సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ ముఖ్యులతో చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో తొలుత స్ట్రాటజీ కమిటీ భేటీ అనంతరం టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశాలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి యనమలతోపాటు మరికొంతమంది ముఖ్యనేతలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలను వైఎస్‌ఆర్ సీపీ బహిష్కరించిన నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించారు.
ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్‌పై ఏ విధంగా ఎదురుదాడికి దిగాలో సమావేశంలో తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. ఫిరాయింపు ఎమ్మెల్యేలతోపాటు సొంతపార్టీ నేతలతో జగన్‌పై ఎదురుదాడి చేయించేలా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగానే ఉన్నారని సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు. ఉద్దేశపూర్వకంగానే ఈ సారి సమావేశాలను వైఎస్‌ఆర్ సీపీ బహిష్కరించిందని...ఆ నెపాన్ని స్పీకర్‌పై నెట్టేయాలని ప్రతిపక్షపార్టీ చూస్తున్నట్లు పార్టీ ముఖ్యులతో చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment