పరీక్ష కంటే ఐదు నిమిషాల ముందే పేపర్ లీక్ | question paper leaked 5 minutes before examination, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

పరీక్ష కంటే ఐదు నిమిషాల ముందే పేపర్ లీక్

Published Thu, Mar 30 2017 1:39 PM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM

పరీక్ష కంటే ఐదు నిమిషాల ముందే పేపర్ లీక్ - Sakshi

పరీక్ష కంటే ఐదు నిమిషాల ముందే పేపర్ లీక్

పదో తరగతి పరీక్ష ప్రారంభం కావడానికి 5 నిమిషాల ముందే ప్రశ్నపత్రం వాట్సప్‌ ద్వారా బయటకు వచ్చిందని, అయినా సంబంధిత మంత్రుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని, ఆ స్కూలును ఎందుకు బ్లాక్ లిస్టులో చేర్చలేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. సాక్షి ప్రతినిధి బాధ్యతాయుతమైన పౌరుడిగా తనకు వచ్చిన పేపర్‌ను నేరుగా డీఈవోకు పంపారని, విజిల్ బ్లోయర్‌గా వ్యవహరించిన అతడిని ప్రశంసించాల్సింది పోయి అతడి మీద చర్యలు తీసుకోవాలన్నట్లుగా మాట్లాడటం ఏంటని మండిపడ్డారు. నెల్లూరులోని నారాయణ హైస్కూల్లో పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజి వ్యవహారంపై అసెంబ్లీలో జరిగిన వాడివేడి చర్చలో ఆయన పాల్గొని ప్రభుత్వం తీరును కడిగి పారేశారు. ఆయన ప్రసంగానికి మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు పదే పదే అడ్డు తగులుతూ తాము అంతకుముందు చెప్పిన విషయాలనే పదే పదే చెబుతూ వచ్చారు. వైఎస్ జగన్ ప్రసంగం పూర్తి కాకముందే ముఖ్యమంత్రి కూడా దానిపై మాట్లాడటం గమనార్హం. ఈ సందర్భంగా జరిగిన చర్చలో వైఎస్ జగన్ ఏమన్నారంటే...

ముఖ్యమంత్రి ప్రకటన అయితేనేం, మంత్రి ప్రకటన అయితేనేం వీళ్ల మాటలు ఏవి చూసినా అవాస్తవాలే.
ఉదయం 9.30కి పరీక్ష మొదలైంది. 9.25 నిమిషాలకే నారాయణ స్కూలుకు సంబంధించిన ఒక ఉద్యోగి ఆ పేపర్‌ను వాట్సప్‌లో ఫొటోలు తీసి బయటకు పంపారు.
పరీక్ష కేంద్రంలో పనిచేస్తున్నవాళ్లు ఎవరికైనా సెల్ ఫోన్లు అనుమతించరు
అయినా కూడా పరీక్ష ప్రారంభానికి ఐదు నిమిషాల ముందే అదే నారాయణ స్కూలు ఉద్యోగి పేపర్‌ను బయటకు పంపారు.
నారాయణ ఉద్యోగులు వాటికి ఆన్సర్లు తయారు చేసుకుని, తమ విద్యార్థులకు జవాబులు చేర వేసి పరీక్షలు రాయిస్తుంటే దానివల్ల నారాయణ స్కూళ్లకు ర్యాంకులు వస్తుంటే, ఇది మీకు అన్యాయంగా, మోసంగా కనిపించడం లేదా
మరొక్క విషయం.. వీళ్లు చెబుతున్నట్లు బయటకు వచ్చాయని చెబుతున్న వాటిని వీళ్లు అసలు ఒప్పుకోలేదు
అసెంబ్లీలో మేం ప్రస్తావించి, విషయాన్ని పెద్దది చేసి, రిపోర్టు చూపించిన తర్వాత మాత్రమే వాళ్లు ఒప్పుకొన్నారు
(మధ్యలోనే గంటా శ్రీనివాసరావు కలగజేసుకుని, జగన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అంతకుముందు చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ ఆయన ప్రస్తావించారు)
డైలీ స్టేటస్ రిపోర్టులో పరీక్షల డైరెక్టర్ స్పష్టంగా రాశారు.
వాట్సప్‌లో పేపర్ బయటకు వచ్చిందని ఆయన పేర్కొన్నప్పుడు పరీక్షను ఎందుకు రద్దు చేయలేదు?
మెసేజ్ పంపించిన వ్యక్తి నారాయణ యాజమాన్యానికి సంబంధించిన వాడు
పరీక్ష మొదలుకావడానికి ముందుగానే దాన్ని ఫొటో తీసి వాట్సప్‌లో పంపుతుంటే, నారాయణ స్కూలు యాజమాన్యాన్ని ఎందుకు బ్లాక్ లిస్టు చేయలేదు, ఆ కేంద్రాన్ని ఎందుకు రద్దు చేయలేదని అడుగుతున్నాం
నిజంగా ఆశ్చర్యంగా ఉంది.. డీఈఓ 26న ఫిర్యాదుచేస్తే, 28న ఎఫ్ఐఆర్ దాఖలైంది
సాక్షాత్తు నారాయణ యాజమాన్యం మన మంత్రి గారిది, ఆయన వియ్యంకుడు విద్యాశాఖ మంత్రి.. అవునా, కాదా?
9.30కు పరీక్ష మొదలవుతుంటే, 9.25 గంటలకు పంపింది ఎవరు.. నారాయణ స్కూలు ఉద్యోగి అవునా, కాదా
ఆయన ఫోన్ నెంబరు ద్వారా ఎవరెవరికి పంపారన్న విషయమై సీబీఐ విచారణ జరిపితే అన్ని విషయాలూ బయటకు వస్తాయి
నారాయణ సిబ్బంది ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎలా తయారుచేసి అందరికీ పంపారో తెలుస్తుంది
ఈ విషయం పెద్దదైన తర్వాత, అసెంబ్లీలో నివేదికను చూపించిన తర్వాత అప్పుడు జరిగిన విషయాన్ని అంగీకరించారు
9.25 గంటలకు పేపర్ బయటకు వెళ్తే, 10.30 గంటలకు సాక్షి రిపోర్టర్ డీఈవోకు వాట్సప్‌లో పంపారని ఇదే ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు
సాక్షి రిపోర్టర్ విజిల్ బ్లోయర్‌గా డీఈఓకు సమాచారం ఇచ్చి, చర్యలు తీసుకోవాలని చెప్పినందుకు అతడే తప్పు చేసినట్లు అభాండాలు వేస్తున్నారు
అతడి మీద చర్యలు తీసుకోవాలంటున్నారు
అటెండర్లు, చిన్న చిన్న ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవడం ఏంటి.. మంత్రులను ఎందుకు కొనసాగిస్తున్నారు?
మీకు ప్రయోజనాలు ఏమీ లేకపోతే వాళ్లను మంత్రి పదవుల్లో ఎందుకు కొనసాగిస్తున్నారు?
ఇది జరిగింది కేవలం నెల్లూరు ఒక్కచోట మాత్రమే కాదు..
తొలి రోజు కూడా తెలుగు పేపర్ 1 ప్రశ్నపత్రం అనంతపురం జిల్లా మడకశిరలో వాట్సప్‌ ద్వారా బయటకు వచ్చింది
హిందూపురం నారాయణ పాఠశాల ఉద్యోగి ముత్యాలును పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత వదిలిపెట్టేశారు
కష్టపడి చదివేవాళ్లు ర్యాంకులు రావాలని ఆరాటపడతారు. కానీ నారాయణ స్కూళ్లకు లక్షలు లక్షలు ఫీజులు కడితేనే ర్యాంకులు వస్తాయని దగ్గరుండి ప్రభుత్వమే సపోర్ట్ చేస్తోంది
లీకైందని ప్రభుత్వం ఒప్పుకొన్నప్పుడు చర్యలు తీసుకోవాల్సింది ఎవరిమీద?
అటెండర్లు, చిన్న వాళ్ల మీద కాదు.. మంత్రుల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు
(ఈ సమయంలో మంత్రి గంటా జోక్యం చేసుకుని, పేపర్ లీక్ కాలేదని చెప్పారు)
గతంలో ఇలాంటి ఘటన చూస్తే ముద్దు కృష్ణమనాయుడు రాజీనామా చేశారు. వేరే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేశారు
ఇప్పుడు వాట్సప్ ద్వారా ఏకంగా పరీక్షకు ముందు ఫొటో తీసి వాళ్ల వాళ్ల సిబ్బందికి పంపి, వాట్సప్ ద్వారా రొటేట్ చేసుకుని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాళ్ల పిల్లలకు మాత్రమే పంపుతున్నారు
ఇంత పెద్ద స్కాం జరుగుతుంటే సీబీఐ చేత విచారణ చేయించకపోవడం, దాన్ని డిఫెండ్ చేసుకుంటూ చిన్న ఘటన అన్నట్లుగా కొట్టేస్తున్న పరిస్థితి చూస్తే ఆశ్చర్యంగా ఉంది
ఈ మొత్తం వ్యవహారంలో అడ్డగోలుగా దొరికిపోయినా ఏదేదో చెప్పి తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నారు
మంత్రులను కాపాడుకోడానికి చంద్రబాబు నోట్లోంచి కూడా కొన్ని తప్పులు చెబుతున్నారు
చంద్రబాబు అని ఓ సెల్ ఫోన్ నెంబరు చెప్పారు
వాటర్ బోయ్ ఫోను నెంబరు చెప్పరు, సాక్షి రిపోర్టర్ 10.30కి డీఈఓకు చెబితే ఆ నెంబరు మాత్రమే చెబుతారు
చంద్రబాబు ధనలక్ష్మీపురం నారాయణ హైస్కూలు అని ఒకచోట అంటారు, మరోచోట ఆ స్కూలు నారాయణదే కాదంటారు
ఆ స్కూల్లో నారాయణకు చెందిన ప్యూన్లు, గీన్లు ఉండొచ్చని కూడా ఆయన అన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement