
చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా రాదు
తాను రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యానని, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు 5.45 లక్షల మెజారిటీ వచ్చిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా అంత మెజారిటీ రాదన్నారు.
తాను రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యానని, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు 5.45 లక్షల మెజారిటీ వచ్చిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా అంత మెజారిటీ రాదన్నారు. మీ జీవితంలో ఎప్పుడూ అంత మెజారిటీ చూడలేదని మంత్రి అచ్చెన్నాయుడుకు చెప్పారు. తన చదువు గురించి అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు నిరూపించలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని వైఎస్ జగన్ సవాలు చేశారు. ఇది తనకు, చంద్రబాబుకు సవాలని గట్టిగా చెప్పారు. తాను ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే మంత్రి మాత్రం తన విద్యార్హతల గురించి సంబంధం లేని విషయాలు మాట్లాడారన్నారు.
తనతో పాటు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ఓ వ్యక్తి మాట్లాడారని అంటూ లేనిపోని ఆరోపణలు చేసిన అచ్చెన్నాయుడికి వైఎస్ జగన్ దీటుగా సమాధానం ఇచ్చారు. అలాగే తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినందున తన స్థాయి ఎక్కువంటూ అచ్చెన్నాయుడు చెప్పిన అంశాలకు కూడా గట్టిగా జవాబు చెప్పారు. చట్టసభలు తనకు కొత్త కాదని, సభా సంప్రదాయాలు తనకు బాగా తెలుసని స్పష్టం చేశారు. తన స్థాయి అదని... మీ స్థాయి ఇదని గట్టి సమాధానం ఇచ్చారు.