lokesh bloopers
-
లోకేశ్.. మళ్లీ వేసేశారు!
-
లోకేశ్.. మళ్లీ వేసేశారు!
మొన్నామధ్య బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ.. అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు అన్నారు. తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో మాట్లాడుతూ తాగునీటి సమస్య ఏర్పాటే తన లక్ష్యమని చెప్పారు. ఇప్పుడు ఆ రెండింటినీ మించిపోయేలా మరో గొప్ప మాట చెప్పారు ఏపీ ఐటీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా మరోసారి ఆయన నోరు జారారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మొత్తం 200 స్థానాల్లో గెలిపించాలని కార్యకర్తలను ఆయన కోరారు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న మొత్తం స్థానాలు కేవలం 175 మాత్రమే. అలాంటప్పుడు నూటికి 110 మార్కులు తెచ్చుకోవాలని అన్నట్లుగా లేని సీట్లు ఎక్కడి నుంచి గెలిపించుకురావాలో అర్థం కాక కార్యకర్తలు జుట్టు పీక్కున్నారు. అసలు రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో కూడా తెలియకుండా ఆయన ఎలా చెప్పేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకున్నారు. అయినా.. నేరుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవకుండా.. దొడ్డి దారిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి సంపాదించి మంత్రి అయిన ఆయనకు.. అసెంబ్లీ గురించి ఎలా తెలుస్తుందిలే అన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి. లోకేశ్ ఇంకా ఏమన్నారో చూడండి.. నారా లోకేశ్ ప్రమాణం చూశారా? తాగునీటి సమస్య ఏర్పాటే నా లక్ష్యం: లోకేశ్ అంబేడ్కర్ జయంతిని వర్ధంతిగా మార్చిన లోకేశ్ -
తాగునీటి సమస్య ఏర్పాటే నా లక్ష్యం: లోకేష్
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు మరోసారి నోరు జారారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిగా తూర్పుగోదావరి జిల్లాలో చేసిన తొలి పర్యటనలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. గతంలో అంబేద్కర్ జయంతిని వర్థంతి అంటూ వ్యాఖ్యానించి వివాదంలో ఇరుక్కున్న లోకేష్ తీరు మారలేదని మరోసారి రుజువయింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కరపలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ లోకేష్ అన్న మాటలు విని సామాన్య జనం అవాక్కయ్యారు. అంతకుముందు జి.మేడపాడు సభలో కాబోయే సీఎం నారా లోకేష్ అంటూ ఉప ముఖ్యమత్రి పేర్కొనగా ఆ వెంటనే మరోసభలో లోకేష్ తాగునీటి సమస్య సృష్టించడమే తన లక్ష్యమంటూ పేర్కొనడం ఆసక్తిగా మారింది. తాగునీటి సమస్య పరిష్కరిస్తానని చెప్పడానికి బదులు స్వయంగా మంత్రిగారు ఇలా చెప్పడంతో కరప వాసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇప్పటికే లోకేష్ తీరుతో పెద్ద దుమారం రేగుతోంది. అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగుతోంది. దానికి తోడు ఇప్పుడు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రమంతా తాగునీటి సమస్య ఉంది. లోకేష్ మామ బాలకృష్ణ సొంత నియోజకవర్గం హిందూపురంలో తాగునీటిని బిందెల చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆందోళనకు దిగారు. ఇక ఇప్పుడు ఏకంగా గోదావరి జిల్లాకు వెళ్లి అక్కడ కూడా తాగునీటి సమస్య ఏర్పాటు చేస్తాననడం మరోసారి సంచలనంగా మారింది.