లోకేశ్.. మళ్లీ వేసేశారు!
మొన్నామధ్య బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ.. అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు అన్నారు. తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో మాట్లాడుతూ తాగునీటి సమస్య ఏర్పాటే తన లక్ష్యమని చెప్పారు. ఇప్పుడు ఆ రెండింటినీ మించిపోయేలా మరో గొప్ప మాట చెప్పారు ఏపీ ఐటీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా మరోసారి ఆయన నోరు జారారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మొత్తం 200 స్థానాల్లో గెలిపించాలని కార్యకర్తలను ఆయన కోరారు.
అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న మొత్తం స్థానాలు కేవలం 175 మాత్రమే. అలాంటప్పుడు నూటికి 110 మార్కులు తెచ్చుకోవాలని అన్నట్లుగా లేని సీట్లు ఎక్కడి నుంచి గెలిపించుకురావాలో అర్థం కాక కార్యకర్తలు జుట్టు పీక్కున్నారు. అసలు రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో కూడా తెలియకుండా ఆయన ఎలా చెప్పేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకున్నారు. అయినా.. నేరుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవకుండా.. దొడ్డి దారిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి సంపాదించి మంత్రి అయిన ఆయనకు.. అసెంబ్లీ గురించి ఎలా తెలుస్తుందిలే అన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి.
లోకేశ్ ఇంకా ఏమన్నారో చూడండి..
నారా లోకేశ్ ప్రమాణం చూశారా?
తాగునీటి సమస్య ఏర్పాటే నా లక్ష్యం: లోకేశ్
అంబేడ్కర్ జయంతిని వర్ధంతిగా మార్చిన లోకేశ్