సాక్షి, అమరావతి: విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీ అసెంబ్లీలో బుధవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ ఏపీలో 2016లో 136 మంది, 2017లో 112మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. మార్కులు తక్కువ వచ్చాయనే కారణంతో 2017లో 44 మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై మీడియాలో ఎక్కువ చూపుతున్నారని, దీంతో మిగిలిన విద్యార్థులు కూడా దీనికి ప్రభావితమవుతున్నారని అన్నారు. విదేశాల్లో ఇలాంటి ఆత్మహత్యలను చూపించకూడదన్న నిబంధన ఉందని తెలిపారు.
రాష్ట్రంలో నారాయణ, శ్రీచైతన్య కళాశాలల్లో ఎక్కువమంది విద్యార్దులు చనిపోతున్నారని ప్రచారం చేస్తున్నారని, అది నిజం కాదని, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 110మంది విద్యార్థులు చనిపోతే అందులో 15మంది మాత్రమే నారాయణ కాలేజీలో చనిపోయారని అన్నారు. కేవలం మంత్రిగా ఉన్నారనే కారణంతో నారాయణ సంస్థను తప్పుపట్టడం సరికాదన్నారు. అయితే, విద్యా సంస్థలు కూడా నిబంధనలు పాటించడం లేదని ఆమె తెలిపారు. విద్యార్థులకు ఆదివారం కూడా సెలవు ఇవ్వడం లేదు.. పండగలు, హాలిడేలు లేవు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కూడా సెలవు ఇవ్వని విధానం మారాలని, తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా మారాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment