రతి వారం 48 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. వారంలో 48 పని గంటలు దాటితే సదురు ఉద్యోగికి..సంస్థలు అదనంగా ఓవర్ టైం చెల్లించాల్సి ఉంటుంది. -
ఆ చట్టాలు రద్దు చేయాల్సిందే : ఆర్.నారాయణమూర్తి
సాక్షి, కవాడిగూడ (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు శాపాలుగా మారాయని, తక్షణమే వాటిని రద్దు చేయాల్సిందేనని నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి డిమాండ్ చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఏఐకేఎస్‌సీసీ, ఎస్‌ఎఎంల పిలుపుమేరకు శనివారం నిర్వహించిన ఛలో రాజ్‌భవన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకుముందు ఇందిరాపార్కు నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయల్దేరిన రైతు సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతు సంఘాలనేతలు, పోలీసులకు మధ్య వాగ్వివాదం తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాజ్‌భవన్ వైపునకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టుచేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో సీపీఐ నాయకులు ఆజీజ్‌పాషా, సీపీఎం నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి, రైతు సంఘం నాయకులు పశ్యపద్మ, పీవోడబ్ల్యూ సంధ్య, ఝాన్సీ, సీఐటీయూ రమ, వివిధ సంఘాల నేతలు ఎస్ ఎల్ పద్మ, అనురాధ ఉన్నారు. -
నేడు ప్రైవేట్ వైద్యం బంద్!
విజయవాడ : ప్రైవేట్ ఆసుపత్రుల నియంత్రణకు సంబంధించిన మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లును శాసనసభ ఆమోదించింది. దీనివల్ల చిన్న ఆసుపత్రులు మూతపడతాయని, ఈ నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఎ) వ్యతిరేకించింది. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నేడు(గురువారం) వైద్యం బంద్‌కు పిలుపినిచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రైవేట్ ఆసుపత్రుల నియంత్రణ చట్టం ఉంది. మళ్లీ కొత్తగా కేంద్రం తెచ్చిన ఈ చట్టానికి ఎందుకు ఆమోదం తెలపాలని, ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే దశలవారీగా ఆందోళనలు చేపడతామని ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయశేఖర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓపీ సేవలు నిలిపివేత క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌కు వ్యతిరేకంగా నేడు అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ వైద్యసేవలు నిలిపివేశారు. అత్యవసర సేవలకు మాత్రమే వైద్యం అందించనున్నారు. భవిష్యత్ కార్యచరణపై ఐఎంఎ హాల్లో వైద్యులు సమావేశం కానున్నట్లు డా.వాడ్రేవు రవి తెలిపారు. -
మహిళల రక్షణకు కొత్త చట్టాలు
మహిళారక్షణ చట్టం కమిటీ కన్వీనర్ పూనం మాలకొండయ్య సాక్షి, హైదరాబాద్: మహిళలకు పూర్తి రక్షణను కల్పించేలా, శిక్షలు కఠినంగా ఉండేలా కొత్త చట్టాలను రూపొందిస్తామని మహిళా రక్షణ చట్టం కమిటీ కన్వీనర్, ఐఏఎస్ పూనం మాలకొండయ్య వెల్లడించారు. మహిళల రక్షణ కోసం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం బుధవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కన్వీనర్ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ మహిళా రక్షణ చట్టాలు ఎలా ఉన్నాయనే అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించిందన్నారు. ఈ నెల 10న మరోసారి సమావేశమై ఆయా అంశాలపై చర్చిస్తామన్నారు. చట్టాల్లోని ఒక్కో అంశం పరిశీలనకు ఒక్కో అధికారికి బాధ్యతలు అప్పగించామని, వారి అధ్యాయనం తర్వాత నివేదిక అందిస్తామన్నారు. అత్యాచారాల నిరోధానికి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలు ఉండేలా చూస్తామన్నారు. ఆయా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని, స్వచ్ఛంద సంస్థలను సైతం కలుస్తామన్నారు. పని చేసే చోట కూడా మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, సాఫ్ట్వేర్ సంస ్థల్లో వివక్ష ఉందన్నారు. బాలికల, మహిళా చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని, ఉన్న చట్టాలు సరిగా పని చేయడం లేదని తమ కమిటీ అభిప్రాయపడిందని చెప్పారు. మహిళా చట్టాలపై ప్రజల అవగాహనకు కౌన్సెలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా రక్షణకు సంబంధించి ఎన్జీవో సంస్థలు, మరెవరైనా తమ కు సలహాలు, సూచనలు చేయవచ్చని.. ఇందుకోసం డబ్ల్యూసీడీఎస్సీటీజీ2014 ఎట్‌ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కాంకు మెయిల్ చేయవచ్చ ని తెలిపారు. సమావేశానికి కమిటీ సభ్యులు సునీల్‌శర్మ, శైలజా రామయ్యార్, సౌమ్యమిశ్రా, చారుసిన్హా, స్వాతిలాక్రా హాజరయ్యారు. -----------