
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసెంబ్లీ నిర్మాణంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘గొప్పగా కనిపించేలా శాసనసభ భవనం నిర్మించడానికి కోట్లాది రూపాయలు వృధా చేసే బదులు అసెంబ్లీ సమావేశాలను గ్రీన్ మ్యాట్ స్క్రీన్‌లో నిర్వహించి ఏవిధంగా టెలికాస్ట్ చేయాలో రాజమౌళిని అడిగితే సరిపోతుంది. ప్రపంచంలోని అన్ని అసెంబ్లీ భవనాలను తలదన్ని ఇది బాహుబలి అసెంబ్లీగా నిలుస్తుంద’ని వర్మ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. అసెంబ్లీ భవన నిర్మాణానికి ఇప్పటికే పలు దేశాల నమూనాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అవేమి ఆయనకు నచ్చకపోవడంతో దర్శకుడు రాజమౌళిని స్వయంగా తన దగ్గరకు రప్పించుకుని సలహా అడిగారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ సెటైర్లు సంధించారు.
ఫిబ్రవరి నుంచి షూటింగ్
‘లక్ష్మీస్ ఎన్‌టీఆర్’ షూటింగ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించి అక్టోబర్‌లో విడుదల చేస్తానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెలిపారు. సోమవారం సాయంత్రం బెంగళూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ జీవితం మహాభారతం వంటిదని అభిప్రాయపడ్డారు. అందులో ఒక అధ్యాయాన్ని మాత్రమే తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment