majority issue
-
మెజారిటీ నిరూపించుకోమనండి.. మహారాష్ట్ర సంక్షోభంలో కీలక మలుపు
ముంబై/న్యూఢిల్లీ/గువాహటి: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మంగళవారం కీలక మలుపు తిరిగింది. వారానికి పైగా వేచిచూసే ధోరణి అవలంబించిన బీజేపీ నేరుగా రంగంలోకి దిగింది. విపక్ష నేత, బీజేపీకి చెందిన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం రాత్రి గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీని కలిశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘శివసేనపై 39 మంది ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే సారథ్యంలో తిరుగుబాటు చేసి మద్దతు ఉపసంహరించిన నేపథ్యంలో పాలక మహా వికాస్ అఘాడీ కూటమి మైనారిటీలో పడింది. అందుకే అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించాల్సిందిగా కోరుతూ గవర్నర్‌కు లేఖ సమర్పించాం’’ అని వివరించారు. అంతకుముందు మంగళవారం రోజంతా బీజేపీ శిబిరంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫడ్నవీస్ ఉదయమే ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన రాజకీయ వ్యూహంపైనే వారు చర్చించినట్టు చెబుతున్నారు. రాత్రికి ముంబై తిరిగి రాగానే పదింటికి ఫడ్నవీస్ నేరుగా వెళ్లి గవర్నర్‌ను కలిశారు. మరోవైపు షిండే శిబిరంలో చేరిన 8 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉద్ధవ్‌ను మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించాలని గవర్నర్‌ను ఈ మెయిల్ ద్వారా కోరినట్టు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేలందరితో కలిసి త్వరలో ముంబై రానున్నట్టు శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ప్రకటించారు. వస్తే అన్ని విషయాలూ చర్చించుకుందామంటూ పార్టీ చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా రెబల్స్‌కు విజ్ఞప్తి చేశారు. ‘‘రెబల్స్‌కు ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. తిరిగొచ్చి నాతో మాట్లాడితే సమస్య పరిష్కారానికి దారి దొరుకుతుంది’’ అంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారం క్రమంగా క్రైమాక్స్‌కు చేరుతున్నట్టు కన్పిస్తోంది. షిండే వర్గం ఎమ్మెల్యేలు గురువారం ముంబై తిరిగొచ్చి బలపరీక్షకు ఆదేశించాల్సిందిగా గవర్నర్‌ను కోరతారన్న వార్తలు రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. దమ్ముంటే పేర్లు చెప్పండి: షిండే 20 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఉద్ధవ్‌తో టచ్‌లో ఉన్నారన్న శివసేన వ్యాఖ్యలను షిండే కొట్టిపారేశారు. దమ్ముంటే వారి పేర్లు చెప్పాలని సవాలు చేశారు. ఉద్ధవ్‌పై ఆయన తిరుగుబావుటా ఎగరేయడం, తన వర్గం ఎమ్మెల్యేలతో వారం రోజులుగా అసోంలోని గువాహటిలో ఓ స్టార్ హోటల్లో మకాం వేయడం తెలిసిందే. శిబిరంలో ఇప్పటికే 39 మంది సేన ఎమ్మెల్యేలు, మరో 10 మందికి పైగా స్వతంత్రులున్నారు. 19 మంది శివసేన లోక్‌సభ సభ్యుల్లో కూడా ఏకంగా 14 నుంచి 16 మంది షిండే వైపు చూస్తున్నట్టు చెబుతున్నారు. వారిలో కనీసం 12 మంది ఇప్పటికే శిబిరంలో చేరినట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం హోటల్ బయట షిండే విలేకరులతో మాట్లాడారు. తన వర్గం ఎమ్మెల్యేలందరితో కలిసి త్వరలో ముంబై వస్తానని ప్రకటించారు. బాల్ ఠాక్రే హిందూత్వ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వారంతా స్వచ్ఛందంగా తనతో కలిసొచ్చారని పునరుద్ఘాటించారు. బీజేపీ దూకుడు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలకు బీజేపీ పదును పెంచింది. అధికార సంకీర్ణంలో తలెత్తిన సంక్షోభంతో తమకు ఏ సంబంధమూ లేదని పార్టీ అంటున్నా, ఈ మొత్తం వ్యవహారంలో ఫడ్నవీస్‌దే కీలక పాత్ర అని భావిస్తున్నారు. మంగళవారం ఉదయమే ఢిల్లీ వెళ్లిన ఆయన ముందుగా అమిత్ షాతో సమావేశమయ్యారు. బీజేపీ ఎంపీ, సీనియర్ లాయర్ మహేశ్ జఠ్మలానీ కూడా ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తోంది! సేన రెబల్స్, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు అందుబాటులో ఉన్న పలు అవకాశాలపై లోతుగా చర్చించినట్టు సమాచారం. అనంతరం ఫడ్నవీస్ నడ్డా నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఇదీ నంబర్ గేమ్ సభలో మొత్తం సభ్యులు: 285/288 (శివసేన ఎమ్మెల్యేల్లో ఒకరు మరణించగా ఇద్దరు అరెస్టై జైల్లో ఉన్నారు) మెజారిటీ మార్కు: 144 షిండే కూటమిలోని ఎమ్మెల్యేలు: 49 మంది పాలక కూటమి వాస్తవ బలం: 168 షిండే తిరుగుబాటు తర్వాత: 119 బీజేపీ కూటమి వాస్తవ బలం: 113 షిండే కూటమి మద్దతిస్తే: 162 -
గెట్ రెడీ టు ఆపరేషన్ ఆకర్ష్...
సాక్షి, కామారెడ్డి: ఎన్నికలు వచ్చాయంటే చాలు అధికార పార్టీలోకి వలసలు జోరందుకోవడం సర్వసాధారణమైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు పెద్ద సంఖ్యలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మరోసారి గులాబీదళం ఆకర్ష్‌కు పదును పెట్టింది. జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు కారెక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘రాష్ట్రంలోని 16 పార్లమెంట్ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకోవాలి. అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు. సీఎం కేసీఆర్ పంపించే సైనికుడినే గెలిపించాలి’ అని బుధవా రం జహీరాబాద్ నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సభ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. దీంతో అన్ని ఎంపీ స్థానాలను గెలచుకునేందుకు ఆ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోందని కేటీఆర్ మాటల ద్వారా స్పష్టమవుతోంది. అందులో భాగంగా ఇతర పార్టీల్లోని బలమైన నాయకత్వంపై దృష్టి సారించింది. ఇటీవలి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ఫోకస్ చేసింది. ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. జహీరాబాద్ ఎంపీ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఆరు స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. ఒక్కటి మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కలిపి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు 5,76,433 కాగా... కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 4,43,468 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకన్నా 1,32,965 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అదే 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌కు 1,44,631 ఓట్ల మెజారిటీ వచ్చింది. నాలుగున్నరేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినందున మెజారిటీ మరింత పెరగాల్సిందని, కానీ గతంలోకన్నా తక్కువ ఓట్లు రావడం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ఓట్ల శాతం ఎందుకు తగ్గిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ బూత్‌ను టార్గెట్ చేసుకుని ఓట్ల శాతం పెరిగేలా పార్టీ క్యాడర్ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అంతేగాక ఎమ్మెల్యేలు తమతమ నియోజక వర్గాల్లో మెజారిటీ తేవడానికి ప్రయత్నించాలని ఓ రకంగా అల్టిమేటం జారీ చేశారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటూ చురకలు కూడా అంటించారు. ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడమే కాదు మంచి మెజారిటీ రావాలన్న టార్గెట్‌తో ఎన్నికలకు సమాయత్తమైన టీఆర్ఎస్ పార్టీ.. ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టింది. ప్రత్యర్థి పార్టీలో ఉన్న బలమైన నాయకత్వంపై దృష్టి సారించింది. జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ రావడంతో ఆ నియోజక వర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. నియోజక వర్గానికి చెందిన నేతలకు గాలం వేయడానికి గులాబీ శ్రేణులు రంగంలోకి దిగాయి. నియోజక వర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి పార్టీ మారుతాడంటూ ప్రచారం జరుగుతోంది. ప్రసార మాద్యమాల్లో వచ్చిన ఈ వార్త గురువారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. అభివృద్ధి, అవకాశాల కోసం పార్టీలో చేరమంటూ ఇతర పార్టీల నేతలకు గులాబీ దళం గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల ఘట్టం ముగిసేనాటికి.. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగిసేనాటికి ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలకు గులాబీ కండువా కప్పేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎదుటి పార్టీని బలహీన పర్చడంతో పాటు తమ బలాన్ని పెంచుకునేందుకు ఆకర్ష్‌కు పదును పెట్టినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదలై, వారు నామినేషన్లు వేసేలోగా అవకాశం రాని నేతలు పార్టీ ఫిరాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే ద్వితీయ శ్రేణి నేతలు కూడా చాలా మంది పార్టీలు మారుతారని తెలుస్తోంది. -
చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా రాదు
-
చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా రాదు
తాను రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యానని, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు 5.45 లక్షల మెజారిటీ వచ్చిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా అంత మెజారిటీ రాదన్నారు. మీ జీవితంలో ఎప్పుడూ అంత మెజారిటీ చూడలేదని మంత్రి అచ్చెన్నాయుడుకు చెప్పారు. తన చదువు గురించి అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు నిరూపించలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని వైఎస్ జగన్ సవాలు చేశారు. ఇది తనకు, చంద్రబాబుకు సవాలని గట్టిగా చెప్పారు. తాను ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే మంత్రి మాత్రం తన విద్యార్హతల గురించి సంబంధం లేని విషయాలు మాట్లాడారన్నారు. తనతో పాటు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ఓ వ్యక్తి మాట్లాడారని అంటూ లేనిపోని ఆరోపణలు చేసిన అచ్చెన్నాయుడికి వైఎస్ జగన్ దీటుగా సమాధానం ఇచ్చారు. అలాగే తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినందున తన స్థాయి ఎక్కువంటూ అచ్చెన్నాయుడు చెప్పిన అంశాలకు కూడా గట్టిగా జవాబు చెప్పారు. చట్టసభలు తనకు కొత్త కాదని, సభా సంప్రదాయాలు తనకు బాగా తెలుసని స్పష్టం చేశారు. తన స్థాయి అదని... మీ స్థాయి ఇదని గట్టి సమాధానం ఇచ్చారు.