
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ భూ సేకరణ చట్టం సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. స్వచ్ఛంద సేకరణ పేరుతో భూ సేకరణ ఏపీ అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బిల్లును నిన్న (బుధవారం) శాసనసభలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సేకరణ చట్టం-2013కు సవరణ చేస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలు, అవసరాలకు అనుగుణంగా కొత్తగా కొన్ని క్లాజులు చేరుస్తూ.. మూడు ముఖ్యమైన క్లాజులకు ఇందులో మినహాయింపు ఇచ్చింది.
కాగా రైతులకు పునరావాసంతో సంబంధం లేకుండా పరిహారం చెల్లింపుతోనే సరిపెట్టాలని ఏపీ సర్కార్ ఈ సవరణ బిల్లు ద్వారా నిర్ణయం తీసుకుంది. రైతుల భూములు తీసుకున్నాక రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదని ప్రతిపాదించింది. సంప్రదింపుల ద్వారానే పరిహారం నిర్ణయించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు కట్టబెట్టింది. గ్రామసభలు, సామాజిక ప్రభావం సర్వేలతో సంబంధం లేకుండా ఈ చట్టాన్ని సవరించడం జరిగింది. ఈ చట్టం 2014 జనవరి 1 నుంచే అమలు అవుతున్నట్లు పేర్కొంది. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment